
ఆల్మట్టి ఎత్తుకు చంద్రబాబు సహకరించారు:చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: ఆల్మట్టి ఎత్తుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహకరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వైఫల్యం వల్లే కృష్ణా జిల్లాల సమస్య వచ్చిందని ఆయన మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమర్థించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని భావిస్తున్నట్లు గండ్ర తెలిపారు.
రేపు జరుగనున్న రాష్ట్ర కేబినేట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల అంశం ఖరారు అయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో జరిగే సమావేశాలు ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరివి కావచ్చని తెలిపారు.విభజన బిల్లుపై సభలో మూడు రోజుల చర్చ సరిపోతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.