ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి
శాయంపేట, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిల్లికూతలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజల పక్షాన ఉంది కాబట్టే.. రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. లేదంటే వందేళ్లరుునా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయని, అందులో మొదటి ముద్దాయి ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడేనన్నారు.
సమన్యాయం కావాలని చెప్పడం చూస్తుంటే.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన బెట్టి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. కొంత మంది నాయకులు తెలంగాణ ప్రజలకు గొప్పలు చేసినట్లు ఇంటింటికి వె ళ్తున్నారని, వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు, మరేనాయకుడైనా మనపై పెత్తనం చెలాయించాలనే చూశారు తప్ప.. అభివృద్ధి చేయాలని చూడలేదన్నారు. తెలంగాణ సాధనకు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామన్న కేసీఆర్ మాటలు నిజమైతే.. ఎలాంటి షరతులు లేకుండా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేయాలన్నారు. కాదు కూడదంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని గండ్ర అన్నారు.