రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ అదుపు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ అదుపు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు ముఖ్యమంత్రి అదుపు ఆజ్ఞల్లోనే పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎంను కలిసిన తర్వాతే ఏపీ ఎన్జీవోలు సమైక్యరాగం ఎత్తుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే నడుస్తోందని ఆయన అన్నారు.