BAC meet
-
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
అసెంబ్లీ 50 రోజులు
సాక్షి, హైదరాబాద్ : శాసన సభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు 50 రోజుల పాటు కొనసాగనున్నాయి. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సమక్షంలో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిపేందుకు యాభై రోజులపాటు సభ జరపాలని, శుక్రవారం తొలిరోజు సభ ముగిసిన తర్వాత మరోసారి బీఏసీ సమావేశమై ఎజెండా ఖరారు చేయాలని నిర్ణయించారు. వారంలో అయిదు రోజులపాటు సభ జరిపి శని, ఆదివారాల్లో సెలవులు ఇవ్వాలని, అలాగే నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో మూడ్రోజులపాటు సభకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. స్పీకర్ మధుసూదనాచారి జ్వరంతో బాధపడుతుండడంతో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో బీఏసీ భేటీ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతర పక్షాల నేతల మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. కాంగ్రెస్, ఇతర పక్షాలన్నీ దాదాపు 20 అంశాలను చర్చకు ప్రతిపాదించగా.. వాటికితోడు మరికొన్ని అంశాలు జోడించినా తమకు అభ్యంతరం లేదని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశాన్ని ఎజెండాలో చేర్చాలని డిప్యూటీ స్పీకర్‌కు సూచించారు. సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని కొద్దిరోజుల కిందట పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరిన నేపథ్యంలో అన్ని అంశాలు చర్చించడానికి 50 రోజులపాటు సభ నడపాలని సీఎం ప్రతిపాదించారు. ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం! ప్రశ్నోత్తరాల నిర్వహణలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకోవాలని, ఒక్కో ప్రశ్నకు 9 నిమిషాల సమయం కేటాయించి, 9వ నిమిషం తర్వాత కచ్చితంగా మరో ప్రశ్నకు వెళ్లిపోవాలని సూచించారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించాలని కోరారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత సభ్యులకు జీరో అవర్ కింద తమ ప్రాంత సమస్యలు చెప్పే అవకాశం కల్పించాలని, అనంతరం సభలోనే సభ్యులు ప్రభుత్వానికి పిటిషన్లు సమర్పించే పద్ధతి కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ప్రతీ బిల్లుపై కూలంకశంగా చర్చ జరగాలని, సభ్యులు చేసే సూచనలకు అనుగుణంగా బిల్లులో అవసరమైతే మార్పులు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలను వాయిదా తీర్మానాల ద్వారా చర్చకు అనుమతించాలన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి విజ్ఞప్తిని కూడా బీఏసీ ఆమోదించింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలను పరిశీలించేందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ గౌరవంగా, హుందాగా జరుగుతోందన్న సంకేతం యావత్ దేశానికి అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నిర్వహణ తీరును తాను, జానారెడ్డి, ఇతర సీనియర్ సభ్యులు చూశామని, అప్పుడు చాలా తక్కువ రోజులు సభ నిర్వహించేవారని అన్నారు. అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించడానికి సభ్యులకు అవకాశమే రాకపోయేదని, అధికారపక్షం నామమాత్రంగా సభ నిర్వహించేదని గుర్తు చేశారు. మండలిలో నాటి ఒరవడి కొనసాగాలి శాసన మండలిలో జరిగిన బీఏసీలోనూ దాదాపు పై అంశాలనే చర్చించారు. ఈ బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్ తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. 70వ దశకంలో శాసనమండలి సమావేశాలం టే అందరికీ క్రేజ్ ఉండేదని, సభ్యుల ప్రశ్నలు, చర్చల సందర్భంగా వారు మాట్లాడే తీరు మంత్రులకు దడ పుట్టించేదన్నారు. కొందరు మంత్రులు మండలికి రావాలంటేనే భయపడే పరిస్థితి అప్పట్లో ఉండేదని, తాను ఎంఏ విద్యార్థిగా ఉన్నపుడు మండలి సమావేశాలు వీక్షించడానికి తరచుగా వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్సీలు యజ్ఞ నారాయణ, మాణిక్‌రావు, కె.కేశవరావు ప్రసంగాలు తనను ఆకట్టుకునేవని, మండలి ప్రస్తుత సమావేశాల్లో మునుపటి ఒరవడి కొనసాగాలని అభిలషించారు. అసెంబ్లీ, శాసన మండలిలో ఒకేరోజు ఒకే అంశంపై చర్చ జరగకూడదన్నారు. అసెంబ్లీలో ఒక అంశంపై చర్చ జరిగిన తర్వాత మండలిలో రెండ్రోజుల విరామం తర్వాత దానిపై చర్చ జరగాలని సూచించారు. ఇకపై మండలి సమావేశాలకు తాను తరచుగా హాజరవుతానని, మండలిలో విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు సరికాదు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరైంది కాదని జానారెడ్డితో సీఎం అన్నారు. ప్రాణాలు పోయినా అసెంబ్లీ ముట్టడి ఆగదని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడాన్ని సీఎం తప్పుపట్టినట్లు సమాచారం. ఎవరి ప్రాణాలు ఎందుకు పోవాలన్న కేసీఆర్.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తెచ్చే వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాలని సూచించారు. సభలో కూడా ఏ సమస్యపై అయినా చర్చించడానికి సిద్ధమని, అదే సమయంలో గొడవ చేసి అరాచకం చేద్దామంటే తాము కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. -
ప్రధాన ప్రతిపక్షానికిచ్చే గౌరవమేనా ఇది ?
-
అనధికార తీర్మానాలను నా ముందు పెట్టారు:గండ్ర
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అడ్మిట్ చేసిన 12 అనధికార తీర్మానాలను స్పీకర్ తనకు అప్పగించినట్లు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చ పూర్తయ్యాకే ఏ తీర్మానమైనా అనుమతించాలని స్పీకర్ తెలిపినట్లు గండ్ర స్పష్టం చేశారు. బిల్లుపై బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టి.కాంగ్ తో పాటు టి.ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిశామన్నారు. చర్చకు అదనపు సమయం కోరడం..బిల్లును అడ్డుకునే కుట్రలో భాగమని గండ్ర తెలిపారు. కిరణ్ నోటీసు ఉపసంహరించుకుంటేనా సభను నడవనిస్తామన్నారు. విభజన బిల్లుపై అదనపు గడువు కోరడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని గండ్ర తెలిపారు. బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. -
మా తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయి:శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తామిచ్చిన తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని స్పీకర్ తెలిపినట్లు ఆమె స్పష్టం చేశారు. రూల్ 77 కింద ఎవరి తీర్మానాన్ని టేకప్ చేసిన తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పీకర్ కు తెలిపినట్లు శోభా తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ రాకుండా రెండు ప్రాంతాల వ్యక్తులను పంపించి రెండు విధానాలను చెప్పించారని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో అంత ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు బీఏసీ ఎందుకు హాజరు కాలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒక్కటై పోరాడుతున్నాయని కాని సీమాంధ్ర పార్టీలు మాత్రం తలోరకంగా వ్యవరించడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. -
అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశాం: స్పీకర్
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. అనధికార తీర్మానాలను అడ్మిట్ చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కాగా, ఎలాంటి తీర్మానాలను అనుమంతిచేది లేదని టి.ప్రాంత ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది.. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు తప్పుబట్టాయి. సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
వాడివేడిగా బీఏసీ సమావేశం!
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై బీఏసీ సమావేశంలో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ పట్టుబడుతుంది. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎంలు తప్పుబట్టాయి. సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్ చేస్తున్నారు. విభజన బిల్లుపై ఓటింగ్, సమైక్య తీర్మానం అవసరం లేదని వారు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా కొనసాగుతున్నఈ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతికి పంపాలని టి.నేతలు సూచిస్తున్నారు. బిల్లుపై 150 సభ్యలు మాట్లాడాల్సి ఉందని, బిల్లు గడువును మరింత పెంచాలని సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. బిల్లుపై ఓటింగ్ ఉండాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
బాబు,కిరణ్ బీఏసీ భేటీకి డుమ్మా
-
అసెంబ్లీ : ప్రారంభమైన BAC సమావేశం