రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, టీ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, టీ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ... రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రుణమాఫీని ఒకేసారి చెల్లించడమే అని కేసీఆర్ సర్కార్కు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోపాటు రూ.16500 కోట్ల మిగులు బడ్జెట్ కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కి గండ్ర వెంకటరమణరెడ్డి సూచించారు.