gandra venkataramana reddy
-
భూపాలపల్లి నియోజకవర్గం గత చరిత్ర ఇదే..
భూపాలపల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో శాయంపేట నియోజకవర్గం రద్దై భూపాలపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి రెండోసారి గెలిచారు. స్పీకర్ పదవిలో ఉండి 2018లో పోటీచేసిన మదుసూదనాచారి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. గండ్ర వెంకట రమణారెడ్డి తన సమీప స్వతంత్ర ప్రత్యర్ది గండ్ర సత్యనారాయణరావుపై 14729 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. వెంకటరమణారెడ్డికి 67309 ఓట్లు రాగా, సత్య నారాయణరావుకు 54187 ఓట్లు వచ్చాయి. సత్యనారాయణరావు టిఆర్ఎస్లో చేరినా, టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేయడంతో గండ్రకు గెలుపు సులువు అయిందని అనుకోవచ్చు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మదు సూదనాచారికి 53567 ఓట్లు వచ్చాయి. 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో మధుసూదనాచారిని ఓడిస్తే, 2014లో మదుసూదనాచారి ఈయనను ఓడిరచారు. అనంతరం తెలంగాణ తొలి శాసనసభకు స్పీకర్ అయ్యే అవకాశం పొందారు. 1994లో టిడిపి తరపున గెలిచిన మధుసూదనాచారి కొంతకాలం ఎన్.టి.ఆర్. టిడిపిలో ఉన్నారు. తదనంతరం ఆయన టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ 2014లో మళ్లీ ఎమ్మెల్యే కాగలిగారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న గండ్రను 7214 ఓట్ల తేడాతో చారి ఓడిరచారు. కాని 2018లో ఓటమి చెందారు. మధు సూదనా చారి 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. గండ్ర కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 2014లో బిజెపి-టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన జి.సత్యనారాయణకు 57530 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లిలో రెండుసార్లు రెడ్డి, మరోసారి బిసి నేత గెలుపొందారు. శాయంపేట (2009లో రద్దు) 2004 వరకు ఉన్న శాయంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ఐ నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి, బిజెపి, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇక్కడ రెండుసార్లు గెలిచిన సి.జంగారెడ్డి పరకాలలో ఒకసారి గెలుపొందారు. ఈయన హన్మకొండ లోక్‌సభ స్థానానికి పోటీచేసి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును ఓడిరచి సంచలనం సృష్టించారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన మాదాటి నరసింహారెడ్డి నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. కొండా సురేఖ ఇక్కడ రెండుసార్లు, పరకాలలో ఒకసారి, వరంగల్ తూర్పు నుంచి ఒకసారి గెలిచారు. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా వున్నారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా కొంతకాలం ఉండి రాజీనామా చేశారు. 2009లో పరకాల నుంచి గెలిచారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రబుత్వంపై వచ్చిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో సురేఖ అనూహ్యంగా టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేసి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా గతంలో ఎన్నికయ్యారు. శాయంపేటలో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రేవంత్ సభపై కోడిగుడ్లతో దాడి
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడిచేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాడిపై ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలున్న ఓ థియేటర్‌పై రాళ్ల వర్షం కురిపించాయి. పావుగంటపాటు రాళ్ల దాడి కొనసాగింది. దాడిలో కాటారం ఎస్సై శ్రీనివాస్ తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రేవంత్‌కు స్వాగతం పలుకుతూ అంబేడ్కర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కటౌట్‌కు ఎదురుగా కటౌట్ ఏర్పాటు చేయడంపై మంగళవారం ఉదయం తలెత్తిన వివాదం చివరకు పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దమ్ముంటే రా బిడ్డా: గండ్రపై రేవంత్ ఫైర్ ‘కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టుపెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే యాత్ర కార్యక్రమం తీసుకున్నా’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారికి ఇదే నా హెచ్చరిక. వందమందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నావా?. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతా’అంటూ రేవంత్ మండిపడ్డారు. ‘23న మా సభతో పాటు బీఆర్ఎస్ సభ కూడా ఉంది. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదనే విజ్ఞతతో ఆ రోజు సభ వాయిదా వేసుకున్నామని రేవంత్ అన్నారు. చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్ -
పదవి రానందుకు అసంతృప్తి లేదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పదవి దక్కనందుకు తాము అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పదవుల కోసం రాలేదని, పథకాలు, సీఎం నాయకత్వంపట్ల ఆకర్షితులయ్యానని గండ్ర పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల వల్లే తన భార్య గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి వచ్చిందని గండ్ర తెలిపారు. తాను అనని మాటలను అన్నట్లు కొన్ని పత్రికలు రాయడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం తగదు: బాజిరెడ్డి మంత్రి పదవి రానందుకు ఎలాంటి అసంతృప్తి లేదని బాజిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఎవరిని నమ్ముతానో వారితో చివరి వరకు ఉంటానని, మా నాయకుడు కేసీఆరే అని తేల్చి చెప్పారు. -
‘పదో షెడ్యూల్ ప్రకారమే పార్టీ మారాం’
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్ఎస్లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్రూపిజంతో సతమతమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను లేఖ ద్వారా స్పష్టంగా వివరించామని తెలిపారు. అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా లేఖలో పేర్కొన్నామన్నారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయమని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్లో స్పష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు చదువురాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని రేగా మండి పడ్డారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల్లో ఉత్తమ్, భట్టి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసిందని ఆయన విమర్శించారు. అమ్ముడుపోవడానికి జంతువులం కాదు : గండ్ర ప్రలోభాలకు లొంగిపోవడానికి.. పదవులకు అమ్ముడుపోవడానికి మేం గొర్రెలు, బర్రెలం కాదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తమకున్న అసంతృప్తిని చాలాసార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్లో చేరామని తెలిపారు. ఎవరూ పాలన చేసినా రాజ్యాంగం ప్రకారమే చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చేరికలు జరుగుతున్నాయన్నారు. తన నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారని.. అందుకే జడ్పీ ఎన్నికల్లో తన భార్య జ్యోతి 10 వేల మెజార్టీతో గెలిచిందన్నారు. రాష్ట్ర సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యమన్నారు గండ్ర. -
ఒకేసారి ఆహ్వానించగానే వెళ్ళలేదు.. కానీ!
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు మంగళవారం భూపాలపల్లిలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో అనుచరులకు వివరించిన గండ్ర దంపతులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. గండ్ర జ్యోతి కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. తమ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని చెప్పారు. తమను నమ్మిన వారిని కాపాడుకుంటామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ పదవి కోసం తాము పార్టీ మారామన్నది వాస్తవం కాదన్నారు. తమ నిర్ణయం వల్ల కొందరు బాధపడి ఉండొచ్చునని, కానీ ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తనపై వాగుతున్న అవాకులు, చెవాకులు ఆగాలనే పార్టీ మారినట్టు చెప్పారు. ‘ఒకడు జిల్లాను తరలిస్తా అంటాడు.. ఇంకకొడు ఎలా అభివృద్ధి జరుగుద్దో చూస్తా అంటాడు.. ఇంకొకడు ఎలా తిరుగతాడో చూస్తా అంటాడు.. ప్రతిపక్షంలో ఉండి ఈ అవమానాలు భరించే కన్నా అధికార పార్టీలోకి వచ్చి ప్రజలకు అభివృద్ధి చేయాలని భావించాను. మాటలు చెప్పే వారికి నా పనితో సమాధానం చెప్పాలని టీఆర్ఎస్లోకి వచ్చాను’’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరానని, ఒకేసారి ఆహ్వానించగానే వెళ్ళలేదని, అన్ని ఆలోచించి వెళ్ళానని గండ్ర వివరణ ఇచ్చారు. -
పూర్తిస్థాయి మంత్రివర్గమేదీ?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాలు వచ్చి 40 రోజులు గడిచినా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు.ఆదివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మొత్తం 90 మంది సభ్యులున్నారు. కానీ సీఎం, హోంమంత్రితోనే పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వమంటే సమష్టి నిర్ణయమని చట్టం చెబుతోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది. ఆ తర్వాత మున్సిపల్, జెడ్పీ ఎన్నికలూ జరిగే అవకాశముంది. ఇలా ఎన్నికల కోడ్‌తో అనేక కార్యకలాపాలు నిలిచి పోయే ప్రమాదముంది. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పాలన కుంటుపడే పరిస్థితి ఉంది’ అని గండ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాన్ని తలపించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెడితే, అందులోనుంచి కొన్ని వ్యాధులను తొలగించారని తెలిసిందన్నారు. బాబు పప్పులుడకలేదు: బలాల రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో సాఫీగా జరిగాయని ఎంఐఎం సభ్యుడు అబ్దుల్లా బలాల అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీలు వచ్చినా బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కలేక నామరూపాలు లేకుండా పోయిందన్నారు. ఏపీని వదిలి ఇక్కడకు వచ్చి ప్రచారం చేసిన అక్కడి సీఎం చంద్రబాబుకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ ఫెడర ల్ ఫ్రంట్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్రాభివృద్ధిని తెలిపాయన్నారు. -
‘గండ్ర’ నన్ను మోసం చేశాడు!
భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి తనను శారీరకంగా లోబరచుకుని మోసం చేశాడని, అతడిని కాంగ్రెస్ నుంచి సస్పెం డ్ చేయాలని మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు కె.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఉదయం భూపాలపల్లి జయశంకర్ చౌరస్తా వద్ద బైఠాయించి ఆమె నిరసన చేపట్టింది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడికి చేరుకుని.. ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విజయలక్ష్మి తనతో గండ్ర మాట్లాడిన ఫోన్‌కాల్స్ రికార్డింగ్స్‌ను విలేకరులకు వినిపించింది. తనతో ఏ సంబం ధం లేకుంటే ఫోన్లో గండ్ర అలా ఎందుకు మాట్లాడుతాడని ప్రశ్నించింది. విజయలక్ష్మితో వచ్చిన మహిళలు తర్వాత ఇందిరాభవన్‌లో మాట్లాడుతూ.. విజయలక్ష్మి తన భర్త ఐదేళ్లుగా కాపురానికి తీసుకెళ్లడం లేదు.. మాట్లాడేందుకు రమ్మంటే వచ్చా మని తెలిపారు. గండ్ర గురించి అంటే తాము వచ్చే వారమే కాదని చెప్పారు. -
‘గండ్ర’ సోదరులపై ఆయుధ చట్టం కేసు
శాయంపేట: కాంగ్రెస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళవారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఎస్ఐ రాజబాబు కథనం ప్రకారం.. మండలంలోని గోవిందాపూర్ శివారులో గండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్రావు కలసి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్స్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత కంపెనీ నుంచి గండ్ర భూపాల్‌రెడ్డి వేరుపడి ఆ క్రషర్ పక్కనే మరో క్రషర్ బాలాజీ రోబో సాండ్ను ఏర్పాటు చేశారు. అయితే.. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్కు సంబంధించిన లావాదేవీలు నేటికీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో బాలాజీ రోబో సాండ్ కంపెనీకి చెందిన సూపర్ వైజర్ గోవర్దన్‌రెడ్డి సోమవారం రాత్రి క్రషర్ సమీపంలో పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి రవీందర్రావు, అతడి అనుచరులు కంపెనీ లావాదేవీలు తేలకుండా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావంటూ దాడి చేసి తుపాకీతో బెదిరించారు. గోవర్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రవీందర్రావు, అతడి అనుచరులపై ఆయుధ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా..తమ క్రషర్స్‌లో పనిచేస్తుండగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డి అనుచరులతో కలసి వచ్చి తుపాకీతో బెదిరించారని రవీందర్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గండ్ర సోదరులు, వారి అనుచరులపైనా ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజబాబు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే ‘గండ్ర’పై చీటింగ్ కేసు నమోదు
కాజీపేట అర్బన్: ఓ మహిళను మోసం చేశాడన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్‌లోని సుబేదారి పోలీసులు ఆదివారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సదయ్య, బాధితురాలు విజయలక్ష్మి కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం హన్మకొండలో మదర్ ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ క్రమంలో పరిచయమైన మాజీ ఎమ్మెల్యే గండ్రతో సాన్నిహిత్యం పెరిగింది. కాగా, నాలుగేళ్లుగా తనతో అవసరాలను తీర్చుకుని తనను దూరం చేసే కుట్రలో భాగంగా అసత్య ఆరోపణలు చేస్తు సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తనను చంపే ప్రయత్నం చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసంవద్ద ధర్నా చేపట్టింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు గండ్రపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా ఈ ఘటనపై వెంకటరమణారెడ్డి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తనపై ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పాలి
భూపాలపల్లి అర్బన్ : మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్పాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేపడుతున్న రైతు భరోసా యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. బుధవారం మండలంలోని కమలాపూర్‌లో ప్రారంభమైన యాత్ర మల్లంపల్లి, బాంబులగడ్డ, అంబేద్కర్ సెంటర్ మీదగా ఫక్కిర్‌గడ్డ, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి గ్రామానికి చేరుకుంది. అంతకుముందు పట్టణంలోని హన్మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. రాత్రి కాశీంపల్లిలోనే బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వెంకటరమణారెడ్డిమాట్లాడుతూ.. రాష్టŠట్రంలో రాచరిక పాలన కొనగుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంలో ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించిన ప్రజాప్రతినిధులే కరువయ్యారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పించకుండా పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని రైతులను తప్పుతోవ పట్టిస్తున్నట్లు విమర్శించారు. మూడెఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి.. ఉన్న పోడు, అటవీ, అసైడ్ భూములను హరితహారం పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు రావాల్సిన సబ్సిడీలను టీఆర్ఎస్ నాయకులే పంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది వాతావారణం అనుకులించకపోవడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పలువురు నాయకులసంఘీభావం.. మండలంలో వెంకటరమణారెడ్డి చేపడుతున్న యాత్రలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, దొమ్మడి సాంబయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గండ్ర జ్యోతి, చల్లూరి సమ్మయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, కుమార్‌రెడ్డి, హరిబాబు, సాగర్, పూర్ణచందర్, కటకం జనార్దన్, మల్లేష్, దేవన్, కరుణార్, కిరణ్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. -
మిర్చి ధరపై దాగుడు మూతలా: గండ్ర
సాక్షి, భూపాలపల్లి : గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాల్ మిర్చిని బోనస్‌తో కలిపి రూ.6250 కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించి పది రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం దారుమణమన్నారు. నాఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేపట్టే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. -
కట్టప్పలు ఉన్నారు...కేసీఆర్ జాగ్రత్త..!
పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్: టీఆర్ఎస్ పార్టీ అధినేత అసలు బాహుబలి అని పొగు డుతున్న వారి మాటలు చూసి పొంగిపోవద్దని, పార్టీలో కట్టప్పలు ఉన్న సంగతిని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో సభతో ప్రారంభమై అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అదే పోరుగల్లులో జరిగిన సభతోనే తిరోగమనం ప్రారంభమైంద న్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన భారీ సభలో ప్రాణత్యాగాలు చేసిన అమరులను, సిద్ధాంతకర్త జయశంకర్ ఫొటోలు పెట్టలేదని, కనీసం ఆయనను స్మరించుకోకపోవడంతో కేసీఆర్ నిరంకుశ నైజం బయటపడిందన్నారు. చరిత్రలో మిగిలిపోతుందని, ఇంత పెద్దగా ఎవరూ నిర్వహించలేదని డబ్బాలు కొట్టిన అవిర్భావ సభ కబాలి సినిమా మాదిరిగా మారిందన్నారు. -
కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనడానికి కలెక్టర్ల రివ్యూ మీటింగే నిదర్శనమని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్లకు మన ఊరు మన ప్రణాళికా అనే పాత స్కీమ్ గురించి చెప్పడం అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు. మన ఊరు మన ప్రణాళికను రెండేళ్లుగా నిర్వీర్యం చేసి మళ్లీ అమలు చేస్తామంటారా.. పేదల వివరాలు సేకరించాలంటూ కలెక్టర్లకు సూచించిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గురించి మరిచారా అన్నారు. ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని, ఇళ్లు, ఉపాధి లేని వారి వివరాలు బయటకు వస్తే.. డబుల్ బెడ్ రూమ్ కోసం ఉద్యోగాల కోసం డిమాండ్లు పెరుగుతాయనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెల్లడించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంట్లో సమీక్షలు నిర్వహిస్తూ ప్రెస్ నోట్ల ద్వారా పాలన సాగిస్తున్నారని ఎద్దేవ చేశారు. క్షేత్ర స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని పాలనలో జవాబుదారీ తనం లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. -
నాంపల్లిలో టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు పేద, మధ్య తరగతి వర్గాలు భరించలేవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శనివారం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నాంపల్లి చౌరస్తాలో టీ.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఇతర పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఛార్జీలు పెంచడమా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహాల్ పీఎస్‌కు తరలించారు. -
రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు
హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, టీ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ... రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రుణమాఫీని ఒకేసారి చెల్లించడమే అని కేసీఆర్ సర్కార్‌కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోపాటు రూ.16500 కోట్ల మిగులు బడ్జెట్ కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గండ్ర వెంకటరమణరెడ్డి సూచించారు. -
ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామా చేయలేదు
హైదరాబాద్: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామానే చేయలేదని మండిపడ్డారు. ఆర్టీఐ చట్టం కింద అసెంబ్లీ సచివాలయం ఈ వాస్తవాన్ని వెల్లడించిందని ఆయన తెలిపారు. తలసాని రాజీనామా లేఖ తమకు అందలేదంటూ స్పీకర్ కార్యాలయం ఇచ్చిన లేఖను సోమవారం రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసాని శ్రీనివాసయాదవ్ గవర్నర్, సీఎంకు చెప్పి మంత్రిగా ప్రమాణం చేసి... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తక్షణమే గవర్నర్... కేసీఆర్‌ను పిలిపించి తలసానిచే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపాలని ఆయన తలసానికి సూచించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తలసాని నిస్సిగ్గుగా రాజకీయ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. తనది ఆదర్శపాలన అని చెబుతున్న సీఎం కేసీఆర్.. తలసాని నిర్వాకంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్, సీఎం, గవర్నర్‌ను మోసం చేసిన తలసానిపై డీజీపీ సుమోటోగా కేసు పెట్టాలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. -
’ఎన్నికల హామీలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి ’
-
'విద్యుత్ ప్లాంటును తరలిస్తాననడం సరికాదు'
హైదరాబాద్: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంటును నల్గొండకు తరలించాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 1,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణం జరిగిందన్న సంగతిని గండ్ర గుర్తు చేశారు. మూడో దశగగా 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిదని.. అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కేసీఆర్ ఉపసంహరించుకోవాలనుకుంటున్నారని గండ్ర తెలిపారు. బొగ్గు, నీళ్లు అందుబాటులో ఉన్న భూపాలవల్లిలోనే ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నారు. -
ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి: గండ్ర
టీఆర్ఎస్ పార్టీపై మాజీ ప్రభుత్వ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీ ప్రలోభపెట్టడం సరికాదని మాజీ ప్రభుత్వ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలకు విప్ జారీ చేస్తున్నట్లు శనివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. విప్‌ను ధిక్కరిస్తే జెడ్పీటీసీలు తమ పదవిని కోల్పోతారని ఆయన తెలిపారు. ఓ వేళ జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని గండ్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని జెడ్పీటీసీలు ముందుగా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్లాలని ఆయన కాంగ్రెస్ జెడ్పీటీసీలకు హితవు పలికారు. -
కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం లేక నష్టం: గండ్ర
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కొంత నష్టం జరిగిందని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బస్సుయాత్ర చేపట్టినట్లుగా.. ఈసారి ప్రచారం చేసే నేత లేని లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సహకరించినా స్థానికంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయామని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పటికీ పొత్తులు, టికెట్‌లంటూనే సమయం గడిచిపోయిందని, కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ముందుగా భావించామని, పరిస్థితులను వినియోగించుకోక పోవడంతో గట్టిగా పోటీపడాల్సి వచ్చిందన్నారు. -
వైఎస్ఆర్కి ఉన్న కరిష్మా వాళ్లకెక్కడిది: గండ్ర
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప చరిష్మా గల నాయకుడని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అలాంటి నాయకుడు లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంగా మారిందని ఆయన తెలిపారు. శుక్రవారం వరంగల్‌లో గండ్ర వెంకటరమణా రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలకు జనాలు అధిక సంఖ్యలో వచ్చినా వారిని ఆకర్షించలేకపోయామని గండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీల చరిష్మా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చిన... సోనియా, రాహుల్ గాంధీలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయారన్నారు. దాంతో ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత స్థాయిలో ఓట్లు పడలేదని గండ్ర అభిప్రాయపడ్డారు. -
విభజనతో తెలంగాణకు అన్యాయం జరిగింది
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టండి మద్దతు ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం విభజనపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. విభజన అంశంపై ఇప్పటికి చంద్రబాబుకు స్పష్టత రాలేదన్నారు. విభజన ప్రక్రియపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల మధ్య సఖ్యత కోసమే సీమాంధ్రకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఆ ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు గండ్ర తెలిపారు. -
'దేశంలోనే అత్యంత దౌర్భాగ్య నాయకుడు బాబు'
దేశంలో అత్యంత దౌర్భాగ్య నాయకుడు ఎవరైన ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ప్రభుత్వ చీఫ్ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే విషయంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సోమవారం గండ్ర వెంకట రమణారెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటూ గతంలో బాబు లేఖ ఇచ్చిన సంగతిని గండ్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి మతిభ్రమించిందని గండ్ర ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు లోక్‌సభకు వచ్చిన సమయంలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల గండ్ర ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలసి చంద్రబాబు ఆ విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ అగ్రనేతలను బాబు కలసి సమావేశం కావడంపై గండ్ర మండిపడుతున్నారు. అలాగే లగడపాటి విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఆయన గురువారం పార్లమెంట్లో వ్యవహరించిన తీరుపట్ల ఇప్పటికే సొంత పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. -
'రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు'
హైదరాబాద్: రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు నాయుడు అని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భానుప్రసాద్ విమర్శించారు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు వెనుకాడరని అన్నారు. బీజేపీతో పొత్తుకు ఆరాటమే తాజా నిదర్శనమన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ ఇచ్చిన హామికి కట్టుబడాలని, గతంలో మాదిరిగా మోసం చేయవద్దని కోరారు. సీఎం కిరణ్ రాజీనామాపై వస్తున్న వార్తలను మీడియాలోనే చూస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
'రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు'
-
నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర
వరంగల్: విభజన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నియంతను తలపించిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఫిబ్రవరి 20లోగా ఆమోదం పొందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు. సోమవారం తామంతా ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని అంతకుముందు ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు. -
ఇలా సభ.. అలా వాయిదా
జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు.. బిల్లుపై ఓటింగ్‌కు వైఎస్సార్ సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో మంగళవారం సైతం సభా కార్యక్రమాలు సాగలేదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు పోడియాలను చుట్టుముట్టడంతో ఉభయసభలూ బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం సభలు ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలంటూ ఇచ్చిన నోటీసులను తిరస్కరించాలంటూ తెలంగాణ సభ్యులు, నోటీసులకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు పోడియంలలోకి వెళ్లారు. పోటాపోటీగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. శాసనసభలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహ, ఆ ప్రాంత మంత్రులు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సీమాంధ్ర టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. గందరగోళ వాతావరణంలో ప్రారంభమై రెండు నిమిషాలు కూడా గడవక ముందే స్పీకర్ మనోహర్ సభను గంట వాయిదా వేశారు. తర్వాత కూడా ఇదే పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి వారుుదా పడి మధ్యాహ్నం 2.10కి తిరిగి సమావేశమైన సభ వెంటనే బుధవారానికి వాయిదా పడింది. మండలిలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రాంతాలవారీ డిమాండ్ల నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 సమయంలో చైర్మన్ చక్రపాణి మండలిని బుధవారానికి వారుుదా వేశారు. -
అనధికార తీర్మానాలను నా ముందు పెట్టారు:గండ్ర
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అడ్మిట్ చేసిన 12 అనధికార తీర్మానాలను స్పీకర్ తనకు అప్పగించినట్లు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చ పూర్తయ్యాకే ఏ తీర్మానమైనా అనుమతించాలని స్పీకర్ తెలిపినట్లు గండ్ర స్పష్టం చేశారు. బిల్లుపై బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టి.కాంగ్ తో పాటు టి.ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిశామన్నారు. చర్చకు అదనపు సమయం కోరడం..బిల్లును అడ్డుకునే కుట్రలో భాగమని గండ్ర తెలిపారు. కిరణ్ నోటీసు ఉపసంహరించుకుంటేనా సభను నడవనిస్తామన్నారు. విభజన బిల్లుపై అదనపు గడువు కోరడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని గండ్ర తెలిపారు. బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. -
సీఎం నోటీసు చెల్లదు: శ్రీధర్, గండ్ర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తిరస్కరించాలంటూ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులన్నారు. ‘ప్రభుత్వం తరఫున నోటీసివ్వాలంటే మంత్రివర్గంలో అందరి ఆమోదమూ ఉండాలి. అందుకు భిన్నంగా ఉన్న ఈ నోటీసును అనధికార తీర్మానంగానే భావించి తిరస్కరించండి’’ అని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రవీణ్‌కుమార్, కె.శ్రీధర్, బాలూనాయక్, చిరుమర్తి లింగయ్య, ప్రతాప్‌రెడ్డిలతో కలసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించకుండా ప్రభుత్వం తరపున నోటీసిచ్చే అధికారం ఆయనకు లేదన్నారు. అంతేగాక శాసనసభ నిబంధన 77 కింద ఆయన ఇచ్చిన నోటీసు రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద పంపిన బిల్లుకు వర్తించదన్నారు. బిల్లును తిరస్కరించాలని చెబుతున్న కిరణ్, దానిపై చర్చించేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలంటూ రాష్ట్రపతిని ఎందుకు లేఖ రాసినట్టని ప్రశ్నించారు. పైగా ఆ లేఖలో కూడా ‘బిల్లు’ అని ప్రస్తావించారే తప్ప ముసాయిదా బిల్లని ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు. -
సీఎం ప్రతీమాట, ప్రతీ అడుగు కుట్రపూరితమే:చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడే ప్రతీ మాట, ప్రతీ అడుగు కుట్రపూరితమేనని గండ్ర విమర్శించారు. సీఎం ఏకపక్ష నిర్ణయంతో స్పీకర్ కు నోటీసు పంపిచడాన్ని తప్పుబట్టారు.జీవోఎంతో చర్చించకుండానే ఆయన నోటీసు పంపిచడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకోవడానికే సీఎం కుట్ర పన్నారన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని పార్టీల తెలంగాణ నేతలు, ప్రజా ప్రతినిధులతో ఫోన్ లలో సంప్రదించామన్నారు. అందరూ కలిసి తెలంగాణ సాధించే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. -
రాష్ట్రపతితో బాబు ఏకాంత చర్చెందుకో?
టీడీపీ అధినేతకు గండ్ర ప్రశ్న జగన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసిస్తాం వరంగల్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు ఏకాంత చర్చల మర్మమేమిటో చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో కలిసి వెళ్లకుండా ఒక్కరే చర్చలు జరపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో కలిసి ఆయన శుక్రవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు ప్రతీకగా నిలుస్తున్నారని, రాష్ట్రపతిని కలిసే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. బాబు సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో అసెంబ్లీలో తెలంగాణ పదం కూడా ఉచ్ఛరించనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. స్వతంత్రంగా పోటీ చేయలేక బీజేపీ నుంచి ఆహ్వానాలు తెప్పించుకుని మరీ సభలకు హాజరవుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ స్పీకర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాట్లాడారని గండ్ర ఆరోపించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన తర్వాత స్పీకర్‌కు ప్రత్యామ్నాయం ఉండదనే విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పీకర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా జగన్ మాట్లాడుతున్నారని, తక్షణం ఆయన తన మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జనవరి 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు. సభలో సభ్యుడు కానప్పటికీ అసెంబ్లీకి పిలిపిస్తామన్నారు. -
రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
-
సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ
హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సోమవారం నుంచే ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బిల్లు ప్రతులను తెలుగులోకి అనువదించటం సమస్య కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. సోమవారమే బిల్లు ప్రతులను సభ్యులందరికీ ఇస్తామన్నారు. బిల్లును సభలో చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపడమే తమ అజెండా అన్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని గండ్ర సూచించారు. -
సీఎం.. పిల్లికూతలు మానుకోవాలి
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి శాయంపేట, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిల్లికూతలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజల పక్షాన ఉంది కాబట్టే.. రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. లేదంటే వందేళ్లరుునా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయని, అందులో మొదటి ముద్దాయి ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడేనన్నారు. సమన్యాయం కావాలని చెప్పడం చూస్తుంటే.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన బెట్టి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. కొంత మంది నాయకులు తెలంగాణ ప్రజలకు గొప్పలు చేసినట్లు ఇంటింటికి వె ళ్తున్నారని, వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు, మరేనాయకుడైనా మనపై పెత్తనం చెలాయించాలనే చూశారు తప్ప.. అభివృద్ధి చేయాలని చూడలేదన్నారు. తెలంగాణ సాధనకు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామన్న కేసీఆర్ మాటలు నిజమైతే.. ఎలాంటి షరతులు లేకుండా టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేయాలన్నారు. కాదు కూడదంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని గండ్ర అన్నారు. -
ఆల్మట్టి ఎత్తుకు చంద్రబాబు సహకరించారు:చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: ఆల్మట్టి ఎత్తుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహకరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వైఫల్యం వల్లే కృష్ణా జిల్లాల సమస్య వచ్చిందని ఆయన మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమర్థించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని భావిస్తున్నట్లు గండ్ర తెలిపారు. రేపు జరుగనున్న రాష్ట్ర కేబినేట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల అంశం ఖరారు అయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో జరిగే సమావేశాలు ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరివి కావచ్చని తెలిపారు.విభజన బిల్లుపై సభలో మూడు రోజుల చర్చ సరిపోతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'చంద్రబాబు యాత్ర విహార్ యాత్రను తలపిస్తోంది'
హైదరాబాద్: తుపాను ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్ర విహార్ యాత్రను తలపిస్తోందని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎర్ర తివాచీలను పరుచుకుని రైతులను ఓదార్చడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన బాబు తీరును దుయ్యబట్టారు. కార్పెట్లపై పూలు చల్లించుకుని చంద్రబాబు పొలాలకు వెళ్లడం రైతుల బాధలు పట్టవనడానికి నిదర్శనమని గండ్ర అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఓటు రాజకీయాలు చేయడమే తప్పా, ప్రజా సమస్యలు పట్టవని ఆయన మండిపడ్డారు. ఆయన ఏం చేసినా ఓట్లు-సీట్లు కోసమే చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ అని గండ్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులను ఎత్తి వేయాలని జీవోఎంకు లేఖ రాశామన్నారు. -
బ్రాండ్ ఇమేజ్ కోసమే బాబు తపన: గండ్ర
వరంగల్: బ్రాండ్ ఇమేజ్, ప్రచారం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హన్మకొండలో శనివారం జరిగిన కాంగ్రెస్ కృతజ్ఞత సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై జీవోఎంకు ఆ రెండు పార్టీలు అభిప్రాయాలు చెప్పకుండా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. వాటి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఓట్లు, సీట్లు కోసమే బాబు తాపత్రయ పడుతున్నారని, రానున్న రోజుల్లో ఆయన పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని జోస్యం చెప్పారు. రచ్చబండ ఫ్లెక్సీల్లో సీఎం కిరణ్ ఫొటో ఉండడంపై సొంత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా.. అని విలేకరుల అడిగిన ప్రశ్నలకు అధిష్టానం చూసుకుంటుందని ఆయన సమాధానం దాటవేశారు. -
విభజనతోనే రెండు రాష్ట్రాల అభివృద్ధి: పొన్నాల
హన్మకొండ: విభజనతోనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ 10 జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సభలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రెండు రోజులు ప్రయాణిస్తే గానీ హైదరాబాద్ చేరుకోని ఆంధ్ర ప్రాంత పేదలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుండగా.. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంలో 250 ఏళ్లుగా వేరుగా ఉన్న తెలంగాణ ప్రజలు ఆందోళన చెందితే లేనిది.. 60 ఏళ్లు కలిసి ఉన్నందుకే సీమాంధ్రులు ఆందోళన చెందుతూ సమైక్యంగా ఉండాలని కోరడంలో అర్థం లేదన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన కాకాని వెంకటరత్నం చితాభస్మం సాక్షిగా నాయకులు రౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర నాయకులు ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకోవడం మరచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని రక్షించుకుంటేనే బతుకు ఉంటుందని, కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారని తెలిపారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక ఎన్ఎంయూ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాఖకు జిల్లాకు చెందిన లింగాల శ్రీరాములరెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో ఆవిర్భావ సభ నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఇటీవల జరిగిన చర్చలలో చేసుకున్న ఒప్పందాలను తమ ఘనతగానే ఎంప్లాయూస్ యూనియన్ చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు. -
చట్టప్రకారమే జగన్‌కు బెయిల్: బొత్స
చట్టప్రకారమే వైఎస్ జగన్‌కు బెయిల్ వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కోర్టు కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటామని తెలిపారు. నిన్నటి వరకు సీబీఐ మంచిదన్న చంద్రబాబుకు నేడు చెడుగా కనిపిస్తోందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జగన్ బెయిల్ వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. జగన్‌కు చట్టప్రకారం బెయిల్ వచ్చిందని తెలిపారు. -
'టీడీపీ ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళపరుస్తుంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల ప్రజలను గందరగోళ పరిచేందుకు టీడీపీ వ్యవహారిస్తుందని ఆయనా ఆరోపించారు. ఆ పార్ట ఓ విధంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అటువంటి విధానం టీడీపీకి సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ అధ్యక్షురాలు నిన్న జాతీయ మీడియా కేంద్రాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆమె తొలిసారిగా నోరు విప్పారు. ఆ రాష్ట్ర విభజనపై ఓ ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో గండ్ర పై విధంగా స్పందించారు. -
రాష్ట్రాల ఏర్పాటులో సీఎం పెద్దన్న పాత్ర పోషించాలి
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో గండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గండ్ర వెంటకరమణారెడ్డి ఆరోపించారు. అయితే రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు ఉదయం వరంగల్‌లో సీమాంధ్ర ఉద్యమంపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యమం కోసం ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానం చేసుకున్నారని సారయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 రోజుల ఉద్యమాన్ని చూసీ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు.