T cong leader
-
వరంగల్: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. ఎవరికి వారే.. యమునా తీరే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులు, నేతల తీరు మారడం లేదు. ‘ఎవరికీ వారే.. యమునా తీరే’లా ఉంది సీనియర్ల పరిస్థితి. టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్లినా మార్పులేకపోగా.. రోజురోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై గొడవలకు దారి తీస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన పరస్పర బహిష్కరణల ప్రకటనల పర్వం ఇప్పుడు జనగామ నియోజకవర్గం వరకు పాకింది. సుమారు తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నా.. పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి సారించని కొందరు.. అధిష్టానం సూచనలు, నిర్ణయాలను పెడచెవిన పెడుతున్నారు. వారిని కట్టడి చేయడంలో అధిష్టానం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. కాంగ్రెస్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. ● ములుగు నియోజకవర్గం మినహా మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలు దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ● స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికి వస్తే గతంలో అక్కడ పోటీ చేసిన సింగాపురం ఇందిర టికెట్ ఆశిస్తుండగా, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్యల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ● పరకాల, భూపాలపల్లిలనుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గండ్ర సత్యనారాయణరావుల పేర్లుండగా. రెండో టికెట్ కోసం పరకాలపై కొండా సురేఖ దంపతులు చేస్తున్న ప్రయత్నాలు ఆగలేదన్న చర్చ ఉంది. దీంతో పరకాలలో ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా సురేఖ దంపతుల మధ్య గ్రూపుల వైరం సాగుతూనే ఉంది. ● మహబూబాబాద్ నుంచి మురళీనాయక్, బెల్లయ్యనాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లు, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, నెహ్రునాయక్లు పోటాపోటీగా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం. ● పాలకుర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడక్కడ ససేమిరా అంటున్న జంగా రాఘవరెడ్డి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దాదాపుగా నాయిని రాజేందర్‌రెడ్డి ఖరారైనట్లేనన్న ప్రచారం జరుగుతున్నా తాను సైతం పోటీలో ఉంటానంటున్నారు. ● వరంగల్ తూర్పు, నర్సంపేటల నుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిల పేర్లుండగా, పాలకుర్తిలో ఎవరన్నది ఇంకా తేలడం లేదు. కొనసాగుతున్న బహిష్కరణల పర్వం.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిల నడుమ వైరం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారిన రాజకీయవైరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. చివరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి తొలగిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పోటీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాఘవరెడ్డి తనను బహిష్కరించే అధికారం నాయినికి లేదని కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఈ వివాదం చోటుచేసుకోగా ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ సందర్భంగా పునరావృతం కాలేదు. దీంతో పరిస్థితి చక్కబడిందని భావిస్తున్న సమయంలో జనగామ కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిల వర్గాల మధ్య విభేధాలు తారస్థాయికి చేరాయి. కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ప్రకటన చేశారు. దీని వెనుక పొన్నాల లక్ష్మయ్య హస్తం ఉందని, అసలు డీసీసీ వర్కింగ్ కమిటే లేనప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడిదంటున్న కొమ్మూరి వర్గీయులు మరో ప్రెస్మీట్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డిలు పోటాపోటీగా మీడియా సమావేశాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికే సందర్భంగా ఇద్దరు నాయకులు, వారి అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. -
అండగా ఉంటాం...: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట ధా న్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలపైనే తను వు చాలించిన రైతు బీరయ్య ఇంటికి ప్రజాప్రతిని ధులు, నాయకులు వరుసకట్టారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య శుక్రవారం తెల్లవారేసరికి వడ్ల కుప్పమీదనే కన్నుమూసిన ఘటన ప్రజలను కంటతడి పెట్టించింది. ఈ నేపథ్యంలో రాజ కీయ పార్టీల నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బీర య్య కొడుకుతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. కాం గ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందవద్దని, రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావుతో కలసి ఐలాపూర్‌లోని బీరయ్య ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బీరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్లే బీరయ్య చనిపోయారని ఆరోపించారు. బీరయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం సాయం అందించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మరో కాంగ్రెస్ నేత సుభాష్‌రెడ్డి, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బీరయ్యది సహజ మరణమే! ఇదిలా ఉండగా లింగంపేట మండల అధికారులు.. ఎల్లారెడ్డి ఆస్పత్రి వైద్యుల నివేదిక ఆధారంగా బీరయ్యది సహజ మరణమేనని తేల్చారు. రైతు బీరయ్యది సహజ మరణమని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదంటూ జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. -
'టీఆర్ఎస్ సర్కార్‌కు అలవాటైపోయింది'
కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. మంచి జరిగితే ప్రభుత్వం గొప్పతనం... నష్టం జరిగితే గత ప్రభుత్వాల అసమర్థల అనడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని టీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు. మిడ్ మానేరుపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్బంగా టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మిషన్ కాకతీయ పేరుతో అవినీతి జరుగుతుందని పొన్నం విమర్శించారు. -
‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలి’
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం నుంచి నిధులు సాధించడం చేతకాక అప్పులుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో బుధవారం వి. హనుమంతరావు విలేకరులతో మాట్లాడుతూ... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తెలంగాణకు ఎందుకు సాధించలేకపోతున్నారని అడిగారు. నాబార్డు నుంచి 7వేల కోట్లు అప్పు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ విమర్శించారు. ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నామనే సోయి కేసీఆర్‌కు, హరీష్‌రావుకు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. కార్పొరేట్లకు 50వేల కోట్లు మాఫీ చేసి, రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. నయీం కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్సింగ్కు లేఖ రాసినట్టుగా వీహెచ్ ఈ సందర్బంగా తెలిపారు. -
'టీఆర్ఎస్ ఎందుకు అడగటం లేదు'
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కావాలని కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లేకపోతే రాష్ట్రానికి ఆర్థిక భారం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మించలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ అనవసరమని మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సవాల్ విసిరినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదన్నారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కావాలన్న కేసీఆర్ ఇప్పడు రీడిజైన్‌తో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం జాతీయ హోదా ఇవ్వదనే అడగటం లేదన్నారు సాంకేతికంగా ఆమోదయోగ్యం కాని డిజైన్లతో కాళేశ్వరం చేపడుతున్నారని ఆరోపించారు. కాబట్టే జాతీయ హోదా రాదని తెలిసి అడగటం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లను సంతృప్తి పరిచేందుకు, అవినీతి కోసమే... ఇష్టానుసార డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతిని జరగనివ్వకుండా... అడ్డుకుంటామని మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నాసిరకంగా పుష్కరాల పనులు :వీహెచ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుళ్లు గోపురాలు తిరగడానికి తప్ప ఆయనకు వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జి నాసిరకంగా ఉందని... పిల్లర్ పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగుతోన్న పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సోమా కంపెనీ ఎవరిదో బయటకు రావాలని వీహెచ్ అన్నారు.గవర్నర్‌కు ఇచ్చే వినతి పత్రాలన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు న్యాయం జరగదన్నారు. ఛలో మల్లన్న సాగర్‌కు తనను పిలవలేదని కాంగ్రెస్ నాయకులపై వీహెచ్ మండిపడ్డారు. నేను మల్లన్నసాగర్‌కు వెళ్తే.. ఎవరిని అడిగి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి అనడం దారుణమని వీహెచ్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులను ఆమె బెదిరించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన నాయకులే నన్ను వద్దని అన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్' పరిశీలించిన మర్రి శశిధర్ రెడ్డి
న్యూఢిల్లీ : రిజర్వాయల్ అవసరం లేకుండానే మల్లన్నసాగర్, పాములపర్తికి నీటిని పంపింగ్ చేయొచ్చు అని టి.కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం హర్యానాలోని జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మర్రి శశిధర్‌రెడ్డి, ప్రొ.పురుషోత్తం రెడ్డి బృందం పరిశీలించింది. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ... రిజర్వాయర్ లేకుండానే అక్కడ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. -
'కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారు'
మెదక్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం మెదక్‌లో నిప్పులు చెరిగారు. కేసీఆర్, చంద్రబాబు చీకటి ఒప్పందం వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారని విమర్శించారు. -
కేసీఆర్ అసమర్థత వల్లే...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ..కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును హైకోర్టు విభజనకు ఒప్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. అందువల్లే న్యాయవాదులు రోడ్డుకెక్కాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. హైకోర్టు కోసం ఢిల్లీలో దీక్ష చేపడుతానంటున్న సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఆ డిమాండ్ నెరవేరాకే తిరిగి రాష్ట్రానికి రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ తొత్తుగా బార్ అసోసియేషన్ మారిందని విమర్శించారు. మీలో చిత్తశుద్ధి ఉంటే ఛలో సెక్రటేరియట్, ఛలో క్యాంప్ ఆఫీస్.. ఛలో టీఆర్ఎస్ ఆఫీస్‌కు పిలుపునివ్వాలని బార్ అసోసియేషన్‌కు సవాల్ విసిరారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్షాన్ని న్యూఢిల్లీకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ను పొన్నం డిమాండ్ చేశారు. న్యాయవాదులు నిరసనలు చేపట్టవద్దంటూ జారీ చేసిన మెమోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
'కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుంది'
హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గీతారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలుపై ఈ ప్రభుత్వం వందల కోట్ల భారం వేసిందని విమర్శించారు. తగ్గించకపోతే ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని ఆమె హెచ్చరించారు. మిషన్ భగీరథ, పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నిర్మాణ వ్యయాలను అంచనాలను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచేస్తుందని చెప్పారు. కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుందని టీఆర్ఎస్పై గీతారెడ్డి మండిపడ్డారు. -
మోదీ, కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో మధు యాష్కీ మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారుకులైన వారే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ దళితులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మధు యాష్కీ నిప్పులు చెరిగారు. -
ఎంతమంది హరీశ్‌రావులు వచ్చినా...
సంగారెడ్డి : తాను టీఆర్ఎస్లో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ముందుగా టీఆర్ఎస్లోకి పంపించి తర్వాత తాను టీఆర్ఎస్లో చేరతాననే ప్రచారం జరుగుతోందని... అయితే ఇది అబద్ధమన్నారు. పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి పెద్ద తప్పు చేశానని, తిరిగి అలాంటి తప్పు చేయబోనని తెలిపారు. టీఆర్ఎస్లోకి కేవలం చప్రాసుల వంటి వాళ్లే వెళ్తారని ఆరోపించారు. అటువంటి వారినే ఆ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు. తనలాగా ముందుండి పనిచేసే వారిని ఆపార్టీ నాయకులు తీసుకోరన్నారు. మంత్రి హరీశ్‌రావు కేవలం సంగారెడ్డిలో టీఆర్ఎస్ను బలపర్చుకోవడం కోసమే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారని ఆయన చెప్పారు. . 2019లో జరిగే ఎన్నికల్లో ఎంతమంది హరీశ్‌రావులు వచ్చినా సంగారెడ్డితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
'దత్తాత్రేయను కవిత కలవడం ఓ డ్రామా'
హైదరాబాద్ : బీడీ, సిగరెట్ ప్యాకెట్లపై పుర్రె గుర్తు శాతం తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే పుర్రె గుర్తు శాతం తగ్గించడంపై ప్రధాని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలవాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలవడం ఓ డ్రామా అని మధుయాష్కీ అభివర్ణించారు. -
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
నల్గొండ: నల్గొండ జిల్లా పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్గొండలో నిప్పులు చెరిగారు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక దందాల్లో పోలీసులే ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10 జాతీయ రహదారులు దిగ్బంధిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. శనివారం నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తుమ్మల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి వైద్యులతో కూడా వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తుమ్మల వాకబు చేశారు. వెంకట్‌రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ తుమ్మల ఆకాంక్షించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. నేపథ్యంలో ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు'
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డా. డి. శ్రవణ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో డి.శ్రవణ్ విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గతంలో సీఎం కేసీఆర్ ఆరోపించారని... అలాంటిది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే... టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులపై శ్రవణ్ మండిపడ్డారు. -
ఫాంహౌస్‌లో రూ. కోట్లు దాచిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి దామోదర రాజనర్సింహ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రికి పోలీసు రక్షణ కల్పిస్తూ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని విమర్శించారు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎస్పీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఓ డిక్టేటర్లా తయారయ్యారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా ? కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో రూ.కోట్లు దాచారని, వాటి గురించి మాత్రం పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్ఎస్ శాసనసభ్యులే డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని రాజనర్సింహ అన్నారు. ఈ విషయాలను మీడియా ప్రజలకు తెలియజేయాలన్నారు. గంగాధర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనింట్లో సొంత డబ్బు దాచుకుంటే పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఇంట్లోకెళ్లి బీరువా ధ్వంసం చేసి డబ్బులు లాక్కొచ్చారని ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు నోటా బటన్, ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎన్నికల అవకతవకలపై ఈసీ దృష్టికి తీసుకెళ్తాం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. గాంధీభవన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత వీవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లను అమర్చారు’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రిటింగ్ మిషన్లను ఎందుకు అమర్చలేదని, అలాగే ఈవీఎంలలో నోటా బటన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి, సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2010 ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలంటూ టీఆర్ఎస్ నేత ఎస్.నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పట్లో ఈసీ సమర్థించకపోతే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చేత నామినేషన్ దాఖలు చేయించారని శ్రావణ్ చెప్పారు. జాంబాగ్‌లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్‌బూత్ పరిధిలో 125 ఓట్లు ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయన్నారు. 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే... లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్కు వంద సీట్లు, తమ మిత్రపక్షం ఎంఐఎంకు 45 సీట్లు వస్తాయని కచ్చితంగా ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ సోమవారం గాంధీభవన్‌కు రావాలని కోరారు. డివిజన్ వారీగా పోలైన ఓట్లపై సమీక్ష జరిపి తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శ్రావణ్ చెప్పారు. -
దానమన్నా... ఏడున్నవే..!
కాంగ్రెస్ కార్యకర్తల ఎదురుచూపులు పార్టీకి అండగా నిలిచేవారే లేరా అని ఆవేదన బంజారాహిల్స్: ‘ఇక కదన రంగంలోకి దూకుతా.. రేపటి నుంచే దుమ్మురేపుతా.. ఒక్కొక్కరి పంచెలూడగొడతా...’ఇదీ పది రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ గర్జన. ఇక కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకొని అధికార విపక్ష పార్టీలకు చెమటలు పటిస్తుందని కార్యకర్తలు సంబురపడ్డారు. సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.. తీరా చూస్తే ఆయన ఇంత వరకు రంగంలోకి దిగకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ నిరాశ నిస్రృహల్లో మునిగిపోయారు. ఈ నెల 4వ తేదీన దానం నాగేందర్ తన నివాసంలోను, షబ్బీర్ అలీ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రేపటి నుంచే బస్తీల్లో పర్యటిస్తానని, సమావేశాలు ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఆ తెల్లవారే ఫిలింనగర్‌లోను, సోమాజిగూడలోను రెండు చోట్ల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గట్టిగానే మాట్లాడారు. ఆ తెల్లవారునుంచి కనిపించకుండాపోయారు. అన్ని డివిజన్లలో తిరుగుతారని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నట్లు టీవీ చానెల్లో కనిపించడంతో కార్యకర్తలు సరిపెట్టుకున్నారు. తీరాచూస్తే నగరానికి వచ్చి కూడా సమావేశాల్లో పాల్గొనకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఒక వైపు టీఆర్ఎస్, బీజేపీ జనంలోకి దూసుకెళ్తూ పట్టు పెంచుకుంటుంటే కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తున్నది. -
రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు
హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, టీ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ... రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రుణమాఫీని ఒకేసారి చెల్లించడమే అని కేసీఆర్ సర్కార్‌కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోపాటు రూ.16500 కోట్ల మిగులు బడ్జెట్ కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గండ్ర వెంకటరమణరెడ్డి సూచించారు. -
కేసీఆర్ చైనా వెళ్లడం వల్లే వర్షాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లా రైతు లింబయ్య ఆత్మహత్యపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి బహిరంగ సవాల్ విసిరారు. లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయ సంక్షోభమే కారణమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 491 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీఆర్ఎస్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. మెదక్ జిల్లాలో 55 మంది రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఆయన ఆ పార్టీ నాయకులను నిలదీశారు. సదరు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని అడిగారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలన్నారు. కేసీఆర్ చైనాకు వెళ్లడం వల్లే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నాళ్లు కేసీఆర్ విదేశాల్లో ఉంటే తెలంగాణలో వర్షాలు పడి పంటలు పండుతాయని ప్రజలంతా అనుకుంటున్నారని పోన్నాల ఎద్దేవా చేశారు.