సోషల్ మీడియాలో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వక్రీకరించబడతాయి. అసలు మాట్లాడకున్నా.. వారు స్వయంగా స్పందించి వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతాయి. అందుకు ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా పారిశ్రామిక దిగ్గజం.. టాటా సంస్థల అధినేత రతన్ టాటా వాఖ్యలు చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మరీ పెద్దఎత్తున షేర్ అయింది.
‘మద్యం అమ్మకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలి. మద్యం కోనుగోలు చేసేవారికి ఆహార సబ్సీడీ నిలిపివేయాలి. మద్యం కొనుగోలు చేసే సౌకర్యం ఉన్నవారు కచ్చితంగా ఆహారాన్ని కొనుగోలు చేస్తారు. ఉచిత ఆహారం ఇచ్చినప్పుడు వారు మద్యం కొనుగోలు చేస్తారు’ అని ఆయన పేర్కొన్నట్లు పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయింది. అయితే తన పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలపై ఆయన స్పందించారు.
చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్‌తో వేలం
‘ఆ వ్యాఖ్యలను నేను చేయలేదు. ఇది పూర్తిగా నకిలీ వార్త’ అని రతన్ టాటా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఆయన మాటాలు సోషల్ మీడియలో వక్రీకరించబడ్డాయి. ‘కరోనా వైరస్ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారుతున్నాయి’ అని ఆయన వ్యాఖానించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆయన వెంటనే దానిపై కూడా స్పందించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టతనిచ్చారు. ‘ఏదైనా నేను చెప్పాలనుకుంటే.. నా అధికారిక చానల్ ద్వారానే వెల్లడిస్తాను’ అని రతన్ టాటా క్లారిటీ ఇచ్చారు.
చదవండి: నోయిడా ట్విట్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
Comments
Please login to add a commentAdd a comment