'రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు'
హైదరాబాద్: రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు నాయుడు అని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భానుప్రసాద్ విమర్శించారు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు వెనుకాడరని అన్నారు. బీజేపీతో పొత్తుకు ఆరాటమే తాజా నిదర్శనమన్నారు.
తెలంగాణ విషయంలో బీజేపీ ఇచ్చిన హామికి కట్టుబడాలని, గతంలో మాదిరిగా మోసం చేయవద్దని కోరారు. సీఎం కిరణ్ రాజీనామాపై వస్తున్న వార్తలను మీడియాలోనే చూస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.