హైదరాబాద్: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంటును నల్గొండకు తరలించాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 1,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణం జరిగిందన్న సంగతిని గండ్ర గుర్తు చేశారు.
మూడో దశగగా 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిదని.. అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కేసీఆర్ ఉపసంహరించుకోవాలనుకుంటున్నారని గండ్ర తెలిపారు. బొగ్గు, నీళ్లు అందుబాటులో ఉన్న భూపాలవల్లిలోనే ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నారు.