
కిరణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు:డీఎస్
సీఎం కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యల శుక్రవారం ఆయన నిజామాబాద్లో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన నిజామాబాద్లో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని, సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గు చూపారని డీఎస్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కిరణ్ సిఎంగా ఉన్నప్పుడే పలుమార్లు ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతిని డీఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కమిటీ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారన్నారు. ప్రస్తుత కేబినేట్ సహచరులే ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రితో చర్చించకుండా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోదని డీఎస్ చెప్పారు.