అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు | komatireddy venkat reddy takes on nalgonda district police | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు

Published Sat, Mar 5 2016 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

komatireddy venkat reddy takes on nalgonda district police

నల్గొండ: నల్గొండ జిల్లా పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్గొండలో నిప్పులు చెరిగారు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు,  ఇసుక దందాల్లో పోలీసులే ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10 జాతీయ రహదారులు దిగ్బంధిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement