ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణరెడ్డి ఆదివారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల ప్రజలను గందరగోళ పరిచేందుకు టీడీపీ వ్యవహారిస్తుందని ఆయనా ఆరోపించారు.
ఆ పార్ట ఓ విధంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అటువంటి విధానం టీడీపీకి సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ అధ్యక్షురాలు నిన్న జాతీయ మీడియా కేంద్రాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆమె తొలిసారిగా నోరు విప్పారు. ఆ రాష్ట్ర విభజనపై ఓ ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో గండ్ర పై విధంగా స్పందించారు.