MLC Yadava Reddy
-
‘కారు’ దిగుతున్న గులాబీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్లోని పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరిపై టీఆర్ఎస్ అధిష్టానం స్వయంగా వేటు వేస్తోంది. కారణాలు ఏమైనా అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ నెల 20న టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోపే మరికొందరు కీలక ప్రజాప్రతినిధులపై ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ముఖ్యలు ప్రకటిస్తున్నారు. అసంతృప్తితో ఒక్కొక్కరు.. టీఆర్ఎస్ వ్యవహారాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం రాహుల్‌ని, ఆ తర్వాత సోనియాగాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ అధికారికంగా ప్రకటించకపోయినా టీఆర్ఎస్కు దూరమయ్యారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి పోటీ చేసే 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, రాములునాయక్, కొండా మురళీధర్‌రావు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, బొడిగె శోభ, బి.సంజీవరావు టీఆర్ఎస్ను వీడారు. వీరిలో కొండా సురేఖ, సంజీవరావు కాంగ్రెస్‌లో చేరారు. బాబుమోహన్, శోభ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, ఎన్.బాలునాయక్, రమేశ్‌రాథోడ్, కేఎస్ రత్నం సైతం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. యాదవరెడ్డిపై వేటు.. ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
వారిపై వేటు వేయాల్సిందే
* నేతి విద్యాసాగర్ సహా 8 మంది ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేయనున్న డీఎస్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించిన పార్టీ ఎమ్మెల్సీలపై సాధ్యమైనంత తొందరగా అనర్హత వేటు వేయించే దిశగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. వారిలో ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, డి.రాజేశ్వర్లపైనా అనర్హత పిటిషన్ దాఖలు చేసేందుకు మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సిద్ధమయ్యారు. కాగా, మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన అనంతరం డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దల సభగా పరిగణించే మండలిని గ్రామ సర్పంచ్ స్థాయికన్నా దిగువకు టీఆర్ఎస్ దిగజార్చిందని మండిపడ్డారు. కలిసి పనిచేస్తామని.. కలిపేసుకోవడమా?: షబ్బీర్ అలీ తెలంగాణ పునర్నిర్మాణంలో అందరితో కలిసి పనిచేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అన్ని పార్టీలను టీఆర్ఎస్లో కలుపుకొంటున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. కలిసి పనిచేయడమంటే ఇదేనా ? అని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించారు: దిగ్విజయ్ సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు చట్టాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చిన దిగ్విజయ్.. అనంతరం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై టీఆర్ఎస్లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటింపజేసే దిశగా ప్రక్రియను చేపడతాం..’’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధం: టీడీపీ మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్సీ ఎ.నర్సారెడ్డి విమర్శించారు. -
బంగారు తెలంగాణ కోసమే మద్దతు
* సభలో విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల వివరణ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు వెల్లడించారు. శాసనమండలి నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు. మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయడాన్ని వారు సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నవ తెలంగాణ హీరోగా అభివర్ణించారు. తెలంగాణ హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవసరమైతే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నామని జగదీశ్వర్‌రెడ్డి సభలోనే ప్రకటించారు. 20 రోజుల కిందటే టీఆర్ఎస్కు అండగా ఉండాలని నిర్ణయించామని రాజలింగం తెలిపారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీఎస్.. ఇప్పుడు చైర్మన్ ఎన్నికప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు. -
'రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు'
హైదరాబాద్: రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు నాయుడు అని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భానుప్రసాద్ విమర్శించారు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు వెనుకాడరని అన్నారు. బీజేపీతో పొత్తుకు ఆరాటమే తాజా నిదర్శనమన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ ఇచ్చిన హామికి కట్టుబడాలని, గతంలో మాదిరిగా మోసం చేయవద్దని కోరారు. సీఎం కిరణ్ రాజీనామాపై వస్తున్న వార్తలను మీడియాలోనే చూస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
'రాష్ట్రానికి పట్టిన పెద్ద శని చంద్రబాబు'