కిరణ్ సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారు
Published Wed, Aug 28 2013 4:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
బోనకల్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ వీఆర్‌ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరిక ఉపేందర్ మిమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రెండు రోజుల పాటు మండల జేఏసీ ఆధ ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం సీమాంధ్ర పెట్టుబడిదారుల దొపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని జల, ఖనిజ సంపదతో పాటు ఉద్యోగాలను సైతం ఆంధ్ర వారు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రయత్నించడం తగదన్నారు. ప్రస్తుతం ఆంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాలు అర్థరహితమైనవని విమర్శించారు. ఖమ్మంలో త్వరలో 500 మంది వీఆర్‌ఓలతో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ శిబిరంలో వీఆర్‌ఓల సంఘం మండల అధ్యక్షుడు జె నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ మాస్తాన్, పి.సాయిలు, కె.నాగేశ్వరరావు, కె.మేరి, శ్రీనివాసరావు, వెంకటరమణ తదితరులు కూర్చున్నారు. శిబిరాన్ని తహశీల్దార్ షేక్ ముంతాజ్, ఎంపీడిఓ కె చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, నాగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కళ్యాణపు నాగేశ్వరరావు, తన్నీరు రవి తదితరులు సందర్శించారు.
Advertisement
Advertisement