* సభలో విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల వివరణ
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు వెల్లడించారు. శాసనమండలి నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు. మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయడాన్ని వారు సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నవ తెలంగాణ హీరోగా అభివర్ణించారు.
తెలంగాణ హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవసరమైతే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నామని జగదీశ్వర్‌రెడ్డి సభలోనే ప్రకటించారు. 20 రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని నిర్ణయించామని రాజలింగం తెలిపారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీఎస్.. ఇప్పుడు చైర్మన్ ఎన్నికప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు.
బంగారు తెలంగాణ కోసమే మద్దతు
Published Thu, Jul 3 2014 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement