సీమాంధ్ర మంత్రులు రాజీనామా సరికాదు: కేఎల్ఆర్ | Seemandhra ministers resign not correct: MLA KLR | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర మంత్రులు రాజీనామా సరికాదు: కేఎల్ఆర్

Published Tue, Aug 13 2013 2:22 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయడం సరికాదని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మంగళవారం అభిప్రాయపడ్డారు.

సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయడం సరికాదని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) మంగళవారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. మంత్రుల రాజీనామాలతో రాష్ట్రంలో పాలన స్తంభిస్తుందన్నారు. సీఎం కిరణ్ తక్షణమే మంత్రివర్గాన్ని సమావేశపరిచి, తాజా పరిస్థితిపై సమీక్షించాలని సూచించారు. రాజీనామాలు చేసిన మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని  తీసుకోవాలని లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాలనను మెరుగుపరిచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement