అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో గండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గండ్ర వెంటకరమణారెడ్డి ఆరోపించారు.
అయితే రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు ఉదయం వరంగల్లో సీమాంధ్ర ఉద్యమంపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యమం కోసం ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానం చేసుకున్నారని సారయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 రోజుల ఉద్యమాన్ని చూసీ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు.