'నేను ఫెరారి ఉన్న సన్యాసిని' | I am the monk who has a Ferrari but doesn't drive it too much, says Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

'నేను ఫెరారి ఉన్న సన్యాసిని'

Published Fri, Dec 11 2015 9:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

'నేను ఫెరారి ఉన్న సన్యాసిని'

'నేను ఫెరారి ఉన్న సన్యాసిని'

ముంబై: రెండు దశాబ్దాలకుపైగా నటప్రస్థానంలో ఇప్పటికీ తిరుగులేని స్టార్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్. ఎన్నో చిత్రాలతో అభిమానులను మెప్పించిన ఆయన తనకు ఇప్పటికీ నటించడమే చాలా ఇష్టమని చెప్తున్నాడు. కెమెరా ముందు ఉండటమే మించినదేమీ తనకు లేదని తెలిపాడు. 'నా దగ్గర అన్ని ఉన్నాయి. కానీ నేను దేనిని పెద్దగా వినియోగించను. 'ద మాంక్‌ వూ సోల్డ్ హిస్ ఫెరారి' అని ఒక పుస్తకం ఉంది. అదే తరహాలో నేను ఫెరారి కలిగిన సన్యాసిని. కానీ దానిని ఎక్కువగా నేను నడుపను' అని షారుఖ్ చెప్పాడు. 

'నాకు పనిచేయడం ఇష్టం. కెమెరా ముందు ఉండటం కన్నా దేనిని నేను ఎక్కువగా ఇష్టపడను. అదేవిధంగా పిల్లలను, నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాను' అని షారుఖ్ చెప్పాడు. నటనే తనకు అత్యంత ముఖ్యమైనదన్నాడు. ఇప్పటికే షారుఖ్‌ 80కిపైగా సినిమాల్లో నటించాడు. టీవీల్లోనూ పలు షోలతో అలరించాడు. తాజాగా కాజోల్‌తో జోడీగా నటించిన 'దిల్‌వాలే' సినిమా త్వరలోనే విడుదలకానుంది. షారుఖ్ మాట్లాడుతూ 'నాకు సిగ్గెక్కువ. వ్యక్తిగతంగా ముభావంగా ఉంటాను. ఇంట్లో ఎవరితో పెద్దగా మాట్లాడాను. సినిమా కోసమే ఐదేళ్ల తర్వాత కాజోల్‌ను కలిశాను. నేను సంఘ వ్యతిరేకినని అమ్మ ఎప్పుడూ అంటుండేది' అని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement