గద్వాల, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లాలో కరువు నేలగా పేరొందిన ధరూర్, గట్టు మండలాల్లోని మెట్టభూముల వైపు కృష్ణమ్మ పరుగులు తీయనుంది. వ ర్షాభావ పరిస్థితుల కారణంగా బీళ్లు గా మారిన భూములు ఇక సస్యశ్యామలం కానున్నాయి. దశాబ్దాల కల ను నెరవేరుస్తూ నేడు(శుక్రవారం) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుం చి ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీరు అం దించే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
గతేడాది సెప్టెంబర్ 14న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టును సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి నా.. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫీల్డ్ చానల్స్ సిద్ధంగా లేకపోవడం వల్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేకపోయారు. అయితే ఈ వేసవిలో ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ధరూరు, మల్దకల్ మండలాల్లోని చెరువులను నింపి తాగునీటి అ వసరాలను తీర్చేందుకు నీటిని విడుదల చేశారు. అయితే నెట్టెంపాడు ప థకం నుంచి ఆయకట్టు కోసం మొదటిసారిగా లిఫ్టులను ప్రారంభిస్తున్నా రు.
మంత్రి డీకే. అరుణ శుక్రవారం ఉదయం 11 గంటలకు గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద నీటి ఎత్తిపోతల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ రెండు లిఫ్టుల ద్వారా కనీసం 50వేల ఎకరాలకు సా గునీటిని అందించే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే ధరూరు, గట్టు, అయిజ, మల్దకల్, గద్వాల మండలాల్లోని పలు చెరువులను నింపుతారు నెరవేరనున్న మహానేత ఆశయం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలువబడే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌తో లక్ష్యం నెరవేరబోతుంది. దశాబ్దాలుగా ఎన్నికల హామీల్లో ఉన్న నెట్టెంపాడు పథకాన్ని చేపట్టడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2004 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 25వేల ఎకరాల లక్ష్యంతో శంకుస్థాపన చేసింది. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా రీసర్వే చేయించి రూ.1428 కోట్ల అంచనా వ్యయంతో మంజూరుఇచ్చారు. నేడు నెట్టెంపాడు జలాలు నడిగడ్డను సస్యశ్యామలం చేయనుండటంతో మహానేత ఆశయం నెరవేరినట్లయ్యింది.
50వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎస్‌ఈ
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి, ర్యా లంపాడు రిజర్వాయర్ల ద్వారా కనీసం 50వేల ఎకరాలకు ఈ ఖ రీఫ్ సీజన్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించినట్లు ఎస్ ఈ ఖగేందర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మంత్రి అరుణ మొదటి లిఫ్టును ప్రారంభి స్తారన్నారు. నె ట్టెంపాడు ద్వారా ఆయకట్టుకు సా గునీటిని అందించడంతోపాటు, చెరువు, కుంటల ను నింపేందుకు నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
కరువు తీరగా... సిరులు పండగ
Published Fri, Aug 9 2013 3:50 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
Advertisement
Advertisement