‘సంతోషపడ్డ తండ్రి చంద్రబాబు ఒక్కడే’ | YSRCP Leader Shiva shankar Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘సంతోషపడ్డ తండ్రి చంద్రబాబు ఒక్కడే’

Published Wed, Nov 21 2018 2:22 PM | Last Updated on Wed, Nov 21 2018 2:52 PM

YSRCP Leader Shiva shankar Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వార్ధ ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సంతోషపడ్డ ఒకే ఒక్క తండ్రి చంద్రబాబు మాత్రమేనని.. తన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రిపదవి వచ్చిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాదిమంది యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement