బీరయ్య మరణించిన ధాన్యం కుప్ప వద్ద మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట ధా న్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలపైనే తను వు చాలించిన రైతు బీరయ్య ఇంటికి ప్రజాప్రతిని ధులు, నాయకులు వరుసకట్టారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య శుక్రవారం తెల్లవారేసరికి వడ్ల కుప్పమీదనే కన్నుమూసిన ఘటన ప్రజలను కంటతడి పెట్టించింది. ఈ నేపథ్యంలో రాజ కీయ పార్టీల నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బీర య్య కొడుకుతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. కాం గ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందవద్దని, రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావుతో కలసి ఐలాపూర్‌లోని బీరయ్య ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బీరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్లే బీరయ్య చనిపోయారని ఆరోపించారు. బీరయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం సాయం అందించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మరో కాంగ్రెస్ నేత సుభాష్‌రెడ్డి, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
బీరయ్యది సహజ మరణమే!
ఇదిలా ఉండగా లింగంపేట మండల అధికారులు.. ఎల్లారెడ్డి ఆస్పత్రి వైద్యుల నివేదిక ఆధారంగా బీరయ్యది సహజ మరణమేనని తేల్చారు. రైతు బీరయ్యది సహజ మరణమని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదంటూ జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment