కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం | Minister Komatireddy Venkat Reddy Holi Dip In Maha Kumbhamela | Sakshi
Sakshi News home page

కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం

Published Mon, Feb 10 2025 11:10 AM | Last Updated on Mon, Feb 10 2025 12:57 PM

Minister Komatireddy Venkat Reddy Holi Dip In Maha Kumbhamela

లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో ఎంతో వైభవంగా మ‌హా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో ప‌విత్ర స్నానం ఆచ‌రించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా  పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మ‌హా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement