
సీఎం ప్రతీమాట, ప్రతీ అడుగు కుట్రపూరితమే:చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడే ప్రతీ మాట, ప్రతీ అడుగు కుట్రపూరితమేనని గండ్ర విమర్శించారు. సీఎం ఏకపక్ష నిర్ణయంతో స్పీకర్ కు నోటీసు పంపిచడాన్ని తప్పుబట్టారు.జీవోఎంతో చర్చించకుండానే ఆయన నోటీసు పంపిచడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకోవడానికే సీఎం కుట్ర పన్నారన్నారు.
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని పార్టీల తెలంగాణ నేతలు, ప్రజా ప్రతినిధులతో ఫోన్ లలో సంప్రదించామన్నారు. అందరూ కలిసి తెలంగాణ సాధించే దిశగా ముందుకెళ్తున్నామన్నారు.