
భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి తనను శారీరకంగా లోబరచుకుని మోసం చేశాడని, అతడిని కాంగ్రెస్ నుంచి సస్పెం డ్ చేయాలని మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు కె.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఉదయం భూపాలపల్లి జయశంకర్ చౌరస్తా వద్ద బైఠాయించి ఆమె నిరసన చేపట్టింది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడికి చేరుకుని.. ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సాయంత్రం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విజయలక్ష్మి తనతో గండ్ర మాట్లాడిన ఫోన్‌కాల్స్ రికార్డింగ్స్‌ను విలేకరులకు వినిపించింది. తనతో ఏ సంబం ధం లేకుంటే ఫోన్లో గండ్ర అలా ఎందుకు మాట్లాడుతాడని ప్రశ్నించింది. విజయలక్ష్మితో వచ్చిన మహిళలు తర్వాత ఇందిరాభవన్‌లో మాట్లాడుతూ.. విజయలక్ష్మి తన భర్త ఐదేళ్లుగా కాపురానికి తీసుకెళ్లడం లేదు.. మాట్లాడేందుకు రమ్మంటే వచ్చా మని తెలిపారు. గండ్ర గురించి అంటే తాము వచ్చే వారమే కాదని చెప్పారు.