సెటిలర్లకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మంత్రి జానారెడ్డి ప్రకటించారు. సీమాంధ్రుల భద్రతకు వచ్చిన ముప్పేమి లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ యిచ్చారు. ఎక్కడ నియామకం అయిన వాళ్లు అక్కడే పని చేస్తారని జానారెడ్డి శనివారమిక్కడ అన్నారు. కొంత మంది చేసే అనుచిత వ్యాఖ్యలకు సీమాంధ్రులు కలవరపడాల్సిన పనిలేదన్నారు. రెచ్చగొట్టే చర్యలకు, అనుచిత వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణవాదులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాల మధ్య సౌభ్రాతృత్వం నెలకొనేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్తో తెలుగు ప్రజలకు నష్టం ఉండదని జానారెడ్డి తెలిపారు. అందరి ఆస్తులు, ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. అంతకు ముందు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణతో భేటీ అయ్యారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేలా సీఎం, పీసీసీ చీఫ్ కృషి చేస్తున్నారన్నారు. వారికి అండగా తమ ప్రాంత నేతలు ఉంటారని జానా తెలిపారు. ప్రభుత్వానికి విఘాతం కలగకుండా చూస్తామని, అభివృద్ధి కుంటుపడకుండా పరిరక్షిస్తామని ఆయన అన్నారు.
Published Sat, Aug 3 2013 1:37 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement