విజయలక్ష్మీ ఫిరోజ్.. తమిళ సినీ అభిమానులకు బాగా తెలిసిన నటి. ఇప్పుడు వెబ్ తెరకూ పరిచయమై తన టాలెంట్‌తో వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది.
దర్శకుడి కూతురిని కాబట్టే నాకు అవకాశాలు వస్తున్నాయనుకుంటున్నవాళ్లున్నారు ఇప్పటికీ! కానీ అది నిజం కాదు. దర్శకుడి కూతురు అనే ట్యాగ్.. ఇండస్ట్రీ ఎంట్రీని ఈజీ చేస్తుందేమో కానీ.. నిలబెట్టేది మాత్రం టాలెంటే! అలా నా ప్రతిభతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకెంత ఆలస్యమైనా పరవాలేదు.
– విజయలక్ష్మీ ఫిరోజ్.
⇒ 2007లో ‘చెన్నై 600028’ మూవీతో సినీ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. వరుస అవకాశాలను అందుకోవడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ‘అంజాదే’లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వెండితెర, బుల్లితెర అనే తేడా చూపకుండా టీవీ సీరియల్స్‌లో వచ్చిన చాన్సెస్‌నూ సద్వినియోగం చేసుకుంది. తమిళ ‘బిగ్ బాస్ 2’, ‘సర్వైవర్ తమిళ్’ వంటి రియాలిటీ షోలలోనూ పాల్గొంది.
⇒ విజయలక్ష్మీ ఫిరోజ్‌ది సినిమా కుటుంబం అని చెప్పొచ్చు. తండ్రి అగత్తియన్ దర్శకుడు. సోదరీమణులు నిరంజనీ అగత్తియన్.. నటి, కాస్ట్యూమ్ డిజైనర్. కార్తీకా అగత్తియన్ నటి.
⇒ ఫిరోజ్ మహ్మద్‌ని పెళ్లి చేసుకుని, నటన నుంచి సినిమా నిర్మాణం వైపు మళ్లింది. ఫిరోజ్ దర్శకత్వం వహించిన ‘పండిగై’ తో నిర్మాతగా మారింది.
⇒ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది. ‘హై ప్రీస్టెస్’ సిరీస్‌తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టింది. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment