
ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి: గండ్ర
టీఆర్ఎస్ పార్టీపై మాజీ ప్రభుత్వ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీ ప్రలోభపెట్టడం సరికాదని మాజీ ప్రభుత్వ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలకు విప్ జారీ చేస్తున్నట్లు శనివారం హైదరాబాద్లో ప్రకటించారు. విప్ను ధిక్కరిస్తే జెడ్పీటీసీలు తమ పదవిని కోల్పోతారని ఆయన తెలిపారు. ఓ వేళ జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని గండ్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని జెడ్పీటీసీలు ముందుగా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్లాలని ఆయన కాంగ్రెస్ జెడ్పీటీసీలకు హితవు పలికారు.