కిరణ్ అవమానించారు: రాజనర్సింహ | CM Kiran Kumar Reddy Insult Telangana ministers, says damodar raja narasimha | Sakshi
Sakshi News home page

కిరణ్ అవమానించారు: రాజనర్సింహ

Published Mon, Jan 27 2014 12:20 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

కిరణ్ అవమానించారు: రాజనర్సింహ - Sakshi

కిరణ్ అవమానించారు: రాజనర్సింహ

హైదరాబాద్: అసెంబ్లీలో విభజన బిల్లును తిరస్కరిస్తూ నోటీసు ఇచ్చే అంశంలో తెలంగాణ మంత్రులను సంప్రదించలేదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. ఇది తమను అవమానించడమేనని అన్నారు. సీఎం కిరణ్ చర్య రెచ్చగొట్టేలా ఉందన్నారు. సీఎంపై తాము విశ్వాసం కోల్పోయన్నారు.

ముఖ్యమంత్రిది కుట్రపూరిత స్వభావమన్నారు. సీఎం తీరును వ్యతిరేకిస్తూ తమ మంత్రులు అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారని తెలిపారు. తమ విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం కిరణ్ తక్షణమే రాజీనామా చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement