ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని గురువారం పలువురు మంత్రులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన వీరు సీఎంతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని గురువారం పలువురు సీమాంధ్ర మంత్రులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన వీరు సీఎంతో భేటీ అయ్యారు. కిరణ్ను కలిసినవారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, వట్టి వసంత్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, తోట నర్సింహం, పితాని సత్యానారాయణ, డొక్క మాణిక్య వరప్రసాద్, ఆనం రాంనారాయణ, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర విభజన, ఆంటోనీ హైలెవల్ కమిటీ, సీమాంధ్ర ఉద్యమంతో పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసులపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.