వైఎస్ఆర్కి ఉన్న కరిష్మా వాళ్లకెక్కడిది: గండ్ర | YS Rajasekhar reddy Charisma leader, says Gandra Venkataramana Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్కి ఉన్న కరిష్మా వాళ్లకెక్కడిది: గండ్ర

Published Fri, May 2 2014 2:35 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

వైఎస్ఆర్కి ఉన్న కరిష్మా వాళ్లకెక్కడిది: గండ్ర - Sakshi

వైఎస్ఆర్కి ఉన్న కరిష్మా వాళ్లకెక్కడిది: గండ్ర

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప చరిష్మా గల నాయకుడని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  అలాంటి నాయకుడు లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంగా మారిందని ఆయన తెలిపారు. శుక్రవారం వరంగల్లో గండ్ర వెంకటరమణా రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలకు జనాలు అధిక సంఖ్యలో వచ్చినా వారిని ఆకర్షించలేకపోయామని గండ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీల చరిష్మా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చిన... సోనియా, రాహుల్ గాంధీలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయారన్నారు. దాంతో ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత స్థాయిలో ఓట్లు పడలేదని గండ్ర అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement