ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్రం అట్టుడికిపోతుంటే సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు నోరు మెదపడంలేదు ఎందుకని ఆయన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సోమవారం ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్రం అట్టుడికిపోతుంటే సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు నోరు మెదపడంలేదు ఎందుకని ఆయన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సోమవారం ప్రశ్నించారు. ఓ వేళ రాష్టం విడిపోతే వారిద్దరు తెలంగాణలో ఉంటారా లేక సీమాంధ్రలో ఉంటారా అని వ్యాఖ్యానించారు.
జైల్లో ఉండి వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సీమాంధ్రలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఎందుకు చేయరని ఆయన అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం చంచల్గూడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జగన్కు మద్దతుగా కృష్ణాజిల్లాలోని మైలవరంలో జోగి రమేష్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం దీక్ష శిబిరంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ పై విధంగా సమాధానం ఇచ్చారు.