అనధికార తీర్మానాలను నా ముందు పెట్టారు:గండ్ర
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అడ్మిట్ చేసిన 12 అనధికార తీర్మానాలను స్పీకర్ తనకు అప్పగించినట్లు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చ పూర్తయ్యాకే ఏ తీర్మానమైనా అనుమతించాలని స్పీకర్ తెలిపినట్లు గండ్ర స్పష్టం చేశారు. బిల్లుపై బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టి.కాంగ్ తో పాటు టి.ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిశామన్నారు. చర్చకు అదనపు సమయం కోరడం..బిల్లును అడ్డుకునే కుట్రలో భాగమని గండ్ర తెలిపారు. కిరణ్ నోటీసు ఉపసంహరించుకుంటేనా సభను నడవనిస్తామన్నారు. విభజన బిల్లుపై అదనపు గడువు కోరడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని గండ్ర తెలిపారు.
బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు.