జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు.. బిల్లుపై ఓటింగ్‌కు వైఎస్సార్ సీపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో మంగళవారం సైతం సభా కార్యక్రమాలు సాగలేదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు పోడియాలను చుట్టుముట్టడంతో ఉభయసభలూ బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం సభలు ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలంటూ ఇచ్చిన నోటీసులను తిరస్కరించాలంటూ తెలంగాణ సభ్యులు, నోటీసులకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు పోడియంలలోకి వెళ్లారు. పోటాపోటీగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. శాసనసభలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లారు.
డిప్యూటీ సీఎం రాజనర్సింహ, ఆ ప్రాంత మంత్రులు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సీమాంధ్ర టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. గందరగోళ వాతావరణంలో ప్రారంభమై రెండు నిమిషాలు కూడా గడవక ముందే స్పీకర్ మనోహర్ సభను గంట వాయిదా వేశారు. తర్వాత కూడా ఇదే పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి వారుుదా పడి మధ్యాహ్నం 2.10కి తిరిగి సమావేశమైన సభ వెంటనే బుధవారానికి వాయిదా పడింది. మండలిలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రాంతాలవారీ డిమాండ్ల నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 సమయంలో చైర్మన్ చక్రపాణి మండలిని బుధవారానికి వారుుదా వేశారు.
ఇలా సభ.. అలా వాయిదా
Published Wed, Jan 29 2014 1:41 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM
Advertisement