New States Formation
-
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు.. 51
కాలిఫోర్నియా : అమెరికాలో ఎక్కువ మంది నివసిస్తోన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాను రెండు ముక్కలుగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంది. ‘న్యూ కాలిఫోర్నియా మూమెంట్’ పేరుతో విభజన కోసం పోరాడుతున్న ఉద్యమకారులు సోమవారం తమకు తామే కొత్త రాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. ‘ఇవాళ్టి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు 51’ అంటూ నినాదాలు చేశారు. కొత్త రాష్ట్రం అవసరమేంటి? : ప్రస్తుతం కాలిఫోర్నియాలో నియంతృత్వ పాలన నడుస్తున్నదని ‘న్యూ కాలిఫోర్నియా’ మూమెంట్ ఆరోపిస్తోంది. ‘‘పన్ను వసూళ్ల తీరు, ప్రభుత్వ నియంత్రణలేమి, ఏక పార్టీ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గంలో సమస్యలను పరిష్కరిచలేం’ అని ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న టామ్ రీడ్ చెప్పుకొచ్చారు. తీర ప్రాంతాన్ని వదిలెయ్యండి : కాలిఫోర్నియా రాష్ట్రంలో మొత్తం 58 కౌంటీలు ఉన్నాయి. వాటిలో ఫసిపిక్ తీరాన్ని ఆనుకుని ఉండే కౌంటీలను.. మిగతా కౌంటీల నుంచి వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ‘న్యూ కాలిఫోర్నియా’ స్వీయ రాష్ట్ర ప్రకటనపై ఫెడరల్ అధికారులు, రాజకీయ పార్టీలు స్పందించాల్సి ఉంది. -
ఇది కూడా స్టేటస్ సింబలే..!
బోస్టన్: సొంతిల్లు, నగలు, కార్లు... ఇలా అంతస్తును, హోదాను ప్రదర్శించుకునేందుకు బోలెడన్ని ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా మరొకటి చేరింది. అదే...‘నేను చాలా బిజీ’..అని నలుగురి ముందూ చెప్పుకోవటం, అలా అందరికీ కనిపించటం అట. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఎప్పుడూ హడావుడిగా, ఒకే సమయంలో ఎన్నో పనులు చేస్తున్నట్లు కనిపించటం, తను చాలా ముఖ్యమైన వ్యక్తి అని అందరికీ చూపుకోవటం ప్రస్తుతం జనానికి బాగా ఫ్యాషన్ అయిపోయిందని వారు చెబుతున్నారు. సాయంత్రం సమయాల్లో గోల్ఫ్ ఆడటం, లేదా సెలవు రోజుల్లో రిసార్టుల్లో, బీచ్‌లో సరదాగా గడపటం వంటివి ధనవంతులమని చెప్పుకోవటానికి సూచికగా తీసుకుంటున్నారట. ‘నాకంటూ జీవితం లేకుండా పోయింది’ అనో ‘అర్జంటుగా నాకు విశ్రాంతి కావాలి’ అనో అనటం కూడా హోదాను తెలుపుకునేందుకు ఇటువంటి వారు తరచుగా అంటుంటారని వారి పరిశీలనలో తేలింది. అలాగే, ఆహారాన్ని, కావల్సిన సరుకులను ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవటం కూడా ఇటువంటి వారికి స్టేటస్ సింబల్‌గా కనిపిస్తుంటాయి. సినిమాలు, పత్రికలు, పాపులర్ టీవీ షోలు కూడా ఎక్కువగా డబ్బున్న వారి గురించి, వారు ఎలా విలాసాల్లో మునిగి తేలుతున్నారనే విషయాలనే చూపిస్తుంటాయని పరిశోధకుల బృందంలో ఒకరైన హార్వర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నీరూ పహారియా అన్నారు. నిత్యం పనుల్లో బిజీగా ఉండే వారిని చూపించటం కంటే కోటీశ్వరులు తమ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్లు టెన్నిస్, పోలో ఆడుతున్నారా? లేక సముద్ర విహారం చేస్తున్నారా? అనే విషయాలపై ఎక్కువ దృష్టిపెట్టాయని ఆమె తెలిపారు. వీరు వాడే వస్తువులు, సేవలు కూడా ఉన్నతస్థాయి వర్గానికి చెందినవిగా పరిగణిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో చేపట్టిన ఈ పరిశోధన సారాంశాన్ని కన్జ్యూమర్ రీసెర్చి పత్రిక ఇటీవల ప్రచురించింది. -
‘కేసీఆర్ కు హరీష్ భయం’
-
‘కేసీఆర్ కు హరీష్ భయం’
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సీఎం కావాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చివేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు సీఎం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడు హరీష్ సీఎం అవుతారేమోననే భయం కేసీఆర్ కు పట్టుకుందని.. అందుకోసమే వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలనుకుంటున్నారని తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సచివాలయం తరలింపును నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని టీపీసీసీ నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టాలనే నిర్ణయం సరికాదన్నారు. కూల్చివేయడంపై జోక్యం చేసుకోవాలని నేతలు గవర్నర్ ను కోరారు. వాస్తు దోషం ఉందనే సాకుతోనే సచివాలయం కూల్చివేయాలనుకుంటున్నారన్నారు. కానీ హైకోర్టు కు మాత్రం ఫైర్ సేఫ్టీ లేదనే కారణం చూపుతున్నారని ఆరోపించారు. సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు. గవర్నర్ కలిసినవారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
'టీ.సచివాలయం కూల్చివేత'పై విచారణ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి...కొత్త భవనాన్ని నిర్మించాలని యోచిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా వాస్తు దోషం ఉందనే సాకుతో విశాలమైన, పటిష్టమైన సచివాలయ భవనాలను కూల్చేయవద్దంటూ జీవన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అమరావతికి ఆంధ్రా సచివాలయం తరలివెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరో నాలుగు బ్లాకులు పెరుగుతాయని, దీనివల్ల సువిశాలమైన సదుపాయాలు, వసతులున్న సచివాలయం అందుబాటులో ఉంటుందన్నారు. వాస్తుదోషం కారణంతో సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన వల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందన్నారు. మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలోకొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు
రాష్ట్రాధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియామకం సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు చెంది న గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియమితుల య్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపిం ది. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ నాయకులు కె.శివకుమార్, డా. ప్రఫుల్లారెడ్డి అభినందించారు. రేపు బాధ్యతల స్వీకరణ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఇందులో పాల్గొం టారని వెల్లడించారు. -
కొత్త రాష్ర్టం ఎలా ఉంది?
కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్న రాహుల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టీపీసీసీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కారులో వెళ్తున్న సమయంలో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటులో ఎదురైన ఇబ్బందులను రాహుల్ గుర్తు చేసినట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగినట్లు సమాచారం. కాగా, అవసరమైన వనరులు ఉన్నా అధికారంలో ఉన్న వారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని టీపీసీసీ నేతలు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలన, వారి వారసులు ఇప్పుడు ఎక్కడున్నారని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. -
రిజర్వేషన్లతోనే సామాజిక మార్పు
ఉన్నత విద్యావకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్రమించిన కొత్త హోదాకు ‘మెరిట్’ పేరు పెట్టి, వాటిని తమకే స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగబద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని భావిస్తున్నారు. రష్యా, చైనాల వంటి దేశాలకు భిన్నంగా మన దేశంలో రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేరకైనా జరిగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే. నేటి గుజరాత్ పటేళ్ల ఉద్యమంగానీ, గత యాభై ఏళ్ళుగా రిజర్వేషన్లపై దేశం లో తలెత్తుతున్న ఆందోళనలేవైనా గానీ ఊహించనివి కావు. మన సమాజం లో ఇటువంటి ఉద్యమాలు ఉద్భవిస్తాయని రాజ్యాంగవేత్తలు అప్పట్లోనే ఊహించారు. ప్రత్యేకించి అంబేడ్కర్ ఈ విషయంలో దార్శనికతను చూపా రు. 60 ఏళ్ళ తర్వాత ఎటువంటి ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందో ఊహిం చారు కనుకనే... ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి రాజకీయాధి కారాన్ని ప్రజలకు అందించారు. రాజకీయ సమానత్వాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వానికి దోహదం చేస్తుందని, అది సామాజిక సమానత్వానికి దారితీస్తుందని అంబేడ్కర్ భావించారు. కను కనే మన రాజ్యాంగవేత్తలు మొదట రాజకీయ సమానత్వంపై దృష్టి పెట్టారు. అది సత్ఫలితాలనిచ్చింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఇది భిన్నమైనది. ఇతర దేశాల్లో ఆర్థిక సమానత్వం సిద్ధించిన తదుపరి రాజకీయ సమానత్వం కోసం పోరాడుతు న్నారు. కొన్ని దేశాల్లో సామాజిక సమానత్వం తర్వాత రాజకీయ సమానత్వం కోసం కృషి జరుగుతోంది. కొన్ని అభివృద్ధిచెందిన దేశాల్లో సైతం మహిళలకు ఓటు హక్కును గానీ, కాలేజీల్లో చదువుకునే అవకాశాన్నికానీ ఇవ్వడంలేదు. ఈ రోజుకీ ఆ అవకాశం కోసం పోరాడుతున్న ఉదాహరణలు కోకొల్లలు. కానీ మన దేశంలో ప్రపంచంలోనే లేని ఒక నూతన ప్రయత్నాన్ని అంబేడ్కర్ చేశా రు. రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించిపెట్టారు. అందరికీ ఓటు హక్కు ద్వారా చైతన్యం సిద్ధిస్తుంది. రాజకీయ సమానత్వం ఆర్థిక అస మానతలను తొలగించి, సామాజిక సమానత్వానికి దారితీస్తుంది అని ఆయ న భావించారు. నేడు గుజరాత్‌లోని పటేళ్ల ఉద్యమం సహా దేశంలో జరుగు తున్న ఉద్యమాలన్నీ రాజకీయ సమానత్వం ఇచ్చిన చైతన్యంతోనే వచ్చాయి. రిజర్వేషన్లను ప్రతిఘటించే శక్తులు ఎప్పుడైనా ఉంటాయి. గతంలో వచ్చిన రిజర్వేషన్ వ్యతిరేకోద్యమాల కోవలోకే పటేళ్ల ఉద్యమం కూడా వస్తుందే తప్ప మరేమీ కాదు. ఉన్నత విద్యావకాశాలతో ముడిపడ్డ సమస్య పటేళ్ల ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తాయి. ఇది ఉన్నత చదువులకు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశం. ఉద్యోగావకాశాలన్నీ ఉన్నత విద్యనభ్యసించిన వారికే వస్తున్నాయి. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అవి మనిషి జీవితంలోని ప్రతిభాగాన్ని స్పృశించాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిఫలాలు సామా న్యుడికి అందుబాటులోకి రావాలంటే సాంకేతికాభివృద్ధి ఎంతో అవసరం. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళకు ఉద్యోగార్హతను సాధించి పెట్టింది. ఉన్నత విద్య ఎవరికి అందు బాటులో ఉంటే వారికే అది ఉద్యోగావకాశాలను కల్పించింది. అందుకని ఉన్నత విద్యకు అవకాశాలను, రిజర్వేషన్లను రెండింటినీ కలిపి ఆలోచించా ల్సిన అవసరం ఉన్నది. అంటే ఉన్నత విద్యకు రిజర్వేషన్లను వర్తింపజేయాలి. ఈ రెండింటినీ సమన్వయిస్తేనే అట్టడుగున ఉన్న వాళ్ళకు సైతం శాస్త్ర, సాం కేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా సున్నితమైన సమస్య. అవకాశాలపై గుత్త హక్కుకు మరో పేరు ‘మెరిట్’ ఇక్కడే మరొక ముఖ్య విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఈ రోజు మనుషులకు గానీ, కొన్ని సామాజిక వర్గాలకు గానీ సమాజంలో గుర్తింపు, గౌరవం, హోదా, లేక అంతస్థు... ఆయా వర్గాల, వ్యక్తుల, సామాజిక వర్గాల ఆస్తి ఆధారంగా వచ్చినవే. దీనికి సాంస్కృతికపరమైన సామంజస్యం లభిం చింది. అందుకు మతం తోడ్పడింది. ఈ సాంస్కృతికపరమైన సామంజస్యా నికి వెనుక ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చాక వాటి పునాదులు కదిలాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిం చలేకపోయినా వెనుకబడిన వర్గాల్లో మాత్రం చైతన్యం తెచ్చాయి. ఆస్తితో ఏ విధమైన హోదా వచ్చిందో, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి కూడా అటువంటి హోదా లభించింది. అయితే అటువంటి ఉన్నత చదువులను అభ్యసించే అవకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్ర మించిన ఈ కొత్త హోదాను తమకే స్థిరపరచుకోవడానికి, సమర్థించుకో వడానికి దానికి ‘మెరిట్’ లేదా ప్రతిభ అని పేరు పెడుతున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగ బద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని ప్రయత్ని స్తున్నారు. ఉన్నత విద్య-సామాజిక న్యాయం అనేది ప్రస్తుతం కీలకమైన అం శంగా మారిపోయింది. అవి రెండూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగారు, వివిధ దేశాలకు వెళ్ళారు. దీనివల్ల కేవలం ఆయా కుటుంబాలకే మేలు జరిగిందనుకుంటే పొరపాటే. యావత్ సమాజానికి అది మేలు చేసింది. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగివచ్చిన వ్యక్తుల పరిశోధనలు అణగారిన వర్గాల సమస్యలకు పరిష్కారాన్ని వెతి కాయి. వారి అభివృద్ధికి దోహదం చేశాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దరికీ అందుబాటులోకి తెచ్చాయి. సామాన్యుడి అవసరాలకు అనుగుణ్యమైన పరిశోధనలు జరిగాయి. గతంలో సంపన్న వర్గాలకు సంబంధించిన అంశా లకే పరిమితమైన పరిశోధన పరిధి విస్తృతమైంది. ఈ పరిశోధన కానీ, ఈ పరి జ్ఞానం కానీ ఏ కొందరికో సొంతం కాకూడదనే తపన మొదలైంది. రిజర్వేషన్ల ఫలితంగానే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, వాటిపై జరిగే పరిశోధనలు సామా న్య మానవుణ్ణి కేంద్రంగా చేసుకుంటున్నాయి. సామాజిక సమానతకు శాంతియుత మార్గం ఇతర దేశాల్లో సామాజిక హోదాలో మార్పు హింసాత్మక పోరాటాల ద్వారా వచ్చింది. సోవియెట్ యూనియన్, చైనాలాంటి దేశాల్లో విప్లవాలు, హింసా త్మక ఉద్యమాల ఫలితంగా ఇటువంటి మార్పు సాధ్యమైంది. కానీ మన దేశంలో ఎటువంటి రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేర కైనా జరగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. ఎక్కడో అట్టడుగున ఉన్న వర్గాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడుగుపెట్టగలిగారు. సాధారణ వ్యక్తు లకు సైతం ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రావడం వల్ల తన సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పరిశోధనలు సాగించగలి గారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన భారతీయులు ఎందరో ఇతర దేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించ గలిగారంటే కారణం రిజర్వేషన్లే. కుల వ్యవస్థ అమానుష ప్రభావాన్ని స్వయంగా చవిచూసిన వ్యక్తి తన విజ్ఞానాన్ని సరికొత్త మార్గంలోకి తీసుకెళ్ళాడు. ఆ పరిశోధనల ఫలితాలు నేడు ప్రపం చంలోని అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేశాయి. భారత రాజ్యాంగం చేసిన రిజర్వేషన్ల ప్రయోగ ఫలితాలు కేవలం భారతీయులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. పరిశోధకుడి నేపథ్యం పరిశోధనల సంకుచిత సరిహద్దులను చెరిపే స్తోంది. పరిజ్ఞానం అనంత విశ్వానికి వ్యాప్తిసోంది. పేదలకు వచ్చే వ్యాధుల పైన, జీవన విధానంపైనా నేడు ప్రత్యేకంగా జరుగుతున్న పరిశోధనలు అటు వంటివే. ఉన్నత విద్యలో రిజర్వేషన్ల వల్ల పరిశోధనలు కొత్తపుంతలు తొక్కు తున్నాయి. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే పరిశోధనకు కళ్లెం వేయడమే. విస్తృతమవుతున్న పరిజ్ఞానానికి పరిమితులు విధించడమే. అంబేడ్కర్ దూర దృష్టి భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయగలిగింది. సమాజ మనుగడకు దోహ దం చేసే పరిశోధనలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం... వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం వల్లనే సాధ్యమనడానికి అంబే డ్కరే ఒక మంచి ఉదాహరణ. దానినే అతను ప్రయోగించాడు. ఉన్నత విద్యలో రిజర్వేషన్లను సుసాధ్యం చేశాడు. వెలుగులోకి రాకుండా పేదరికంలోనే మగ్గుతున్న మట్టిలోని మాణి క్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని వెలికితీయాలి. సామాజిక అణచివేతకు గురవుతున్న వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలి. అది ప్రతిభకు ప్రతిబంధకం ఎంతమాత్రం కాదు. రిజర్వేషన్ల వలన కొద్ది మం ది సీట్లు కోల్పోవచ్చు. కానీ కొత్త జ్ఞానానికి మాత్రం తలుపులు తెరుచుకుం టాయని స్పష్టం అవుతోంది. చీకట్లో మగ్గుతున్న ఎందరికో ఆ పరిశోధనలు చేయూతనిస్తాయి. పేదల ఆరోగ్యం, వ్యాధులు, వారి సామాజిక పరిస్థితులు, జీవన వైవిధ్యం పైన కూడా అది ప్రభావం చూపుతుంది. ఇంత వరకు జరిగిన పరిశోధనల్లో అత్యధిక శాతం సంపన్నుల ప్రయోజనాలను కాపాడేందుకు జరిగినవే. అంతేగానీ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని జరిగినవి కావు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు మాత్రం పేదల సమస్యల పరిష్కారానికి సంబంధించినవి కావడం గమనించాల్సిన అంశం. అందువల్ల రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) - చుక్కా రామయ్య -
కరీంనగర్ జిల్లాలో ‘బౌద్ధ బ్రహ్మ’!
అరుదైన విగ్రహాన్ని గుర్తించిన ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సాక్షి, హైదరాబాద్: త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు మందిరం ఉండదు.. విగ్రహమూ ఎక్కడా కనిపించదు. కానీ బౌద్ధ మతంలో నాలుగు తలలు, శరీరాలతో బ్రహ్మ అవతారంలో విగ్రహం కనిపిస్తుంది. అయితే మన దేశంలో ఈ ‘బౌద్ధ బ్రహ్మ’ విగ్రహాలు వెలుగుచూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్దిలో ఈ అరుదైన విగ్రహం వెలుగు చూసింది. పాకిస్తాన్‌లోని సింధ్‌లో లభించిన గుప్తుల కాలంనాటి కంచు విగ్రహాన్ని ఇది పోలిఉంది. 6 శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ విగ్రహం ప్రస్తుతం ఎలాంటి ఆలనాపాలనా లేకుండా మట్టికొట్టుకుపోయి ఉంది. ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు స్థానికులైన శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, పొన్నాల బాలయ్య తదితరుల సాయంతో ఈ విగ్రహాన్ని గుర్తించారు. నాలుగు శరీరాలతో: ‘బౌద్ధ బ్రహ్మ’ ఆకారం నాలుగు తలలతో ఉంటుంది. అరుదుగా కొన్నిచోట్ల మాత్రం నాలుదిక్కులా నాలుగు శరీరాలతో కూడా కనిపించింది. సింగరాయలొద్దిలో లభించిన విగ్రహం కూడా నాలుగు శరీరాలతో ఉంది. అయితే ముందువైపు పూర్తిగా ఉండగా.. మిగతా మూడు వైపులా అంత స్పష్టంగా లేదు. ముందువైపు జటామలకాలున్న నాలుగు తలలు, రెండు చేతులు ఉన్నాయి. ఎడమ చేతిలో కమండలం ఉంది. థాయ్‌లాండ్‌లో ఈ తరహా విగ్రహాలు ఉన్నాయి. బౌద్ధుల ఆవాసం: ఈ విగ్రహానికి ఎదురుగా 50 అడుగుల వ్యాసంలో ఇటుకల వృత్తాకార నిర్మాణాలు ఉన్నాయి. ఇటుకలు జారిపోకుండా అంచులకు రాతి కట్టడం ఉంది. కాస్త దూరంలో 20 అడుగుల వ్యాసమున్న మట్టి ఒరల బావి జాడ ఉంది. బౌద్ధ హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాల కాలంనాటి బౌద్ధ క్షేత్రంగా ఈ ప్రాంతం విలసిల్లిందని ఈ ఆనవాళ్లు తెలుపుతున్నాయని ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు చెప్పారు. ఇక్కడ పరిశోధనలు జరిపితే ఎన్నో చారిత్రాక విశేషాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ విగ్రహం బయటపడిన చోటికి సమీపంలోనే మోయతుమ్మెదవాగు ఉంది. వాగు ఆవల సన్యాసుల మఠం, మునుల గుహ పేరుతో బౌద్ధుల ఆవాసం ఉంది. ప్రస్తుతం దాన్ని ఆంజనేయుడి మందిరంగా పూజిస్తున్నారు. ఇక్కడికి దగ్గరలోని నాగసముద్రం గ్రామంలో నాగార్జునాచార్యుడు ఉన్నట్టు చారిత్రాక జాడలున్నాయి. ఈ మోయతుమ్మెదవాగు మానేరుకు ఉపనది. దాని ప్రవాహమార్గంలో బౌద్ధం విలసిల్లిందని చరిత్ర చెబుతోంది. -
సీట్లు.. పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే రాష్ట్రం దాటాల్సిందే. 13 జిల్లాల కొత్త రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ ఎంఎస్సీ నర్సింగ్ సీట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో సీట్లు మంజూరు కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో వేలాది రూపాయలు వెచ్చించి చదవాల్సి వస్తోంది. బీఎస్సీ నర్సింగ్ సీట్ల పెంపును ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో వైజాగ్, కర్నూలులో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనంతపురం, కడప, శ్రీకాకుళం, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. మొత్తం అన్ని కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు లేకపోవడం గమనార్హం. ఈ కోర్సు పూర్తి చేయాలంటే విద్యార్థినులు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కర్నూలులో 1982లో 25సీట్లతో కళాశాలను ప్రారంభించారు. అప్ప ట్లో సొంత భవనం లేకపోవడంతో కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఓ నాలుగు గదుల్లో కళాశాలను కొనసాగించారు. ఇలా దాదాపు 29 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలోనే నర్సింగ్ కళాశాల నిర్వహించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో 2011లో నిర్మా ణం పూర్తయింది. ఆ సంవత్సరం ఆగస్టులో కొత్తభవనంలోకి కళాశాలను మార్పు చేశారు. అయితే సీట్ల పెంపు మాత్రం మరిచారు. కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను 25 నుంచి 60కి పెంచాలని, 30 సీట్లతో ఎంఎస్సీ కోర్సు ను ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. నర్సింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్ పోస్టు, ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్, 10 లెక్చరర్, 10 పీహెచ్ఎన్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు అసిస్టెంట్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా రెండు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. 10 లెక్చరర్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. పది పీహెచ్ఎన్ పోస్టుల్లో 8 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మొత్తం 26 టీచింగ్ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనలో నాణ్యత కొరవడింది. విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేయాలన్నా, థియరీ వినాలన్నా ఇబ్బందిగా మారింది. హాస్టల్ భవనం లేక ఇబ్బందులు నర్సింగ్ కళాశాలకు సొంత భవనం ఉన్నా అందులో చదివే విద్యార్థినులకు హాస్టల్ వసతి కరువైంది. నాలుగేళ్లకు గాను మొత్తం 100 మంది విద్యార్థినులు ఇక్కడ అభ్యస్తుం డగా 25 మంది డే స్కాలర్, 75 మంది హాస్టల్లో ఉంటున్నారు. గతంలో కలెక్టరేట్ పక్కనున్న నర్సింగ్ క్వార్టర్స్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు వసతి పొందేవారు. నర్సింగ్ స్కూల్‌ను అక్కడికి మార్చడంతో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందిగా మారిం ది. ప్రస్తుతం సొంత భవనంలోనే పైఅంతస్తు లో విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. అక్కడా చాలీచాలని వసతులతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పట్టని ప్రజాప్రతినిదులు బీఎస్సీ నర్సింగ్ కళాశాల అభివృద్ధి పట్ల పాలకులు శీతకన్ను వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నివాసముంటున్న నగరంలోని కళాశాలకే ఈ దుస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పడిన ఈ కళాశాలలో సీట్లను పెంచేందుకు, ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అధ్యాపకులు, విద్యార్థినులు కోరుతున్నారు. -
అదరగొడతారా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త రాష్ట్రం వచ్చింది. పాలకులు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలవుతోంది. కానీ అవే సమస్యలు ఏళ్ల తరబడి జిల్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు... తాగునీటి కటకట షరా మామూలే. గతంలో ఎన్నడూ లేనంతంగా ఈసారి భూగర్భ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఏ నియోజకవర్గంలో చూసినా నీళ్ల కోసం బారులు తీరే జనాలే కన్పిస్తున్నారు. దీనికితోడు అన్నపూర్ణగా విలిసిల్లిన కరీంనగర్ జిల్లాను నేడు కరవు ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎల్లంపల్లి, మధ్యమానేరు, గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఆయా ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో సహాయ, పునరావాస కార్యక్రమాలు జరగలేదు. కరీంనగర్ ను అద్దంలా మార్చి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్దిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు... ఇంకా ఆచరణలోకి రాలేదు. జిల్లాలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుమన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాను సందర్శించినప్పుడు ఇచ్చిన పలు హామీలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నేటినుంచి జరగబోతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కోరుతోంది. గళమెత్తే వారెవరు? జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి మినహా జిల్లాలో మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్లే. అందులోనూ ఇద్దరు మంత్రులు ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, వొడితెల సతీష్‌కుమార్ పార్లమెంటరీ కార్యదర్శిగా, రసమయి బాలకిషన్ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో అధికార పార్టీదే హవా కాబట్టి పాలక పార్టీ సభ్యులు జిల్లా సమస్యలపై ఏ విధంగా స్పందిస్తారు? అధిక నిధులు రాబడతారా? జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కార మార్గాలను అసెంబ్లీ వేదికగా చూపుతారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసెంబ్లీని వేదికగా చేసుకుని జిల్లా సమస్యలను పరిష్కరించడంలో ఎవరు ముందుంటారనేది వేచిచూడాలి. సీఎల్పీ ఉపనేతగా వ్యవహరిస్తున్న టి.జీవన్‌రెడ్డికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం శాసనసభ వేదికగా దక్కే అవకాశం ఉన్నందున జిల్లా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జనం కోరుతున్నారు. ముందే మేల్కొన్నా... ఆచరణ ఏది? జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం ముందుగానే గ్రహించింది. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జనవరిలోనే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండాకాలంలో ఇకపై బిందెలు చేతపట్టుకుని రోడ్డుపైకి మహిళలు రాకూండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగిన నిధులూ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాల్లేవు. జిల్లాలో ఎటు చూసినా మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కుతూనే ఉన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా కరవు ఛాయలు అలుముకోవడంతో కరీంనగర్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలని, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సా...గనిస్తారా? పూర్తి చేస్తారా? ఇక జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా.. ఎత్తిపోతల పనులు పెండింగ్‌లో ఉండటంతో రాబోయే ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యం నెరవేరేలా లేదు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో మిడ్‌మానేరు ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించినా పనుల్లో పురోగతి మాత్రం కన్పించడం లేదు. 2017 ఖరీఫ్ నీటి అందించి తీరుతామనే హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. సహాయ, పునరావాసం కోసం భూ నిర్వాసితులు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టుల సంగతి చెప్పనక్కర్లేదు. నిధుల సమస్య వెంటాడుతోంది. పరిహారం చెల్లించలేదు. ఈ బడ్జెట్లోనైనా తగిన నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం హామీలకు బడ్జెట్లో చోటు దక్కేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో గత ఆగస్టు 8న జిల్లాలో పర్యటించిన సందర్భంగా అనేక హామీలు గుప్పించారు. కరీంనగర్ సిటీని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రధానాసుపత్రిని నిమ్స్ స్థాయిలో తీర్దిదిద్దుతామన్నారు. పెద్దపల్లి, మంథనిలో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కొండగట్టును తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దుతానని, వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి వంద కోట్లు ఖర్చు చేస్తామని, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తానని... ఇలా దాదాపు 40 హామీలు ఇచ్చారు. వాటికి సంబంధించిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. -
ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు
మూడింతలు పెరిగిన శాఖల అంచనాలు.. అంతగా ఇవ్వలేమంటూ తలపట్టుకున్న ఆర్థిక శాఖ మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలంటూ సూచన అనుకున్నంత ఆదాయం తీసుకురాకపోతే ఎలా..! ‘రెవెన్యూ’ తెచ్చే శాఖలపై ఆర్థికశాఖ అసంతృప్తి రేపటితో ముగియనున్న బడ్జెట్ ముందస్తు చర్చలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 3,00,000 కోట్లు..! ఇదేంటి మూడింతలు దాటిపోయిందని ఆశ్చర్యపోవద్దు... ఈసారి కేటాయింపుల కోసం వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల మొత్తం ఇది. బడ్జెట్ ముందస్తు చర్చల్లోనే ఆర్థిక శాఖ దిమ్మతిరిగిపోయేలా ప్రభుత్వ విభాగాలన్నీ కోరికల చిట్టా విప్పాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకు పైగా నిధులు కావాలంటూ ప్రతిపాదనలు సమర్పించాయి. అంతేకాదు... ‘కొత్త రాష్ట్రం కావడంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే ఇంత భారీగా నిధులు ఇవ్వాల్సిందేనని కొసరు మెరుపూ ఇచ్చేశాయి.. 2015-16 సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారం కిందే కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని శాఖల మంత్రులతో విడివిడిగా బడ్జెట్‌పై ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న శాఖలు మినహా అన్ని శాఖలతో చర్చలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాదాపు శాఖలన్నీ ఆర్థిక శాఖకు తమ ప్రతిపాదనలను సమర్పించాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకుపైగా నిధులు కావాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ వర్గాలు విస్తుపోయాయి. అన్ని నిధులు ఇవ్వాలంటే ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుందంటూ తల పట్టుకున్నాయి. తగ్గాల్సిందేనన్న ఆర్థిక శాఖ.. సాగునీటి రంగానికి రూ. 17,692 కోట్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖ కోరగా... ఇంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్ల కంటే తక్కువకు తగ్గించి ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది. కీలకమైన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) రూ. నాలుగు వేల కోట్లు కోరింది. విద్యుత్ శాఖ రూ. 12,600 కోట్లు కావాలని ప్రతిపాదించింది. గత ఏడాది విద్యుత్ శాఖకు ప్రభుత్వం రూ. 3,500 కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 1,000 కోట్లను జెన్కోలో పెట్టుబడిగా పెట్టింది. దీనితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కోరింది. కానీ అంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఇక పరిశ్రమల శాఖకు గత ఏడాది రూ. 830 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 2,300 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్అండ్బీ విభాగం సైతం గతం కంటే ఘనంగా రూ. 10,800 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆదాయమేదీ..? ఆదాయం తెచ్చి పెట్టాల్సిన శాఖలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే... జనవరి వరకు రూ. 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల వ్యవధిలోనే కనీసం మరో రూ. 6,000 కోట్లు రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకొని సాధించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాల ద్వారానే రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం రావాల్సి ఉందని... లక్ష్య సాధనలో ఆ విభాగాలు వెనుకబడితే ఆదాయం బాగా తగ్గిపోతుందని చర్చల సందర్భంగా మంత్రి ఈటెల సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇబ్బడి ముబ్బడిగా నిధులు కావాలని కోరుతూ ప్రతిపాదనలిచ్చిన మిగతా విభాగాలు.. వీలైనంత కుదించి ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. బుధవారంతో బడ్జెట్‌పై ముందస్తు చర్చలు ముగియనున్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని శాఖలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. పన్ను వసూళ్ల కోసం రూ. 496 కోట్లు! చెక్‌పోస్టులు, తనిఖీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అధిక మొత్తాన్ని కేటాయించాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక శాఖను కోరింది. రెండు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో పాటు ఏడు సరిహద్దు చెక్‌పోస్టుల నిర్మాణం, కమిషనరేట్ భవన నిర్మాణం, ఇతర వ్యయం కోసం రూ. 496 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే భారీగా కోతలు.. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది నెలల కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రూ. లక్ష కోట్ల మార్కు దాటింది. భారీగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకోవడంతో వాస్తవ అంచనాలు పట్టుతప్పాయి. తీరా బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఆదాయ, వ్యయాలకు పొంతన లేని పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు అందకపోవడం, అదనంగా ఎంచుకున్న ఆదాయ మార్గాలు ఆచరణలో సఫలం కాకపోవటం, అప్పుల పరిమితి కూడా పెరగకపోవటంతో 2014-15 ఏడాది ఆదాయం రూ. 75 వేల కోట్లకు మించడం గగనంగా మారింది. మిగతా రూ. 25 వేల కోట్ల పైచిలుకుకు బడ్జెట్లో కోత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మొదలైన రెండో బడ్జెట్ కసరత్తు అత్యంత ప్రాధాన్యంగా మారింది. దానికితోడు వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు చుక్కలు చూపిస్తున్నాయి. -
రూ.11,960 కోట్లు.. ఆగిపోయాయ్!
విడుదల కాని కేంద్ర నిధులు మరో 3 నెలలే గడువు తెచ్చుకోకపోతే మురిగిపోయే ప్రమాదం అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధుల మాట పక్కన పెడితే... ప్రణాళిక నిధులకు సైతం ఎసరొచ్చేలా ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్న తెలంగాణకు అపార నష్టం ముంచుకొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన ప్రణాళిక నిధులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వివిధ విభాగాల పరిధిలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు కేటాయించిన రూ.11,960 కోట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ నిధులను తెచ్చుకోకుంటే అవన్నీ మురిగిపోనున్నాయి. ఆర్థిక శాఖ అప్రమత్తం.. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. విభాగాల వారీగా కేంద్రం కేటాయింపులు.. ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. వాటి ఖర్చుల వివరాలతో నివేదిక సిద్ధం చేసింది. మార్చిలోగా ఈ నిధులు విడుదల చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులను నిర్దేశించింది. విభాగాల వారీగా ఆయా శాఖల మంత్రులకు కేంద్రంపై ఒత్తిడి పెంచే బాధ్యతను అప్పగించింది. వారం రోజుల్లో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎవరికి వారు తమ శాఖకు సంబంధించి నిలిచిపోయిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సూచించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఇటీవల జరిగిన భేటీలోనూ తాను ఈ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధుల వినియోగపు పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించలేదనే కారణంతో కొన్ని విభాగాలు నిధుల విడుదలకు కొర్రీలు పెడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో యూసీలను వెంటనే సమర్పించటంతోపాటు ఆర్థిక సంవత్సరపు గడువు ముగిసేలోగా మిగిలిన నిధులు రాబట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. - సాక్షి, హైదరాబాద్ వచ్చింది 17 శాతమే.. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక పద్దులో తెలంగాణ రాష్ట్రానికి రూ. 14,443 కోట్ల కేటాయింపులు చేసింది. అందులో ఇప్పటి వరకు కేవలం రూ. 2,483 కోట్లు విడుదల చేసింది. కేవలం 17 శాతం నిధులు విడుదలైన తీరు చూస్తే.. కేటాయింపులు కొండంత.. ఇచ్చింది గోరంత.. అన్నట్లుగానే ఉంది. మిగతా 83 శాతం నిధులు కేంద్రం ఖజానాలోనే ఆగిపోయాయి. -
రాచకొండలో స్టూడియో నిర్మించొద్దు
రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ తిరుమలరావు భద్రాచలం: రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల మధ్యలోని చారిత్రాత్మక రాచకొండ ప్రాంతాన్ని సినిమా స్టూడియోలకు కేటాయించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. సోమవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన మేధావుల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ శతాబ్దంలో 150 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న రాచకొండ చారిత్రాత్మక సంపదకు పెట్టింది పేరన్నారు. ఇటువంటి ప్రదేశంలో 30 ఎకరాలను సినిమా స్టూడియో నిర్మాణానికి ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదన్నారు. స్టూడియో నిర్మిస్తే ప్రకృతి సోయగాలు, పురాతన కట్టడాలు, అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. చారిత్రకమైన రాచకొండ ప్రాంతాన్ని అపవిత్రం చేయాలనే ఆలోచన మానుకోవాలని, కొత్త రాష్ట్రంలో తెలంగాణ సంపదకు నష్టం వాటిల్లే చర్యలపై ప్రభుత్వం పునరాలోచించాకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చెట్టు విషయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాచకొండ భూముల విషయంలోనూ అలాగే చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూములపై కొందరు కన్నేస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి చారిత్రక సంపదను కాపాడుకున్నామని గుర్తు చేశారు. -
'ఆ రెండు నగరాల' తరహాలో భూసేకరణ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు చండీగడ్, రాయ్‌పూర్ తరహాలో భూమి సేకరణ చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి, ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ పి.నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు మేలు చేసే విధంగా పాలసీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ఏపీ రాజధాని కమిటీ సమావేశమై ఇప్పటికే ల్యాండ్ పూలింగ్‌పై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ల్యాండ్ పూలింగ్ విధానాలపై చర్చించామన్ని తెలిపారు. ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో రాజధాని కమిటీ సమావేశాలు ఉంటాయని నారాయణ వెల్లడించారు. -
కేస్ స్టడీస్.. ఎంతో ముఖ్యం
Ashok Banerjee, Dean, iim - Calcutta- గెస్ట్ కాలమ్ ‘ప్రస్తుతం దేశంలో ఎన్నో కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి దిశగా పలు కొత్త స్టార్టప్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎంటర్ప్రెన్యూరియల్ ఔత్సాహికులు మరెందరో.. మదిలో మంచి ఆలోచనలున్నా.. కార్యరూపం దాల్చేందుకు మార్గాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అకడమిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పరిశ్రమ వర్గాల వరకు అందరూ ముందుకొచ్చి స్టార్టప్స్‌కు సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది’ అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కోల్‌కతా ‘న్యూ ఇనీషియేటివ్స్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్’ డీన్ ప్రొఫెసర్ అశోక్ బెనర్జీ. ఆయన కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎంకాం, రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత ఐఐఎం-లక్నో, ఐఎంటీ- ఘజియాబాద్ వంటి ప్రముఖ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో బోధించారు. గతేడాది ఐఐఎం-సీలో ప్రారంభించిన సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్‌కు అవకాశాలు, ఐఐఎం-కోల్‌కతా చేపడుతున్న చర్యలపై ఆయనతో ఇంటర్వ్యూ... ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఎంతో దేశంలో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంది. స్టార్టప్స్ సంఖ్య మరింత పెరగాలి. ముఖ్యంగా స్మాల్ మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎస్ఎంఈ) విభాగంలో స్టార్టప్స్ రూపుదిద్దుకుంటే.. కింది స్థాయి నుంచే అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఈ స్టార్టప్స్ ఫలితంగా ఎస్ఎంఈ రంగం పురోగమిస్తుంది. దాంతోపాటు పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ, ముడి ఉత్పత్తుల సంఖ్య పెరిగి స్థూలంగా ఉత్పాదకత పెరుగుతుంది. అదే సమయంలో ఆదాయాన్నీ అందిస్తుంది. ఇన్స్టిట్యూట్.. ఇండస్ట్రీ కలిస్తేనే స్టార్టప్స్‌ను ప్రోత్సహించే క్రమంలో అకడమిక్ ఇన్స్టిట్యూట్లు, పారిశ్రామిక వర్గాలు రెండూ కలిసి సంయుక్తంగా కృషిచేయాలి. అలాచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. అకడమిక్ ఇన్స్టిట్యూట్స్.. ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో పరిశ్రమల సహకారం కూడా తీసుకోవాలి. తద్వారా సమాజ అవసరాలు తీర్చే ఉత్పత్తులు రూపొందించే విధంగా స్టార్టప్స్‌ను తీర్చిదిద్దొచ్చు. ఈ ఉద్దేశంతోనే గతేడాది ఐఐఎం-కోల్‌కతాలో ఇన్నోవేషన్ పార్క్ పేరుతో స్టార్టప్స్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. ప్రతి ఏటా 40 స్టార్టప్స్‌కు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. ఈ ఇన్నోవేషన్ పార్క్ ప్రధానంగా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, క్లీన్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్, అనలిటిక్స్ విభాగాల్లో స్టార్టప్స్ ఔత్సాహికులకు సేవలందిస్తోంది. కొత్త ఆలోచనలు ఆవిష్కరించేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐఐఎం-కోల్‌కతా ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఈఐ)ను కూడా ప్రారంభించింది. ఈ సెంటర్లో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు మమేకమై కొత్త ఆలోచనలను ఆవిష్కరించే విధంగా తోడ్పాటునందిస్తున్నాం. ప్రస్తుత సమాజ అవసరాల దృష్ట్యా దేశంలోని అన్ని ఇన్స్టిట్యూట్లు ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగం మరింత ముందుకు సాగుతుంది. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు.. ఎంతో అవసరం ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యార్థులకు కెరీర్ పరంగా, పరిశ్రమ వర్గాలకు నిపుణులైన మానవ వనరుల కోణంలో ఎంతో ప్రయోజనం చేకూర్చేవి.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు! వీటివల్ల వాస్తవ అవసరాలతోపాటు విద్యార్థులు తాము నైపుణ్యం సాధించాల్సిన అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. అకడమిక్‌గా విదేశీ ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ నైపుణ్యాలు పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. భవిష్యత్తులో మంచి లీడర్‌గా ఎదగాలనుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ సమస్యలపై అవగాహన ఉండటం ఎంతో అవసరం. ఈ ఆవశ్యకతను గుర్తించిన ఐఐఎం-కోల్‌కతా.. కమ్యూనిటీ ఆఫ్ యూరోపియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్(సీఈఎంఎస్)తో ఒప్పందం చేసుకుంది. తద్వారా ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 28 ప్రముఖ బిజినెస్ స్కూల్స్ కూటమిగా ఉన్న సీఈఎంఎస్‌తో ఒప్పందం.. విద్యార్థులు అంతర్జాతీయ నిర్వహణ నైపుణ్యాలు పొందేందుకు దోహదపడుతుంది. కేస్ స్టడీల ప్రాధాన్యం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో కీలక పాత్ర పోషించే విభాగం.. కేస్ స్టడీలు. వీటి ద్వారా విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఈ విషయంలోనూ అకడమిక్ ఇన్స్టిట్యూట్లు.. పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తే.. అటు విద్యార్థులతోపాటు ఇటు పరిశ్రమకు ఉపయుక్తంగా ఉంటుం ది. ఒక పరిశ్రమలోని వాస్తవ సమస్యపై విద్యార్థులు అధ్యయనం చేయడం ద్వారా విశ్లేషణ, కేస్ పెడగాగీ, కేస్ రైటింగ్ వంటి ఎన్నో అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐఎం- కోల్‌కతా.. కెనడాలోని వెస్ట్రన్ యూనివర్సిటీ ఐవీ బిజినెస్ స్కూల్‌తో ఒప్పందం చేసుకుని పలు కేస్ స్టడీలపై అధ్యయనం చేస్తోంది. ఆ మూడు లక్ష్యాలతో నాణ్యమైన విద్య దిశగా ఐఐఎం-కోల్‌కతా.. గ్రోత్, గవర్నెన్స్, గ్లోబలైజేషన్ అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటికి కార్యరూపం ఇవ్వడంలో ఫ్యాకల్టీ ఎంతో కృషి చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఇన్స్టిట్యూట్కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బి-స్కూల్స్ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం-కోల్‌కతా టాప్-20, టాప్-50లో నిలుస్తోంది. విద్యార్థులకు సలహా మేనేజ్మెంట్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. విశ్లేషణ సామర్థ్యం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్య రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన, విభిన్న సంస్కృతులతో మమేకం కాగల దృక్పథం ఉండాలి. ఈ మూడూ ఉంటే భవిష్యత్తులో మంచి బిజినెస్ లీడర్లుగా కార్పొరేట్ ప్రపంచంలో రాణించగలరు!! -
నేడు జయశంకర్ జయంతి
హన్మకొండ అర్బన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, నవ తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ 80వ జయంతిని బుధవారం అధికారికంగా నిర్వహించనున్నారు. కొత్త రాష్ట్రంలో తొలి జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో బుధవారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఓరుగల్లు సేవా సమితి ఏర్పాట్లు చేసింది. తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ అవిశ్రాంత కృషి చేశారు. విద్యార్థి దశనుంచి ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్.. మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని చెప్పినా చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆనాగర్యోంతో 2011జూన్ 21న కన్నుమూశారు. పార్థీవదేహం ఉంచిన చోటే... జయశంకర్ కన్నుమూసిన తరువాత ప్రజల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌లో ఉంచారు. అనంతరం దశదిన ఖర్మ వరకు పార్కులో జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌ను జయశంకర్ ృ్మతివనం అని పేరుపెట్టారు. రాష్ట్రం ఏర్పాటు అయితన తరువాత స్వయంగా రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ నగరంలో జయశంకర్ ృ్మతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం స్థలపరిశీలన,విగ్రహం ఏర్పాటు వంటి పనుల బాధ్యతలు జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఓరుగల్లు సేవాసమితికి అప్పగించారు. దీంతో నగరంలోని జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు నగరంలోని పలు ప్రదేశాలు పరిశీలించిన సమితి సభ్యులు.. చివరికి బాలసముద్రంలోని ఏకశిలాపార్కు సరైన స్థలమని చెప్పారు. రూ.1.37కోట్లతో ప్రతిపాదనలు బాలసముద్రంలోని పార్కులో రూ.1.37కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందకు ప్రతి పాదనలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరాయి. త్వరలో ఈ నిధులు విడుదలవుతాయని కలెక్టర్ మంగళవారం ప్రకటించారు. నిధులు రాగానే అభివృద్ధి పనులు ప్రారంబిస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మాణం, మొక్కల పెంపకం, తాగునీరు, సానిటరీ సౌకర్యాలు, కమ్యూనిటీ హాలు నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం మాత్రం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ల ఆర్థిక సహకారంతో ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు పనులు చేపట్టారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటు సమితి ఆధ్వర్యంలో సృతి వనంలో బుధవారం నిర్వహించనున్న జయశంకర్‌సార్ 80వ జయంతిని పురస్కరించుకుని*’10లక్షల ఖర్చుతో పది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహంచే జయంతి వేడుకలకు రాష్ట్ర ఉపముఖ్యంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసుదనాచారితో పాటు కలెక్టర్ జి.కిషన్, ఓరుగల్లు సేవాసమితి ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అదేవిధంగా వరంగల్‌లోని విశ్వకర్మ వీధిలో, కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో కూడా జయశంకర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కీలక పోస్టులుఖాళీ...
జెడ్పీ సీఈఓ పోస్టు సహా భర్తీకాని 12 స్థానాలు కొన్ని నెలలుగా ఇన్చార్జలతోనే పాలన ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు మందగిస్తున్న అభివృద్ధి పనులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఎన్నో ఆశలతో పాలన మొదలైంది.. నూతన పథకాలు ప్రారంభమతున్నాయి.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది, పథకాలను అమలు చేసేది అధికార యంత్రాంగమే.. జిల్లా స్థాయి అధికారుల పాత్ర దీంట్లో కీలకంగా ఉంటుంది. వీరే, ఆయా శాఖల సిబ్బందిని పరిపాలన పరంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అయితే పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. ఇన్చార్జ అధికారులతో నెట్టుకురావాల్సి వస్తోంది. ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమం అమలు మందగిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికల రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లకు అప్పగించింది. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ప్రణాళిక తయారీ బాధ్యతలను చూడాలి. ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టు నెల రోజుల క్రితమే ఖాళీ అయింది. జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లుకు జిల్లా పరిషత్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకే అధికారి రెండు కీలకమైన పోస్టుల్లో ఉండడంతో విధుల నిర్వహణ సాఫీగా సాగడం లేదు. మన ఊరు... మన ప్రణాళికకు సంబంధించి కూడా ముందుగా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో ఈ పని చేయకపోవడంతో కొత్త కార్యక్రమం స్ఫూర్తి పూర్తిగా నెరవేరలేదు. గతంలో లాగే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ రేషన్‌కార్డులకు, సామాజిక పించన్లకు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎక్కువ గ్రామాల్లో ప్రణాళిక రూపలక్పన అంశం రెండో ప్రాధాన్యంగా జరిగింది. ప్రాథమిక విద్యకు సంబంధించి కీలకమైన రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి పోస్టు ఖాళీగా ఉంది. దీనికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు జాయింట్ కలెక్టర్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి బాధ్యతలు అదనంగా చూడాల్సి వస్తోంది. సహకార శాఖను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) పోస్టు ఖాళీగా ఉంది. డివిజన్ స్థాయి సహకార అధికారి సంజీవరెడ్డి డీసీవో పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దళితుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పోస్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులో సైతం ఇంచార్జీ అధికారే ఉన్నారు. రెవెన్యూకు సంబంధించి పట్టణంలో కీలకమైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేసే అధికారి రెవెన్యూ మంత్రి పేషీలో చేరి రెండు నెలలు గడుస్తున్నా కొత్తగా ఏ అధికారినీ నియమించ లేదు. ఏటూరునాగారంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పోస్టు నెలల క్రితమే ఖాళీ అయింది. ములుగు రెవెన్యూ డివి జనల్ అధికారి మోతీలాల్‌కు ఈ పోస్టును అదనపు బాధ్యతల కింద అప్పగించారు. శాఖకు సంబంధించి జిల్లాలోని డిప్యూటీ డెరైక్టరు పోస్టు ఖాళీగానే ఉంది. ఈ శాఖ అసిస్టెంట్ డెరైక్టరు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాలై అమలుపై అధికార యంత్రాంగానికి ప్రజలకు సంధానకర్తగా వ్యవహరించే సమాచార శాఖలోనూ ఖాళీలు ఉన్నా యి. జిల్లా ప్రజాసంబంధాల అధికారి పోస్టులో దాదాపు రెండు నెలలుగా ఇంచార్జీ అధికారే ఉన్నారు. తాజాగా... గురువారం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనే జరు ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో నల్లగొండ జిల్లా జోనల్ మేనేజర్ రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఖాళీగా ఉంది. సీఈఓగా పనిచేసిన ఆంజనేయులు నెల క్రితం ఉద్యోగ విరమణ పొందగా.. జిల్లా నీటి నిర్వహణ సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.వెంకటేశ్వర్లుకు జెడ్పీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాకు పూర్తి స్థాయి అధికారి లేరు. ఈ పోస్టులో ఉన్న పి.సాంబశివరావును కొన్ని రోజుల క్రితం రీజినల్ డెరైక్టర్‌గా నియమించారు. తాజాగా ఆయన గురువారం వైద్య శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్‌గా నియమితుల య్యారు. ఆయనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయూనికి కీలక తరుణమిది. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖకు జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి(జేడీఏ) పోస్టులో కింది స్థాయి అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
రోడ్లకు ‘విభజన’ శాపం !
ఆగిన రూ.100 కోట్ల నిధులు పల్లెలకు రూ.47 కోట్లు అవసరం సీఎం హామీ అమలయ్యేనా..? రోడ్ల ప్రగతికి ‘విభజన’ శాపమరుుంది. కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాఖల కుదింపు జరిగింది. ఇందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ఇంతవరకు పురుడు పోసుకోలేదు. సంబంధిత శాఖకు అధికార యంత్రాంగం కూర్పు జరగనేలేదు. నిధుల మంజూరు విషయం ఇంతవరకు తేలలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కంకర రోడ్లపై పాదచారులు, నరకయాతన అనుభవిస్తున్నారు. చిత్తూరు (అర్బన్): ‘జిల్లాల్లో ప్రతి మారుమూల గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఉండి తీరాల్సిందే. రోడ్డు లేకుండా ఏ ఒక్క పల్లె కనిపించడానికి వీల్లేదు.’ ఇవీ ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల కుప్పానికి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారులతో అన్న మాటలు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చూస్తే వాస్తవ పరిస్థితులు వేరేవిధంగా ఉన్నాయి. జిల్లాలో రోడ్డులేని గ్రామాలు చాలానే ఉన్నాయి. వీటికి తక్షణం రోడ్డు వసతి కల్పించాలంటే దాదాపు రూ.47 కోట్లు కావాలి. ఇక రోడ్ల నిర్వహణకు రూ.25 కోట్లు అవసరం. ఇవి కాకుండా కొత్తగా రోడ్ల విస్తరణకు రూ.28 కోట్లు కావాలి. అంటే ముఖ్యమంత్రి నోటి వాక్కు ఆగమేఘాల మీద అమలు చేయడానికి అధికారుల వద్ద రూ.100 కోట్లకు పైనే సొమ్ములుండాలి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు అధికారుల వద్ద ఉన్నాయా..? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిధులను ఏమైనా విడుదల చేసిందా..? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పవచ్చు. జిల్లాలో 5188 కి.మీ దూరం వరకు ఆర్అండ్బీ రోడ్లున్నాయి. ఇందులో 645 కి.మీ జాతీయ రహదారులు, 4428 కి.మీ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. 114 కి.మీ ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మితమైన రోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా 1646 కి.మీ దూరం వరకు గ్రామీణ రోడ్లు విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏటా రూ.25 కోట్లు అవసరం. వీటితో పాటు కొత్తగా రోడ్ల నిర్మాణానికి ఏటా రూ.100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ విడుదలవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న రెండు రాష్ట్రాల రోడ్లు ఇప్పటికే బాగా అభివృద్ధి చెందాయి. మన సరిహద్దు రోడ్లు మాత్రం అంతంతమాత్రంగా దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లతో ముడిపడిన అంశం జిల్లాలో రోడ్ల నిర్వహణ అంశం కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది. ఒక్కో ఏడాదికి దాదాపు రూ.100 కోట్ల వరకు జిల్లాలోని రోడ్ల కోసం నిధులు వస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంత్సరానికి ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలైతే అధికారులు మార్చి వరకు దాదాపు రూ.97 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణం అవసరం ఉంది, ఎంత నిధులు కావాల్సి ఉందనే విషయాలపై అధికారులు నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడం జరిగిపోయి ఉండాలి. సరిగ్గా జూన్ 20 దాటిందంటే అధికారులు రోడ్ల నిర్వహణ, నిర్మాణం కోసం టెండర్లు పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి ఉంటారు. కానీ మారిన ప్రత్యేక పరిస్థితుల వల్ల జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విభజన శాపం... రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. ఏప్రిల్ మొదటి వారంలో తయారుకావాల్సిన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఇంకా కాగితాల్లోకి రాలేదు. రాష్ట్రంలో ఇంకా రోడ్లు, భవననాల శాఖకు రూపం పోసుకోకపోవడం, అధికార యంత్రాంగం కూర్పు జరగకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు లేకుండానే జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేయూలని చెప్పడం విడ్డూరంగా ఉంది. మాటలు చెప్పిన అదే నోటితో సీఎం నిధుల విడుదల విషయం కూడా చెప్పేస్తే జిల్లాలో రోడ్ల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. -
'సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవు'
రాజధాని అనేది అభివృద్ధి ఉన్న ప్రాంతంలోనే ఉంటుందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం, కంపెనీలు ఏర్పాటు ఎక్కడ ఉండాలన్నది రాజకీయ నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం నగరంలో సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు'పై సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ... రాష్ట్రానికి రాజకీయంగా న్యాయం జరగకుంటే ముక్కలైన తెలుగుజాతి మళ్లీ ఐక్యంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలలో నగదు ఖర్చుపెట్టి గెలిపించిన వారి కోసమే ప్రభుత్వం పని చేస్తుందని... తప్ప వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. రాయలసీమలో ఇతర ప్రాంతాలవారే వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని రాఘవులు గుర్తు చేశారు. -
బస్సు ఎరుగని బస్టాండ్!
జగదేవ్‌పూర్: కొత్త రాష్ట్రం.. కొత్త పరిపాలన.. కొత్త పనులు..అపై సీఎం ఇలాకా..అభివృద్ధికి అడ్డు ఉంటుందా.. ఇలాంటి మాటలు ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పల్లె ప్రజల మనస్సుల్లో మెదులుతున్నాయి. కానీ జగదేవ్‌పూర్ మండల ప్రజల్లో మాత్రం అశలు రెట్టింపులోనే ఉన్నాయి. ఎందుకంటే సీఎం ఫాంహౌస్ మండల పరిధి ఎర్రవల్లి గ్రామంలో ఉండడమే. మండల కేంద్రంలో నాడు కేసీఆర్ రవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్ ప్రారంభించారు. నేటికి బస్సు వచ్చింది లేదు. పస్తుతం బస్టాండ్ యాచకులకు నిలయంగా మారింది. జగదేవపూర్‌లో బస్టాండ్ నిర్మాణానికి అప్పటి రవాణశాఖ మంత్రి కేసీఆర్ బస్టాండ్‌ను ప్రారంభించారు. రెండు మూడు సార్లు మాత్రమే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి వచ్చినట్లు గ్రామస్థులు చెప్పుతున్నారు. 14 ఏళ్లుగా బస్టాండ్ నిరుపయోగంగా మారి యాచకులకు అడ్డాగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం బస్సులను రోడ్డుపై నుంచే నడిపిస్తున్నారు తప్ప బస్టాండ్‌లోకి రావడం లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల బస్సులు, ఆటోలు ఒకచోటి నుంచే మలుపుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులు హోటళ్లు, కిరాణ, వస్త్రాల దుకాణాలలో తల దాచుకుంటున్నారు. పలుసార్లు జగదేవపూర్ గ్రామ ప్రజలు బస్టాండ్‌ను పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులను, ఆర్టీసీ అధికారులకు కోరినా ఫలితం లేకుండా పోయింది. నెలకొన్న బస్టాండ్ దుస్థితితో ప్రయాణికులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ప్రసుత్తం కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారని, ఇప్పుడైనా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
రైల్వే బడ్జెట్... మారేనా ట్రాక్?
ఏటా కొత్త రైళ్ల ప్రతిపాదనలు అరకొరగా కేటాయింపులు కొత్త రాష్ర్టం నేపథ్యంలో వరాలపై ఆశలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఏర్పడాక ప్రకటించే తొలి రైల్వే బడ్జెట్‌పై అందరిలో ఆసక్తి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం విశాఖపై ఎలాంటి వరాలు కురిపిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కావడం, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు విశాఖతో మంచి అనుబంధం ఉండడం కారణంగా ఈ దఫా ఈ ప్రాంతానికి రైల్వే పరంగా అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్న ఆశలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు విద్యార్థి కాలం నుంచి కూడా సన్నిహితులు కావడంతో ఈ జోడీ విశాఖకు ఎలాంటి వరాలు మూటగట్టుకొస్తారోనని రైల్వే వర్గాలు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కొత్త రైల్వే జోన్ అంశం కూడా ఈ బడ్జెట్లోనే తేలిపోతుండడంతో కొత్త రైళ్లన్నీ ఆ ప్రాంతం నుంచే బయల్దేరాలి. రాజధానిని కలుపుతూ రాష్ట్ర నలువైపులా రైళ్ల కూత పెట్టాలి. ఆ రైళ్లన్నీ విశాఖ-విజయవాడ మీదుగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ పరుగులు తీయాలి....మరి విశాఖ వాసుల ఈ ఆకాంక్షలు నెరవేరేనా? ఈ నెల 8వ తేదీన ప్రకటించే బడ్జెట్ కోసం వేచి చూడాల్సిందే. తాత్కాలిక బడ్జెట్లో ఏముంది..! యుపీఏ ప్రభుత్వం ఇంటి దారి పట్టేముందు ఆదరాబాదరాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక రైల్వే బడ్జెట్లో విశాఖకు మొండి చేయి చూపింది. విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ మినహా వాల్తేరు డివిజన్ కు సంబంధించిన మరే రైలునూ ప్రకటించలేదు. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించినా ఆ కోటా దక్షిణ మధ్య రైల్వేకి చెందినది. అందుకే త్వరలో వెలువడే రైల్వే బడ్జెట్‌పై అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇవీ ప్రతిపాదిత రైళ్లు రోజూ నడపాలని రైళ్ల డిమాండ్లు విశాఖ-చెన్నై, విశాఖ-షిర్డీ మధ్య వారానికోసారి నడుస్తున్న రైళ్లను ప్రతి రోజు పెంచాలని డిమాండ్ ఉంది. వారానికి ఓ రోజు నడుస్తున్న విశాఖ-గాంధీధాం, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-కొల్లాం, విశాఖ-షిర్డీ రైళ్లను వారానికి మూడుసార్లు ఫ్రీక్వెన్సీ పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్‌కు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సిందే. ఈ రైళ్లు వచ్చే చాన్స: ఢిల్లీ, తిరుపతిలకు దురంతో రైలు రావొచ్చని భావిస్తున్నారు. అంతర రాష్ట్ర రైళ్లు తిరుపతి-వారణాసి వయా విశాఖ, బెజవాడ విశాఖ-మైసూర్ వయా విజయవాడ విశాఖపట్నం-అహ్మదాబాద్ వయా విజయవాడ గుంటూరు-గౌహతి వయా విశాఖ పొడిగించాల్సిన రైళ్లు హౌరా-విశాఖ రైలును గుంటూరు వరకూ విశాఖ-టాటా రైలును గుంటూరు వరకూ ఛెన్నై-విజయవాడ రైలును విశాఖ వరకూ -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు
మెదక్: కొత్త రాష్ట్రంలో కొలువులు పర్మనెంట్ అవుతాయని ఆశిస్తున్న తరుణంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. రెండు శాఖల్లో ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న సుమారు 648 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఆర్వీఎం, మెప్మా ఉద్యోగుల సేవలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. విద్యాశాఖలో విద్యాహక్కు చట్టం కింద నైపుణ్యం గల విద్యను అందించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, డ్రాయింగ్, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్ కింద నిపుణులను నియమించుకోవడానికి రెండేళ్ల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 6, 7,8వ తరగతుల్లో వందకు పైగా విద్యార్థులుంటే ఆ పాఠశాలలకు నిపుణుల పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 271 డ్రాయింగ్, 269 డ్రాప్ట్, 79ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు మంజూరయ్యాయి. అలాగే మెప్మా, ఐకేపీ పరిధిలో జిల్లాలో 12 కమ్యూనిటీ ఆర్గనైజర్ పోస్టులు, 3 ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ పోస్టులు, 8డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 6 జిల్లా స్పెషలిస్టు పోస్టులు కలిసి మొత్తం 29 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు నిరుద్యోగులైన నిపుణులు ఉద్యోగాల్లో చేరి తమ సేవలందిస్తున్నారు. విద్యాశాఖలో వీరికి నెలకు సుమారు రూ.4500ల పై చిలుకు జీతం అందుతోంది. ఇటీవలే ఈ జీతం రూ.6వేలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే గత విద్యా సంవత్సరం చివరి రోజున వారి పోస్టులను ఆపేసినా కొన్ని రోజుల తర్వాత వారిని తిరిగి తీసుకున్నారు. అయితే గతంలో శిక్షణ పొందిన నిపుణులు లేకపోవడంతో కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిని భర్తీ చేయడానికి రాష్ట్రీయ విద్యా మిషన్(ఆర్వీఎం) ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఇటీవల అవుట్సోర్సింగ్ పోస్టులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాష తెలిపారు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఇక తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు. మెప్మా ఎంప్లాయిస్ అధ్యక్షులు సాయికృష్ణ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. -
దళితులకు మూడెకరాలు ఎక్కడిస్తరు?
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కొత్త ప్రభుత్వం కృషిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. దళితు లకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించా రు. ఇందుకు కావల్సిన భూమి అందుబాటులో లేకపో వడంతో అధికారులు అయోమయం చెందుతున్నారు. - పంపిణీకి జిల్లాలో భూమి కరువు - సీఎం ప్రకటనతో దళితుల్లో ఆనందం - జిల్లా అధికారుల్లో ఆందోళన - ఆగస్టు 15వరకు సాధ్యమయ్యేనా? నిజామాబాద్ అర్బన్: కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దళితులపై వరాల జల్లు కురిపిస్తోంది. ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. కానీ..ప్రభుత్వ నిర్ణయంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి జి ల్లాలో భూమి అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 15నుంచి దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. దీంతో అధికారులు భూముల కోసం అన్వేషణ ప్రారంభిం చారు. ఎక్కడెక్కడ జిల్లాలో పంపిణీకి కావల్సిన భూము లు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. భూమి లేకపోవడంతోనే గతంలో ఇందిరమ్మ పథకం 6వ విడత భూపంపిణీ కార్యక్రమం జిల్లా లో నిర్వహించలేదు. ప్రస్తుత సర్కార్ దళితులకు భూపంపిణీపై పకడ్బందీ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు భూముల ఆచూకీ తీస్తున్నారు. ఇప్పటికే సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిసింది. దళితులకు మూ డెకరాల భూపంపిణీ ఎలాగైన ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం అధికారులకు చెమటలు పట్టిస్తోంది. ఆరో విడతకే కరువు జిల్లాలో ఇందిరమ్మ భూపంపిణీ కార్యక్రమంలో భా గంగా మొదటి విడత కార్యక్రమంలో 1,086 మంది ఎస్సీలకు 1343.25 ఎకరాల భూమిని కేటాయించా రు. రెండోవిడతలో వెయ్యిమంది ఎస్సీలకు 1028.03 ఎకరాలు, మూడోవిడతలో 690 ఎస్సీ లబ్ధిదారులకు 683.23 ఎకరాలు, నాలుగో విడతలో 1,235 లబ్ధిదారులకు 1379.06 ఎకరాలు, ఐదో విడతలో 361 మంది ఎస్సీ లబ్ధిదారులకు 420.29 ఎకరాల భూమి ని కేటాయించారు. ఈ ఐదు విడతల్లో ఎస్సీలు మిన హా మిగితా వర్గాలకు చెందిన 17,495మంది లబ్ధిదారులకు కలిపి 22,129.05 ఎకరాలను కేటాయించా రు. ఆరో విడతకు వచ్చేసరికి ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. భూమి అందుబాటులో ఈ విడత చేపట్టనే లేదు. స్వాధీనం చేసుకోవాల్సిందేనా..! ప్రస్తుతం అర్హులందరికీ మూడు ఎకరాల భూపంపిణీ చేపట్టాలంటే చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జనాభా 25.50 లక్షలు ఉండగా.. అందులో 8.50లక్షల మంది దళితులు ఉన్నారు. వీరి లో అర్హులైన వారందరికి మూడున్నర ఎకరాల చొ ప్పున భూపంపిణీ చేపట్టాలంటే పెద్దమొత్తంలో అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం భూమి అందుబాటులో లేకుంటే గతంలో పరిశ్రమలు, అభివృద్ధి పనులకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నందిపేట మండలం లక్కంపల్లి గ్రామం వద్ద ఫుడ్‌పార్కుకు కేటాయించిన భూమి మాత్రమే ఉంది. మిగితా ఎక్కడా ఇలాంటి భూములు అందుబాటులో లేవు. ఉన్న భూములను కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఇవి కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. ఇలాంటి భూములను కూడా అధికారులు పంపిణీ చేయడానికి పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం అవసరమైతే ప్రైవేటు భూములను సేకరించి ఇస్తామని చెప్పడంతో ఆ దిశగానూ దృష్టిసారిస్తున్నారు. భూపంపిణీపై సర్కారు నుంచి మరింత స్పష్టమైన విధి విధానాలు అందగానే పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా అధికారులు సమయాత్తమవుతున్నారు. -
చార్జ్
ప్రజలకు బీజేపీ ప్రభుత్వ కానుక రైలు చార్జీలు పెంచుతూ నిర్ణయం సరకు చార్జీలనూ వదల్లేదు ప్రయూణికులపై అదనపు భారమే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ప్రజలపై భారాల బండ వేయడం మొదలుపెట్టింది.మొదటి మెట్టుగా రైల్వే చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సరకు రవాణా చార్జీలతో పాటు స్లీపర్ క్లాస్, ఏసీ టికెట్ రేట్లను పెంచడంతో రైల్వే ప్రయూణికులు ఆందోళనలో మునిగిపోయూరు. సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా గడవకముందే ఎన్డీఏ సర్కార్ ప్రజలపై పన్నుల దాడి చేస్తోంది. తాజాగా రైలు ప్రయాణికులపై పన్నుల భారం మోపింది. ధరలను, చార్జీలను నియంత్రిస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బీజేపీ ఇప్పుడు చార్జీల మోత మోగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనతోనే అతలాకుతలం అవుతున్న సీమాంధ్ర ప్రాంత సగటు ప్రయాణికుడు పెరిగిన చార్జీలను చూసి కంగుతింటున్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉండవని, పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు పోదామని భావిస్తున్న ఈ ప్రాంతవాసులకు పెరిగిన రైల్వే చార్జీలు భారమే అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బస్సు చార్జీలతో పోల్చితే రైలు చార్జీలు తక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాలతో పాటు ఉన్నత వర్గాలు రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు వీటి రేటు పెంచడంతో వారి గుండెలో రాయి పడినట్టయియంది. 25 నుంచి అమల్లోకి.. పెరిగిన రైలు చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలపై 14.2 శాతం చార్జీల మోతమోగే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలు 6.5 శాతం పెంచారు. ఈ భారం ప్రజలపై పరోక్షంగా పడనుంది. చార్జీల పెరుగుదల విషయానికి వస్తే.. స్లీపర్ క్లాస్ అయితే 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు రూ.30 నుంచి రూ.50 మేర చార్జీ పెంచారు. ఏసీ త్రీటైర్, టు టైర్ రూ.50 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్‌పై పెరిగిన చార్జీల రేట్లను రైళ్లలో టీటీఈలు వసూలుచేస్తారని రైల్వే అధికారులు చెప్పారు. చార్జీల పెంపు ఇలా.. సరకు రవాణా చార్జీలు : 6.5 శాతం స్లీపర్ క్లాస్ (300-500 కిలోమీటర్ల మధ్య) : రూ.30-రూ.50 ఏసీ త్రీటైర్, టు టైర్ : రూ.50- రూ.100 మధ్య -
ప్రారంభమైన టీఎస్ సిరీస్
సాక్షి, సిటీబ్యూరో: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు. ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్కే.. తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. పాత వాహనాలపై ప్రతిష్టంభన.. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్.. ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు. సికింద్రాబాద్‌లో.. కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్టీఏ పరిధిలో తొలి నెంబర్‌ను హబ్సిగూడకు చెందిన వ్యాపారి శ్రీధర్‌రెడ్డి దక్కించుకున్నారు. విఖ్యాత్ ఇన్ఫ్రా పేరిట తీసుకున్న బెంజి కారుకు టీఎస్10ఈఏ 0009 నెంబర్‌కు పోటీ లేకపోవడంతో కేవలం రూ.50 వేలకే దక్కించుకున్నారు. -
పట్టణాభివృద్ధికి పట్టం
ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్లను సూచికగా తీసుకోవాలి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి వ్యర్థాల సక్రమ వినియోగంపై దృష్టి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధీర్‌కృష్ణ వెల్లడి విజయవాడ : కొత్త రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సుధీర్‌కృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో స్థానిక ఉడా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు నూతనంగా ఏర్పడిన సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో నూతన రాజధాని, పట్టణాల ఆధునికీరణకు చేపట్టిన చర్యలను ఆంధ్ర రాష్ట్రంలో ఒక సూచికగా తీసుకోవాల్సి ఉంటుందని సమావేశంలో ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధికి కోసం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. భారత ప్రభుత్వ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర పరిపాలనా కార్యాలయాన్ని 500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను విపులీకరించారు. వినియోగ రుసుంతో దుబారాకు చెక్ దుర్వినియోగం, దుబారాను అరికట్టేందుకు వినియోగ రుసుం వసూలు చేయాలని సుధీర్‌కృష్ణ సూచించారు. నగరపాలక సంస్థ, వివిధ మునిసిపల్, రాష్ట్రస్థాయి అధికారుల నుంచి మౌలిక సదుపాయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించిన ఆయన మంచినీటికి వినియోగ రుసుం వసూలు చేయాలని చెప్పారు. అప్పుడే దుర్వినియోగాన్ని అరికట్టగలుగుతామన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ విధానంలో వినియోగించుకోవడం ద్వారా పునరుత్పత్తి పద్ధతిలో ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెనాలి పట్టణంలో వంద రోజుల ప్రణాళికతో రూపొందించిన రీసైక్లింగ్ విధానాల అమలు తీరును మునిసిపల్ అధికారులు వివరించారు. వ్యర్థాల సక్రమ వినియోగ పద్ధతులపై ఈ ఏడాది జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సమావేశ వివరాలను సుధీర్‌కృష్ణ ఈ సందర్భంగా వివరించారు. రీసైక్లింగ్ విధానంలో ఎంత ఖర్చు చేస్తే ఎంత ఆదాయం సమకూరింది అనే దానిపై స్పష్టమైన లెక్కలతో ముందుకు సాగాల్సిందిగా సూచించారు. 2031కి ఉడా జనాభా కోటీ 11 లక్షలు తెనాలి, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన అభివృద్ధి అంశాలు, 2011 జనాభా వివరాలు, 2031 నాటికి జనాభా అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా జిల్లాల అధికారులు వివరించారు. వీజీటీఎం ఉడా పరిధిలో 2031 నాటికి జనాభా కోటీ 11 లక్షలకు పెరిగే అవకాశం ఉందని ఉడా వైస్ చాన్సలర్ పి.ఉషాకుమారి తెలిపారు. పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మెట్రో రైలు ప్రతిపాదనలకు సంబంధించి రూపొందించిన నివేదికను అందించారు. గ్రేటర్ విశాఖపట్నం కమిషనర్ ఎంవీ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ జానకి విశాఖపట్నంలోని మౌలిక సదుపాయాలు, రోడ్ల వసతి, మెట్రో రైలు సాధ్యాసాధ్యాలు ఇతర రవాణా సౌకర్యాలపై వివరాలు అందించారు. భారత ప్రభుత్వ రవాణా ప్రత్యేక అధికారి ఎన్కే సిన్హా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ టి.తిమ్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్ జి.కొండలరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, వివిధ జిల్లాల, రాష్ట్రస్థాయి అధికారులు వై.మధుసూదనరెడ్డి, వి.పాండురంగారావు, ఎంవీఎస్ రెడ్డి, డి.వరప్రసాద్ పాల్గొన్నారు. ఉడా అభివృద్ధికి సహకరించండి డాక్టర్ సుధీర్కృష్ణను ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు. ఉడా పరిధిలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉడా అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన్ని కోరారు. -
గళమెత్తాలె..!
నిధుల్లేక సగంలో నిలిచిపోయిన సాగు నీటి ప్రాజెక్టులు... పని చేయని మంచినీటి పథకాలు... దిష్టిబొమ్మల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... రాళ్లు తేలి నడవడానికి వీలులేని రహదారులు... ఇలా మరెన్నో సమస్యలు పాలమూరు జిల్లావాసులను పట్టిపీడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభ కొలువుదీరుతున్న వేళ జిల్లానుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి, మౌలిక సౌకర్యాల కల్పన వంటి బాధ్యతలు నూతన శాసనసభ్యులకు రాబోయే కాలంలో పరీక్షగా నిలవనున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల వెనుకబాటు తనానికి కొత్త రాష్ట్రంలోనైనా పరిష్కారం దొరుకుతుందనే ఆశ ప్రస్తుతం కనిపిస్తోంది. కరువు, వలసలు, నిరక్షరాస్యత రూపుమాపే దిశలో శాసనసభ్యులు కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మన నేతలు తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తి, పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిలసాగర్ ఎత్తిపోతల పథకాల పనులు 90 శా తం మేర పూర్తయ్యాయి. మరో రూ. 628 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే నే పనులు పూర్తవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ఇంకా సర్వే దశలోనే ఉంది. జాతీయ హోదా లభించి నిధుల విడుదల జరిగితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. హైదరాబాద్-బెంగళూరు 45వ నంబరు జాతీయ రహదారి వెన్నెముఖగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వల సల జిల్లాగా పేరొందిన పాలమూరులో పరిశ్రమల ఏర్పాటుతోనే స్థానికంగా ఉపాధి కల్పిస్తేనే శాశ్వత పరిష్కారం లభించనుంది. పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా మౌలిక వసతుల లేమీ, బోధనా సిబ్బంది కొరత బోధనపై ప్రభావం చూపుతోంది. జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశోధన , విద్యా సంస్థలు జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వర్షాధారంపై ఆధారపడి సాగు చేసిన రైతాంగం సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. పత్తి విత్తన ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లాదే అగ్రస్థానం. పత్తి, వేరుశనగ వంటి పంటలపై పరిశోధనకు పెద్ద పీట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యుత్ ఉత్పత్తి పరంగా గద్వాలలో 600 మె గావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ఉ త్ప త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్ర కటించింది. తెలంగాణ రాష్ట్రంలో సౌ ర విద్యుత్‌కు అనువైన వాతావరణం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అధికంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పా టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అక్కడ కూడా పోటీనే
పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. ఒక రంగంలో పోటిపడేవారు మరో రంగంలో పోటీ పడ కూడదనేమీ లేదు. అలా సినిమా రంగంలో నువ్వా? నేనా? అనేంతగా పోటీపడుతున్న కాజల్ అగర్వాల్, సమంత ఆస్తులు కొనుగోలు చేయడంలోను పోటీ పడుతున్నారట. ఇప్పటికే కోట్ల పారితోషికం పొందుతున్న ఈ భామలు ఆ సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవిస్తుండడంతో టాలీవుడ్ తారల్లో కలకలం రేగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో చెన్నై చిన్నది సమంత, ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్‌లు సీమాంధ్రలో ఆస్తులు పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారన్నది తాజా సమాచారం. ఆంధ్రాలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ముద్దు గుమ్మలు ఇద్దరు పోటీ పడుతున్నారట. ఇళ్లయినా, ఎకరాల లెక్కన స్థలాలయినా సరే కొనేస్తున్నారట. ఇందుకు స్థల బ్రోకర్లను రప్పించుకుని మరి ప్రాంతాల వివరాలను రాబట్టుకుంటున్నారట. అదే విధంగా శర్వానంద్, తరుణ్, అల్లరి నరేష్ వంటి యువ నటులతో ఇప్పటికే హైదరాబాద్‌లో రెస్టారెంట్, బార్లు వంటి వ్యాపారాల్లోకి దిగారని సమాచారం. ఇప్పుడు వాళ్లు కూడా సీమాంధ్రలో స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. -
‘తాటికొండ’పై గంపెడాశలు
కొత్త రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ తాటికొండ రాజయ్య ఓరుగల్లు బిడ్డకావడం జిల్లా ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించిన రాజన్నకు పేద ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలు, వారికి అందుతున్న వైద్య సేవలపై ఒక అంచనా ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వైద్యం, విద్యపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరంగల్ కేంద్రబిందువుగా ఉంది. నిరుపేదలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే వచ్చేది ఇక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి(ఎంజీఎం)కే. అవసరానికి తగినట్టుగా ఈ ప్రాంతానికి హెల్త్ యూనివ ర్సిటీ తీసుకురావాలని, ఎయిమ్స్ తరహాలో ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి చేయాలని, వరంగల్‌ను మెడికల్ హబ్‌గా మార్చాల్సిన అవరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఓరుగల్లు ప్రజాప్రతినిధికే వైద్య శాఖను కేటాయించడంతో మన ‘ఆరోగ్యానికి ఇక డోకా లేదనే’ నమ్మికను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పాలనా వ్యవహారాలు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పరిధిలో కొనసాగేది. ఆ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆవకతవకలు జరగడంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పీజీ ఎంట్రెన్స్ పరీక్ష పత్రాలు లీకేజీ వల్ల తీరని నష్టం జరిగింది. అయితే ఇలాంటి కుంభకోణాలను బయటి పొక్కకుండా జాగ్రత్త పడుతూ ఈ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసేవారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున హెల్త్ యూనివర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మెడికల్ హబ్‌గా మార్చాలి.. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని ఓరుగల్లులో ఏర్పాటు చేసి మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. 120 ఎకరాల అనువైన స్థలం కలిగిన కాకతీయ మెడికల్ కళాశాలలో హెల్త్ యూనివర్సీటీని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఇదే అనువైన ప్రదేశమని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్ ధరక్ ఇంతకు ముందే ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్‌కు ఆర్టీసీతోపాటు రైలు మార్గం అందుబాటులో ఉండడం ఇందుకు కలిసొచ్చే విషయమని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో హెల్త్యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల మెడికల్ సీట్లు పెరగడంతోపాటు వైద్యసేవలు మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంజీఎంకు మహర్దశ వచ్చేనా తెలంగాణ ప్రాంతంలో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన మహాత్మాగాంధీ మోమోరియల్ ఆస్పత్రికి మహర్దశ రానుందని ఈ ప్రాంత ప్రజలతోపాటు వైద్యులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 సంవత్సరంలో ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత క్రమంలో వచ్చిన పాలకులు పట్టింకుకోకపోవడంతో సూపర్‌స్పెషాలిటీ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. దీంతో రోగులు హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు. చికిత్స కోసం వెళుతూ మార్గ మధ్యలో మృతి చెందినవారు అనేకమంది ఉన్నారు. -
జిల్లా దశ మారుద్దా..!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కొత్త రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించాలని ప్రజలు కోరుకుంటు న్న తరుణంలో ఇప్పటికే యంత్రాం గం శాఖలన్నింటినీ విభజించింది. జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరమైన లెక్కలు కొత్తగా ప్రారంభించడానికి ఎవరి ఖాతాలు వారికి అప్పగిస్తున్న రోజున కొత్త ఖాతాల్లో పన్నులు, చార్జీలు, ఇతర సేవా పన్నులు సేకరించి ఖజానాను నింపేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మూడు రోజులపాటు సర్వర్లను నిలిపివేశారు. సోమవారం నుంచి కొత్త సర్వర్లు ప్రారంభం కానున్నాయి. ఇకనైనా కొత్తరాష్ట్రంలో జిల్లాలోని ఎన్నో అంశాలు అభివృద్ధి దిశగా పయనించాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఆన్లైన్ మార్పు కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందే జిల్లాలోని రవాణా, ఖజానా, రిజిస్ట్రేషన్, కలెక్టరేట్లోని కొన్ని విభాగాల ఆన్లైన్ విధానాలను మార్చారు. కొత్త రాష్ట్రానికి సాధారణ పరిపాలన సరికొత్తగా జరిగేలా రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసుకుంది. జిల్లావిస్తీర్ణం 6538 చదరపు కిలోమీటర్లు కాగా జిల్లా ప్రజలు 23,42,628 మంది. జిల్లాలోని 34 మండలాలు,4 మున్సిపాలిటీల్లో ఎన్నో రంగాలు అభివృద్ధి చెందినట్లు కనిపిస్తున్నా అదంతా మేడి పండు చందంగానే ఉంది. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో జిల్లా సాధించాల్సిన అభివృద్ధి ఎప్పుడూ రాజకీయ కారణాలతో వెనుకపడుతూనే ఉంది. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే జిల్లాలో సాగునీటి రంగం అభివృద్ధి చెందింది. సుమారు రెండు దశాబ్దాలుగా పడకేసిన తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, జంఝావతి రబ్బర్ డ్యాం వంటి ప్రాజెక్టులు ముందుకు కదిలా యి. కానీ మహానేత ఆకస్మిక మరణంతో అదనపు ఆయకట్టు ప్రతిపాదనలకు కూడా నిధులు లేకపోవడం తో రైతాంగం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. అదేవిధం గా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి మహానేత వైఎస్ హయాంలో రూ. కోట్లాది నిధులు విడుదలయినప్పటికీ ఇప్పటివరకూ వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం వెనుకడుగు వేయడం విచార క రం. తారకరామ తీర్థసాగర్, వెంగళరా య సాగర్, తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ వంటి ప్రాజె క్టులకు నిధులు మంజూరైనా ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. వీటిని ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో అయినా పూర్తి చేస్తారా అన్న ఆశలు జిల్లా రైతుల్లో ఉన్నాయి. అదేవిధం గా పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, ఎస్.కోట వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల స్థాయి పెంపు వంటి ప్రతి పాదనలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటితో పా టు విద్యా రంగంలో కూడా జిల్లాలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. రైతులకు ఆర్థిక పరిపుష్టి అలాగే జిల్లాలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరికి ఏటా రుణాలు ఉంటే గానీ వ్యవసా యం చేసుకోలేని పరిస్థితి ఉంది. వీరికి స్వయంప్రతిపత్తి తో సాగు చేసుకునే విధంగా వారిని ఆర్థికంగా బలోపే తం చేయాల్సి ఉంది. సాగునీటి వనరులను పెంపొందించడంతో పాటు ఉన్న ప్రాజెక్టులను ఆధునికీకరించే దిశగా పాలకులు,అధికారులు కసరత్తు చేయాలి. ఇప్పటికే జిల్లాలో తాగునీటి సమస్యలు అధికమయ్యా యి. ఈ నేపథ్యంలో కొత్తగా తాగునీటి పథకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు వింటున్న ప్రజలు అప్పుడే ఆందోళనకు గురవుతున్నారు. వారు అనుభవంతో చెబుతున్నవో? ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడానికి చేస్తున్నవో? కానీ కొత్తరాష్ట్రంలో నిధుల సమస్య ఉందని, ఉద్యోగుల వేతనాలకే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతూ కొత్త రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా ఆందోళన కలిగించే సంకేతాలు పంపిస్తున్నారు. మనం అభివృద్ధి చెందగలమనే భావనను నాయకులు, అధికార యంత్రాంగం జిల్లా ప్రజల కు కలిగించాలి. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాల్సి న బాధ్యత నాయకులు,అధికారులపై ఎంతో ఉంది. పాలకులు తమవంతు అసమర్థతను కప్పి పుచ్చుకునేం దుకు దారులు వెతుక్కునే మార్గంలో ప్రజలకు ఆందోళన కలిగించే వ్యాఖ్యానాలు మా నుకోవడం ఉత్తమమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. -
అంతా కొత్త.. కోత!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో దాని ప్రభావం ఎంతో కొంత శ్రీకాకుళం జిల్లాపైనా పడనుంది. ఆర్థిక లోటుతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లపాటు ప్రభుత్వంతోపాటు ప్రజలు కష్టాలు ఎదుర్కోక తప్పదు. తలసరి ఆదాయం తగ్గడంతో పాటు వ్యయం పెరగడం వలన పన్నులు, ధరలు పెరిగిపోయే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్, రవాణా, ఉద్యోగ, వ్యాపార రంగాలతోపాటు పెన్షనర్లపై విభజన ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలసలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్నప్పటికీ.. అది పరాయి రాష్ట్రంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కొత్త రాష్ట్రంలో ఏఏ రంగాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి పరిశీలిస్తే.. ఉద్యోగులకు జీతాలు కష్టం భారీ ఆర్థికలోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు ఒకటి రెండు నెలలుజీతాలు అందే పరిస్థితి ఉండదు. అలాగే నాన్‌లోకల్ కేటగిరీలో తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న వారిని తిరిగి జిల్లాకు పంపిస్తే కొన్నేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు నిలిచిపోయి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. నాన్‌లోకల్ కేటగిరీలో పనిచేసే వారు ఇంతవరకు పరస్పర బదిలీల కింద సొంత జిల్లాలకు వచ్చేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవు. శాశ్వతంగా ఆ రాష్ట్రంలోనే పదవీ విరమణ వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సొంత రాష్ట్రానికి పంపిస్తే గత సీనియార్టీ పోయి పదోన్నతులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. త్రిశంకు స్వర్గంలో కాంట్రాక్టు ఉద్యోగులు పలు శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులకు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా కానుంది. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై వీరి భవితవ్యం ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు సీనియార్టీ బట్టి రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశం నేతలు హామీ ఇచ్చినా అది అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. కనీసం రెగ్యులర్ కాకపోయినా తమను కాంట్రాక్టు పద్ధతిలోనైనా కొనసాగించాలని వేడుకునే పరిస్థితి నెలకొంది. వ్యాపారాలకు పర్మిట్ల భారం వ్యాపారాలపై పన్నులు, పర్మిట్ల భారం పడుతుంది. ఇది వరలో హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ లోని 10 జిల్లాల నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకున్నా.. అలాగే ఇక్కడి నుంచి ఎగుమతి చేసినా పర్మిట్ల తలనొప్పి, పన్ను భారం ఉండేది కాదు. ఇప్పుడు అది వేరే రాష్ట్రం కావడం వల్ల ఎగుమతి, దిగుమతులకు ప్రత్యేక పర్మిట్లు పొందడంతో పాటు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వ్యాపారులకు ఇబ్బంది కాకపోయినా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వ్యాపారాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎక్కువ ధరలను వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రవాణా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవాణా, ఇతర వాహనాలు తెలంగాణ కు వెళ్లాలంటే ప్రత్యేక పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అద్దె పెంచాల్సి వస్తుంది. వాహనాల నెంబర్లు కూడా మారుతాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు ఎపీ-30తో రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇదే నెంబరు కొనసాగినా కొద్ది రోజుల తరువాత రిజిస్ట్రేషన్ నెంబరు మారుతుంది. వాహనాల పన్ను, రిజిస్ట్రేషన్ల రుసుం పెరిగే అవకాశాలుంటాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెరగన్ను విద్యుత్ కోతలు 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపులు తగ్గడంతో ఆ ప్రభావం జిల్లాపైన కూడా పడుతుంది. కోతల మరింత పెరుగుతాయి. కొత్త రాజధాని ఆవిర్భావంతో పాటు ఇతర జిల్లాల్లో పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పిన తరువాత శ్రీకాకుళం జిల్లాకు కేటాయింపులు మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. అప్పుడు జిల్లాప్రజలతో పాటు రైతాంగానికి తీవ్ర కష్టాలు ఎదురుకానుంది. రైతులకు కష్టకాలం జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారే. రాష్ట్ర విభజన ప్రభావం వీరిపై ఎక్కువగా పడనుంది. విద్యుత్ కోతల వల్ల సాగునీరు సకాలంలో అందే పరిస్థితి ఉండదు. ఎరువులు, విత్తనాల కేటాయింపులు, రాయితీల్లో కూడా మార్పులు జరగనున్నాయి. నిధుల కొరతతో వంశధార, తోటపల్లి, మడ్డువలస, ఆప్షోర్ వంటి ప్రాజెక్టుల పనులు మరింతగా మందగించనున్నాయి. ఇప్పటికే ఉన్న రుణాలు తీర్చలేక పోవడంతో రైతులకు కొత్త రుణాలు వచ్చే పరిస్థితి ఉండదు. సంక్షేమానికి చేటు భారీ ఆర్థిక లోట ప్రభావం సంక్షేమ పథకాలపై పడుతుంది. పథకాల అమలు కుంటుపడే ప్రమాదముంది. రేషన్‌కార్డులు మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో రేషన్ కోటాలో కోతలు పడే వీలుంటుంది. ఇప్పటికే మూడు నెలలకు పైగా పింఛన్లు లేక ఆకలితో అలమటిస్తున్న వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్‌దారులు మరింత కష్టాల బారిన పడే పరిస్థితి ఉంటుంది. -
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్.. బాబు సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును నియమించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిసిన చంద్రబాబు, దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు, అలిపిరిలో తనపై జరిగిన దాడి కేసులో తప్పించుకుని తిరుగుతున్న గంగిరెడ్డి వ్యవహారం తదితర అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలని, అంతేతప్ప రెచ్చగొట్టే విధానం సరికాదని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని, అన్నదమ్ముల మధ్య విభేదాలు తేవడం సరికాదని నచ్చజెప్పారు. తాను జూన్ రెండో తేదీ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. -
సేవలు నిల్
విభజన బిజీలో ప్రభుత్వ శాఖల అధికారులు నివేదికల తయారీలో నిమగ్నం వచ్చే నెల 2 వరకు ఇదే పరిస్థితి పనులు జరగక జనం అవస్థలు జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో సామాన్యులకు సేవలందడం కష్టమైపోతోంది. ఏ శాఖకు వెళ్లినా వచ్చే నెల 2 తర్వాతే పనులు జరుగుతాయంటూ జనాన్ని తిప్పి పంపేస్తున్నారు. విభజన కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలను వేరు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ శాఖల అప్పులు, బకాయిల నివేదికల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని శాఖల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్లుల గోలే కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా రాష్ట్రస్థాయి అధికారులే. వీరిలో తెలంగాణ ప్రాంత అధికారులు ఇక్కడ ఉన్నారు. విభజన నేపథ్యంలో ఇప్పుడు ఏయే శాఖల అధికారులు ఏ ప్రాంతానికి చెంది న వారు?, వారి సర్వీసు వివరాలను ప్రభుత్వం సేకరించింది. దీని ఆధారంగా ఉద్యోగుల పంపకాలు చేపట్టడంతో ఇప్పుడు జిల్లాలోని మార్కెటింగ్, గనులశాఖ, వైద్య, విద్య, ఉన్నత విద్య, తూనికలు కొలతలు, రహదారులు భవనాలశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామీణ నీటిసరఫరా, ఆడిటింగ్, వాణిజ్య పన్నులు, పౌరసరఫరాల శాఖ.. ఇలా అన్ని విభాగాల్లోనూ అధికారులు ఉద్యోగుల పంపకాలపైనే చర్చించుకుంటున్నా రు. జోనల్, రాష్ట్రస్థాయి అధికారులు తాము ఎక్కడికెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి వచ్చే నెల 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుండడంతో ఈలోగా అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల పంపకాలు, పాత బకాయిలు తదితర అంశాలన్నీ తేలిపోవాల్సి ఉంది. అన్ని విభాగాల్లో అధికారులు తమకు రావలసిన నిధులకు సంబంధించి పైస్థాయి అధికారులతో సంప్రదింపుల్లో తల మునకలై ఉన్నారు. దీంతో ఏ శాఖలోనూ పనులు ముందుకు కదలడంలేదు. వ్యవసాయ శాఖలో ఇప్పటికీ ఖరీఫ్ ప్రణాళికను సైతం తయారు చేయలేదు. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినా ఏ పనులు ముందుకు కదలక ప్రజలు ఉసూరుమంటున్నారు. -
కొత్త స్టేట్.. కొత్త కోడ్
సాక్షి, కాకినాడ :వాహనాలపై కోడ్‌ను బట్టి అది ఏ రాష్ర్టంలో ఏ జిల్లాకు చెందిందో ఇట్టే చెప్పవచ్చు. ఇప్పటి వరకూ 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను ‘ఏపీ’గా పరిగణించి, జిల్లాలను ఆంగ్లాక్షరక్రమాన్ని అనుసరించి అంకెల్లో పేర్కొంటు న్నారు. ఉమ్మడి రాష్ర్టంలో అక్షరక్రమంలో అనంతపురం, ఆదిలాబాద్, చిత్తూరు, కడపల తర్వాత తూర్పు గోదావరి నిలిచేది. అందుకు అనుగుణంగా మన జిల్లా కోడ్ ఏపీ 05గా ఉంది. వాహనం నంబర్లో ఏపీ-05 అనేది చూడగానే అది తూర్పు గోదావరి జిల్లాకు చెందిందని ఠక్కున చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు కానున్న నేపథ్యంలో మన జిల్లా కోడ్ ఏపీ-05 నుంచి ఏపీ-04గా మారనుంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడ నుండడంతో మిగిలిన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను నిర్ణయించనున్నారు. దీని ప్రకారం అక్షరక్రమంలో అనంతపురం, చిత్తూరు, కడపల తర్వాత వచ్చే తూర్పుగోదావరి కోడ్ ఏపీ-04గా మారనుంది. జూన్ 2 నుంచి జిల్లాలో రిజిస్టరయ్యే వాహనాలకు కోడ్‌నే వినియోగిస్తారు. ఆ మూడురోజులూ వాహనాల అమ్మకాలూ బంద్ వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి జమయ్యేది. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ కార్యాలయాన్ని కొత్త రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్‌లోనే తాత్కాలికంగా ఏర్పా టు చేస్తున్నారు. జూన్ 2 నుంచి ఈ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏ రాష్ర్ట పరిధిలోని జిల్లాల ఆదాయం ఆ రాష్ట్రానికి జమయ్యేందుకు వీలుగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండువరకు వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల జారీని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మూడు రోజులూ వాహనాల అమ్మకాలను నిలిపి వేయాలని డీలర్లను కూడా ఆదేశించింది. తిరిగి జూన్ 3 నుంచి కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. -
వేగం పుంజుకున్నవిభజన లెక్కలు
జిల్లా ట్రెజరీ శాఖ ముమ్మర కసరత్తు ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నం ఈ నెల 24తో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు మంగళం అవిభాజ్య రాష్ట్రంలో ఇదే చివరి వేతనం అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు నిధుల వినియోగానికీ చివరి చాన్స్ వచ్చే నెల నుంచి తెలంగాణ బడ్జెట్లో కేటాయింపు హన్మకొండ, న్యూస్‌లైన్: అవిభాజ్య ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కల పుస్తకాలకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని... మే 24 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేర్వే రని... ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారులు పింఛన్లపై నివేదికలివ్వాలని గవర్నర్ నరసింహన్ ఇటీవల జిల్లా గణాంక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విభజన లెక్కల ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో వచ్చిన నిధులు, ఖర్చు, మిగులు నిధులపై నివేదికలు తయారు చేస్తున్నారు. వీటిని ఈనెల 21వ తేదీ లోపు గవర్నర్‌కు సమర్పించనున్నారు. జిల్లాలో మొత్తం 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22వేల మంది పింఛన్‌దారులున్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాల కింద రూ. 52 కోట్లు.. పెన్షన్‌దారులకు రూ. 35 కోట్లు చెల్లిస్తున్నట్లు జిల్లా గణాంక శాఖ అధికారులు నివేదికల్లో పొందుపరిచారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులతోపాటు వాటి ఖర్చు వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. 24న చివరి సంతకం ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ చెల్లింపులకు ఈ నెల 24వ తేదీతో తెరపడనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న వేతనాల రిజస్టర్లు, పే స్లిప్పులన్నీ మారి... నిర్ధేశిత తేదీ తర్వాత అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం పేరుతో పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. అపాయింట్మెంట్ డే జూన్ 2న నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు తీసుకోనుండడంతో ఈనెల 24న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరి వేతనంగా చరిత్రకెక్కనుంది. ఈ రోజున ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టే సంతకం ఉమ్మడి రాష్ట్రంలో చివరిది కానుంది. ఉద్యోగుల జాబితా తయారు లెక్కలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమవుతోంది. డివిజన్ల వారీగా స్థానిక, స్థానికేతర ఉద్యోగుల జాబితా తయారీలో అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ విధుల్లో చేరారనే ధ్రువీకరణ పత్రాలు, సర్వీసు పుస్తకాలన్నీ సమర్పించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖల్లో సుమారు 110 మంది అంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులున్నట్లు ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఖర్చు కాకపోతే అంతేనా ? వచ్చే నెల నుంచి ఇక్కడి ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్రంలో సర్దుబాటు చేయడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఉమ్మడి బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈనెల 24 వరకు వినియోగించుకోవచ్చని, ఇప్పటివరకు వెచ్చించకుండా ఉన్న నిధులను మాత్రం ఆయా శాఖల ఖాతాల్లో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగం కాని నిధులు వెనక్కి పోయే అవకాశముంది. ఈ లెక్కన జిల్లాలో చాలా మేరకు నిధులు ఖాతాల్లో ఉన్నాయి. కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీలకు ఇటీవలే దాదాపు రూ. 12 కోట్ల అభివృద్ధి నిధులిచ్చారు. అంతేకాకుండా... గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 15 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో దాదాపు 30 శాతం కూడా ఖర్చు కాలేదు. వీటిని వెనక్కి తీసుకుని... మళ్లీ ఇస్తారా... అనేది సందిగ్ధంలో పడింది. అయితే వెనక్కి తీసుకునే నిధులను మళ్లీ ఆయా శాఖలకు కొత్త రాష్ట్రంలో మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
కొత్త రాష్ర్టంలో సరికొత్త రికార్డు
నర్సంపేట, న్యూస్‌లైన్ : మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు చేసి నర్సంపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 87.59 శాతం ఓటింగ్‌తో తెలగాణ కొత్త రాష్ట్రం లో సరికొత్త రికార్డును సొంతం చేసుకుని నంబ ర్-1 స్థానంలో ఉంది. సమష్టి కృషి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు, 95 రెవెన్యూ గ్రామాలు, 106 గ్రామ పంచాయతీలు, 2,85,360 మంది జనాభా, 2,05,516 మంది ఓటర్లున్నారు. ప్రజలు ఓటు విలువ తెలుసుకోవడంలో అధికారుల కృషితోపాటు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల పట్టుదల కూడా తోడైంది. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోం ది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. అందులోనూ రోడ్డు, ర వాణా సౌకర్యం అంతంత మాత్రమే. అయినా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కాలినడకన పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ప్రశాంత వాతావరణం నర్సంపేటకు కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. ఇక్కడ హత్యా రాజకీయాలూ ఉండే వి. ప్రతీ ఎన్నికల్లో కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చేవారు. ఓడించేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు జరిగేవి. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో హత్యలకు దారితీసేది. ఒకానొక దశలో ఓటు వేయడానికి ప్రజలు భయపడే వారు. ఓంకార్ ఎంసీపీఐ స్థాపించిన తర్వాత గెలుపు కోసం ఆయన ప్రతి ఒక్కరితో ఓటు వేయించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కృషికి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేక చొరవ తీసుకుంది. అధికారుల సహకారంతో క్రమేణా ప్రజల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడమే కాకుండా రికా ర్డు సాధించి ఆదర్శంగా నిలవడానికి పునాదు లు పడ్డాయి. ఉద్దండుల పోటీ ఓ కారణం నియోజకవర్గం జనరల్ కేటగిరికి రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో ఇక్కడి నాయకుల పాత్ర కీలకంగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసే వారే ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పోలింగ్ బూత్‌ల వరకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించ డం ఓటింగ్ అత్యధికంగా నమోదు కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 జిల్లాల్లో నర్సంపేటలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం గర్వంగా ఉందని ఆయా నాయకులు ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు -
నవ తెలంగాణ..
బతుకు బతుకమ్మ కావాలె: తెలంగాణ... ఓ చారిత్రక నేపథ్యం. ఆత్మ గౌరవ నినాదమే ఆయుధం. స్వయం పాలనకు ధిక్కార స్వరం. ఆవేశం, అమాయకత్వం ఇక్కడి ప్రత్యేకం. స్వేచ్ఛ కోసం ముక్కోటి గొంతుకలతో భూమి బద్దలయేటట్టు నినదించిన నేల. బిగిసిన పిడికిళ్లతో మరో స్వతంత్ర సంగ్రామాన్ని తలపించిన పోరాటం. ఉవ్వెత్తున ఉప్పెనలా యువతరం ఉరుములై గర్జించిన పోరు గడ్డ. ఎన్నెన్నో పోరాటాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఆక్రోశం, ఆగ్రహం, ఆశయ స్ఫూర్తికి వేదికగా నిలిచింది. కాళ్లగజ్జెల కవాతై తిరుగాడింది. పిడికిలెత్తి నిలబడ్డది. బలిదానాలు.. ఆత్మార్పణలు.. తీరని శోకాలతో కదలాడింది. ..నేడు అరవై ఏళ్ల కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. గంపెడాశతో ఉజ్వల భవిష్యత్‌ను కోరుకుంటోంది. రాళ్లగుట్టలు... కంప పొరకలు.... మట్టి దుబ్బలు... ఎండిన బీళ్లు... పల్లె కన్నీళ్లను ఇక దూరం చేద్దామంటోంది. తెర్లయిన బతుకులకు రాంరాం పలుకుతూ ధూంధాం చేద్దాం రమ్మంటోంది. నడుం బిగించి జజ్జనకరి జనారె అంటూ చీకటికి చరమగీతం పాడుదామంటోంది. వీర తెలంగాణ ...పోరు తెలంగాణ.. వేరు తెలంగాణ ఇక అవ్వల్ దర్జా తెలంగాణగా మారాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నవ నిర్మాణంపై వివిధ రంగాలకు చెందిన మేథావులు, నిపుణుల అభిప్రాయాలు నేటినుంచి... నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి అమరుల త్యాగాలు... సబ్బండ వర్ణాల పోరాటాలతో అరవై ఏళ్ల తండ్లాట తీరింది. నెత్తుటి జ్ఞాపకాలు, నిత్య నినాదాలతో చరిత్రలో నిలిచిన తెలంగాణ గడ్డ నేడు నవ తెలంగాణ కోరుకుంటున్నది. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనాలంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందుకోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటన్నింటి మీద మీ ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకోండి. మీ అభిప్రాయాలను క్లుప్తంగా మాకు రాసి పంపండి. ఫొటోను జతపర్చండి. - ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ -
పిచ్చామె రాయి విసిరిన చోటే రాజధాని: జేసీ
సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, ఆమె తన చేతిలోని రాయి ఎక్కడ విసిరితే అక్కడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుందని మాజీ మంత్రి, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేరు ఎత్తకుండా, గతంలో కంటే మరింత ఘాటుగా ఆయన విమర్శలు గుప్పించారు. పిచ్చామె విసిరిన రాయి నిజామాబాద్‌లో పడినా ఆ ప్రాంతాన్ని సీమాంధ్ర రాజధానిగా అంగీకరించాల్సి వస్తుందని జేసీ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆరే అవుతారని ఆయన ఖాయంగా చెప్పారు. అటు తెలంగాణ ప్రాంతంలోను, ఇటు సీమాంధ్ర ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ నేతలతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. -
మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి:మాయావతి
న్యూఢిల్లీ: ఎస్సార్సీ వేసి మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్నారు. చిన్న రాష్ట్రాల డిమాండ్ చాలా కాలంగా ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరు చేయాలని కోరారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ అనుకూలం అని చె్ప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరికాదన్నారు. అలా అయితే ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని చెప్పారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అంటే చాలా ఎక్కువ కాలం అన్నారు. గతంలో మూడు రాష్ట్రాలకు కొత్త రాజధానులను ఏర్పాటు చేశారని చెప్పారు. సీమాంధ్రకు, అలాగే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయాలన్నారు.రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. మాయావతి ప్రసంగానికి తృణమూల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కొత్త రాష్ట్రాల డిమాండ్లపై ఆలోచించాలి
వీటిపై రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా యోచించి పరిష్కరించాలి ఐబీ వార్షిక సదస్సులో రాష్ట్రపతి వ్యాఖ్య 1947లో దేశ విభజనే అనివార్యమైంది నాడు 45 కోట్ల మందినే కలిపి ఉంచలేకపోయాం నేడు 125 కోట్ల మందిని ఏ తీరున కలిపి ఉంచాలి? సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటును, కొత్త రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్లను రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ముసాయిదా బిల్లును తయారుచేసి అభిప్రాయం కోసం రాష్ట్ర అసెంబ్లీకి పంపిన తరుణంలో ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) వార్షిక సదస్సులో ఆయన ప్రధానోపన్యాసం చేస్తూ అనేక అంశాలను స్పృశించారు. ప్రసంగంలో దేశ విభజనను సైతం ప్రస్తావించారు. సదస్సులో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, హోంశాఖ సహాయమంత్రులు, కార్యదర్శి, ఐబీడెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘1947లో దేశ జనాభా 45 కోట్లు. ఆ 45 కోట్ల మందిని కలిపి ఉంచలేకపోయారు. విభజన అవసరం వచ్చింది. కొత్త సార్వభౌమ దేశ ఏర్పాటు ఆవశ్యకత ఏర్పడింది. ఆ సార్వభౌమ దేశం అలాగే ఉండగలిగిందా లేదా అనేది వేరే విషయం. కానీ, 45 కోట్ల మందిని కలిపి ఉంచడం కురదలేదన్నది మాత్రం కఠోర వాస్తవం. ఇప్పుడు 125 కోట్లకుపైగా ఉన్న జనాభాను మనం ఏ తీరున, ఏ రూపంలో కలిపి ఉంచాలి?’’ అని ప్రణబ్ ప్రశ్నించారు. అనంతరం ఆయన కొత్త రాష్ట్రాల కోసం తలెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావిస్తూ, ‘‘కొత్త రాష్ట్రాల ఏర్పాటు, దానికోసం వస్తున్న డిమాండ్లు... వీటితో రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా వ్యవహరించాల్సి ఉంటుంది’’ అని కీలక వ్యాఖ్య చేశారు. దేశంలో ఇప్పటికే ఉన్న కొత్త రాష్ట్రాల డిమాండ్లు, భవిష్యత్తులో తలెత్తే డిమాండ్లను ఏ విధంగా చూడాలి, వాటితో ఎలా వ్యవహరించాలనేదానిపై ఆయన తన మనోగతాన్ని ఈ వ్యాఖ్య రూపంలో వెల్లడించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మన ముందుకు మేధోపరంగా తీవ్ర సవాళ్లు వస్తున్నాయని, 125 ఏళ్ల చరిత్ర గల నిఘా సంస్థ వీటి విషయంలో ఎంతో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదానికి బయటి మద్దతు: సైన్స్, ఐటీ రంగాల్లో ఎంతో పురోగతి రావడంతో ఉగ్రవాదం విసిరే సవాళ్లు కూడా చాలా పెద్ద రూపాన్ని సంతరించుకున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం రూపంలో దేశాన్ని వేధిస్తున్న ముప్పును వేలెత్తిచూపుతున్న దేశం భారత్ ఒక్కటేనంటూ ఆయన పరోక్షంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తప్పుపట్టారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానంలో త్వరితగతిన వస్తున్న మార్పు కొత్త ముప్పులను కూడా కొనితెస్తోంది. సోషల్ మీడియా దుర్వినియోగమనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల చేతిలో ఆయుధంగా ఉంది. జాతివిద్రోహులు ఈ ఆయుధాన్ని మరింత అధునాతన పద్ధతుల్లో వాడుతున్నారు. అత్యాధునిక వ్యూహాలు, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ ముప్పును తిప్పికొట్టాలి. కొత్త సవాళ్లు ఉత్పన్నమైనపుడు మనం కూడా మన నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం’’ అని ఆయన ఉద్బోధించారు. హజారే ఉద్యమంతో ప్రజాస్వామ్యంలో కొత్త కోణాలు అవినీతిరహిత సమాజం కోసం అన్నా హజారే చేసిన ఉద్యమాల వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త కోణాలను ఆవిష్కరించాయని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. అటువంటి ఉద్యమాలను ఎవరూ పక్కనపెట్టలేరన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమనే సంప్రదాయ ఆలోచనా విధానంలో ప్రస్తుతం మార్పు వచ్చిందన్నారు. ఫలానా చట్టం కావాలని...దాన్ని ఫలానా రకంగానే ఆమోదించాలని సామాజికవేత్తలు, ఎన్జీవోలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలరని పదేళ్ల కిందటి వరకూ ఎవరూ ఊహించి ఉండరని పరోక్షంగా లోక్‌పాల్ బిల్లుపై డిమాండ్లను ఉదహరించారు. ‘‘సాధికారత అనేది అనేక అవకాశాలతోపాటు సవాళ్లనూ ముందుకు తెస్తుంది. ప్రజలకు సాధికారతనివ్వడం ద్వారా మన అభివృద్ధి వ్యూహంలో పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అంగీకరిస్తున్నాను. అయితే ఉద్దేశాలను వ్యక్తీకరించడం ద్వారా కాకుండా చట్టాలు చేయడం ద్వారానే సాధికారతను అందించగలం’’ అని అన్నారు. ‘‘సమాచార హక్కు చట్టం చేతిలో ఆయుధంగా ఉన్నవారు ప్రభుత్వ వ్యవహారాలను బహిర్గతపరుస్తారు. ఫలానా సెక్షన్‌ని సవరించడం ద్వారా మనం సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. కానీ, ఈ చట్టాన్ని ప్రజలు సమర్థంగా ఉపయోగిస్తున్నారు, కొన్నిసార్లు దుర్వినియోగపరుస్తున్నారు కూడా. వాటిని ఎదుర్కోవాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత, విద్యాహక్కు, ఉపాధి హక్కు... ఇవన్నీ మనం కల్పించాల్సినవని, వాటిని అందించడంతో వ్యవస్థ విసిరే సవాళ్లకు మనకు మనం జవాబు చెప్పాల్సిందేనన్నారు. -
రాష్ట్రాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక డిమాండ్లు : ప్రణబ్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన గురువారమిక్కడ సూచించారు. ప్రజలందరినీ ఒకేచోట కలిపి ఉంచడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక డిమాండ్లు వస్తున్నాయని ప్రణబ్ వెల్లడించారు. -
నూతన రాష్ట్రాల ఏర్పాటు.. రాజ్యాంగ ప్రక్రియ
ప్రస్తుతం వున రాష్ట్రంలో.. రాష్ట్ర విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు శాసనసభకు వస్తుందనే విషయుంలో విస్తృత స్థారుులో చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయుంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలు, పార్లమెంట్ బాధ్యత, ఈ విషయుంలో రాష్ట్రపతి భూమిక, ఆ రాష్ట్ర శాసనసభ పాత్ర తదితర అంశాలపై విశ్లేషణ.. భారత రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పరిపాలనలో నిర్మాణాత్మకమైన, కీలక పాత్రను పోషిస్తున్నాయి. మన దేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా పరిపూర్ణమైన సమాఖ్య వ్యవస్థగానీ, బ్రిటన్ వలె సంపూర్ణ ఏకకేంద్ర రాజకీయ వ్యవస్థగా పని చేయటం లేదు. ఇందుకు భిన్నంగా భారత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక విశిష్ట సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రవుంలో కొన్ని పరిమితులకు లోబడి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి గుర్తింపునిచ్చారు. అలాంటి అంశాల్లో రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రధానంగా పేర్కొనవచ్చు. రాష్ట్రాల ఏర్పాటు - రాజ్యాంగం: రాజ్యాంగ ఒకటో భాగం, ప్రకరణ ఒకటి నుంచి నాలుగు వరకు కొత్త రాష్ట్రాల చేరిక, ఏర్పాటు మొదలైన అంశాలను సవివరంగా ప్రస్తావించారు. ప్రకరణ ఒకటిలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్& Union of States)’గా వర్ణించారు. సమాఖ్య అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించలేదు. ఎందుకంటే భారత యూనియన్ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రం నుంచి వీడిపోలేవు. ఈ పద్ధతి సాంప్రదాయ సమాఖ్య పద్ధతికి భిన్నమైంది. ఇది రాష్ట్రాలను పట్టి ఉంచే (హోల్డింగ్ టుగేదర్) పద్ధతిలో ఏర్పాటైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయూనికొస్తే.. అక్కడ ఆయూ రాష్ట్రాలను ఒప్పందం ద్వారా ఒక చోటకు చేరతాం (కమింగ్ టుగేదర్) అనే పద్ధతిలో సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేశారు. ప్రకరణ రెండు ప్రకారం: పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దేశంలో అంతర్గత భూభాగాల విషయంలో మార్పులు చేయడంతోపాటు భారత భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడం, ఇతరుల భూభాగాలను భారత్‌లో విలీనం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో పార్లమెంట్‌దే అంతిమ అధికారం. ప్రకరణ మూడు ప్రకారం: పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఎ)కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది రెండు రాష్ట్రాల కలయికతో కావచ్చు (ఉదాహరణకు- ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది) లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం (ప్రస్తుతం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ). గతంలో ఈ విధానంలోనే అత్యధిక రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. బి)రాష్ట్రాల సరిహద్దులను పెంచవచ్చు సి)రాష్ట్రాల సరిహద్దులను కుదించవచ్చు డి)సరిహద్దులను మార్చొచ్చు ఇ)రాష్ట్రాల పేర్లను మార్చొచ్చు ప్రక్రియ: పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో..ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. రాష్ట్రపతి ప్రతిపాదిత బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదిస్తాడు. రాష్ట్రపతి సూచించిన గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. గడవు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా విస్మరించవచ్చు. పార్లమెంట్ ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. బిల్లు వీగిపోతుంది. చివరగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం పొందితే ప్రక్రియ పూర్తి అవుతుంది. కేంద్రం ప్రకటించిన రోజు నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రపతి పాత్ర: నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు శాసనసభలో మెజారిటీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రపతి ఏమి చేయాలో రాజ్యాంగంలో ఎక్కడా వివరించలేదు. కాబట్టి ఈ అంశం రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతికి కొన్ని సంశయాలు ఉంటే రాజ్యాంగంలోని ప్రకరణ 143 (1) కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. పార్లమెంట్ అధికారాలు - సుప్రీంకోర్టు - రాష్ట్ర శాసనసభ పాత్ర: రాష్ట్ర విభజన ప్రక్రియు రాజ్యాంగ బద్ధంగా జరిగిందా లేదా అనే సందేహంపై అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని మూడో ప్రకరణపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ పాత్రను ఎలా నిర్వచించింది, అసెంబ్లీ అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఉంది, అసెంబ్లీకి పంపించిన ముసాయిదా బిల్లుకు ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మధ్య తేడా మొదలైన అంశాలపై 1959లో బాబూలాల్ వర్సెస్ బొంబాయి స్టేట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. విభజన-సుప్రీం తీర్పులు ఒక రాష్ట్ర విషయాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సమ్మతి లేకుండా పార్లమెంట్ స్వయంగా (టఠౌఝౌౌ్ట) శాసనం చేసే అధికారం రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద పార్లమెంట్‌కు ప్రకటించిందో అనే విషయంలో స్పష్టత లేదు. ప్రకరణ మూడు పార్లమెంట్‌కు కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో చట్టం చేసే అధికారం ఉందని మాత్రమే పేర్కొంటుంది. 1956 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల శాసనసభల సమ్మతితో జరిగినందున ఏ సమస్య ఉత్పన్నం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుప్రీం కోర్టు గతంలో చెప్పిన తీర్పులు యథాతథంగా ఇక్కడ వర్తింపజేయడానికి వీలుకాకపోవచ్చు. రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ప్రకరణ రెండు, మూడు ప్రకారం పార్లమెంట్‌కు సంక్రమించిన అధికారాలను ప్రజాస్వామిక ప్రక్రియలో వినియోగించాలని 1967లో ‘మంగల్ సింగ్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రకరణలు రెండు, మూడు, నాలుగు ప్రకారం విభజనకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటును బూట్ మెజార్టీతో పాలక పక్షాలు సాధ్యం చేసుకోవడానికి కూడా హద్దులున్నాయని సుప్రీం కోర్టు ‘పౌద్వాల్ కేసు’లో 1993లో తీర్పునిచ్చింది. పరిపాలన సౌలభ్యం, భౌగోళిక సజాతీయత, ఆర్థిక సౌష్టం వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రాల విభజన, ఏర్పాటు ప్రక్రియ చేయాలని ‘స్టేట్స్ వర్సెస్ యూనియన్’ వివాదంలో అభిప్రాయపడింది. అయితే వీటి వినియోగం, ఇతర ఒప్పందం విషయాల్లో పార్లమెంట్ చట్టాలను ప్రశ్నించడానికి వీల్లేదని ‘ముల్లపెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006’లో తీర్పునిచ్చింది. బిల్లుపై సంబంధిత అసెంబ్లీ: రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పాలి. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత కూడా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినా.. చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీ వినియోగించుకోకపోవడమనేది..పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అడ్డంకి కారాదన్నదే దీని ఉద్దేశం. బిల్లులో తొలుత చేసిన ప్రతిపాదనను కేంద్రం సవరిస్తే, ఆ బిల్లును మరోసారి రాష్ట్ర అసెంబ్లీకి పంపి, అభిప్రాయాలు తీసుకోవాలని కూడా లేదు. ముసాయిదాలో చేసే ప్రతి సవరణపైన అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వస్తే ఇదో అంతులేని ప్రక్రియగా మారుతుంది. పైగా ఈ విషయం వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడినదైతే ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే అంశం సంక్లిష్టంగా మారుతుంది. పార్లమెంట్ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పులపై పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది. శాసనసభలకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన - అధికరణ 371: రాష్ట్రంలో 1969 తెలంగాణ, 1972 జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో, ఇరుప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం కోసం భారత రాజ్యాంగంలో 21వ భాగంలో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371డి, 371ఇ అధికరణలను ప్రత్యేక మెజార్టీతో చేర్చారు. 371 డి ప్రకారం భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని, వివిధ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో సమాన అవకాశాలు, వసతులను కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. జీవోఎం పాత్ర: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించటానికి కమిషన్లు లేదా మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయవ చ్చు. ప్రకరణ మూడు ప్రకారం రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల ఫలితంగా అవసరమైన నిబంధనలను కూడా రాష్ట్ర విభజన బిల్లులో చేర్చవచ్చు. పంపకాల విషయంలో మంత్రుల బృందం వివిధ ఫిర్యాదులను, సలహాలను స్వీకరించి తగిన సిఫార్సులు చేస్తుంది. రాజ్యాంగ సవరణ: ప్రకరణ రెండు, మూడు ప్రకారం ఏదైనా చట్టం చేసినప్పుడు..షెడ్యూల్ ఒకటి, షెడ్యూల్ నాలుగులోని సంబంధిత అంశాలను తప్పనిసరిగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రకరణ 4 (1) స్పష్టం చేస్తుంది. షెడ్యూల్ ఒకటిలో రాష్ట్రాల పేర్లు, షెడ్యూల్ నాలుగులో రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి వివరణ ఉంది. కాబట్టి ఈషెడ్యూల్లోని సంబంధిత అంశాలు ఆటోమాటిక్‌గా సవరించబడతాయి. అయితే ప్రకరణ 4 (2) ప్రకారం అలాంటి చట్టాలను ప్రకరణ 368లో ప్రస్తావించినట్లుగా రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఎందుకంటే ప్రకరణ 368లో సాధారణ మెజార్టీ గురించి ప్రస్తావన లేదు. సమన్యాయం - ప్రాథమిక హక్కు: రాష్ట్రాల ఏర్పాటు అధికారం రాజ్యాంగపరంగా పార్లమెంటుకే ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకమవుతుంది. అభిప్రాయం, మెజార్టీ తదితర అంశాలను సాంకేతికంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు సహేతుక కారణం కూడా చూపాలి. విభజన అనివార్యం అయితే ఏప్రాంత ప్రజలు నష్టపోరాదు. అన్ని సందర్భాల్లో వంద శాతం న్యాయం జరగకపోవచ్చు. ఆదే సందర్భంలో గరిష్ట న్యాయం చేయడం కూడా అసాధ్యం కాదు. సమన్యాయం అంటే భాగస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకొని సమానంగా ప్రయోజనాన్ని పొందడమే. ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు ఈ సూత్రమే పునాది. రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన ప్రక్రియ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశంలోని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 1953లో నియమించిన ఫజల్ అలీ కమిషన్ సూచన ద్వారా ఈ వ్యవస్థీకరణ జరిగింది. పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ................................................................ బొంబాయి రాష్ట్రాన్ని విభజిస్తు గుజరాతీ భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్ర ప్రాంతాన్ని కలుపుతూ గుజరాత్‌ను దేశంలో 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్రగా పేరు మార్చారు. ................................................................ ‘షా’ కమిషన్ నివేదిక మేరకు హిందీ మాట్లాడే ప్రజలకు ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, పంజాబీ భాష మాట్లాడే వారికోసం పంజాబ్ రాష్ట్రాన్ని కొనసాగించారు. ................................................................ మధ్యప్రదేశ్ నుంచి గిరిజన ప్రాంతాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా 2000, నవంబర్ 1న ఏర్పాటు చేశారు. అలాగే అదే ఏడాది ఉత్తరప్రదేశ్ నుంచి నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని, బీహార్ నుంచి నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ................................................................ బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
నవ తెలంగాణ కోసం కొత్త పార్టీ
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : నవ తెలంగాణ నిర్మాణం కోసం ఈనెల 12 తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జూలై 30 తర్వాత ఆ ప్రస్తావనే తేవడం లేదన్నారు. 1969నాటి నుంచి నేటి వరకు తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరవీరుల చరిత్రను మరుగుపరిచేందుకు కుట్రలు జరిగాయన్నారు. అమరులను కనీసం స్మరించుకోకుండా కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రలు, టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించడం శోచనీయమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును పెట్టాలంటూ ఈ నెల 27, 28 తేదీల్లో తెలంగాణ విద్యార్థి ఆధ్వర్యంలో ‘చలో పార్లమెంట్’ను నిర్వహిస్తామని చెప్పారు. -
కొత్త రాష్ట్రాల ఏర్పాట్లు, నదీ జలాల సమస్య పై బిగ్ స్టోరీ
-
రాష్ట్రాల ఏర్పాటులో సీఎం పెద్దన్న పాత్ర పోషించాలి
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో గండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గండ్ర వెంటకరమణారెడ్డి ఆరోపించారు. అయితే రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు ఉదయం వరంగల్‌లో సీమాంధ్ర ఉద్యమంపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యమం కోసం ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానం చేసుకున్నారని సారయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 రోజుల ఉద్యమాన్ని చూసీ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు. -
పునర్నిర్మాణంతో.. జిల్లా పురోగతి
‘తెలంగాణ ప్రజల కల నెరవేరుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యమకారులుగా సంతృప్తితో ఉన్నాం.. అదే ఉద్యమస్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం పునర్నిర్మాణంపై దృష్టి పెడతాం. కొత్త రాష్ట్రంలో, కొత్త లక్ష్యాలతో ప్రజల సమస్యలను దూరం చేయడం కోసం శ్రమిస్తాం’ అని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు(జీవీ) పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పాటుపై ప్రకటన వెలువడడం, మరో నాలుగు నెలల్లోపే కొత్త రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉండడంతో జిల్లా పునర్నిర్మాణంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు, ఎలా ముందుకు సాగనున్నారన్న దానిపై ఆయన ‘సాక్షిప్రతినిధి’తో తన అభిప్రాయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగర్ ఉన్నా, అది కేవలం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మరిన్ని ఎగువ ప్రాంతాలకు అందించే పథకాలపై దృష్టి పెడతాం. ఇప్పటికే జిల్లాకు చెందిన రిటైర్డు ఇంజనీర్లు ఈ విషయంలో కొంత కృషి చేశారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకోవడం, నక్కలగండి ఎత్తిపోతల, కొత్తగా పాలమూరు ఎత్తిపోతల పథకాలు త్వరగా సాకారమయ్యేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాజెక్టుల రూపకల్పనకే ఎంతో సమయం తీసుకుని, ఆ తర్వాత బడ్జెట్ విడుదలలో తీవ్ర వివక్ష చూపుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తి స్థాయిలో అందించేందుకు అవకాశం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌బెల్టు అభివృద్ధి ఇక, జిల్లాలో పర్యావరణం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. కృష్ణానదీ తీరంలోని సిమెంటు పరిశ్రమలు, మూసీ నది వల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల వల్ల పూర్తిస్థాయిలో కాలుష్యం జిల్లాను కమ్ముకుంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, గ్రీన్‌బెల్టు అభివృద్ధికి జిల్లా పునర్నిర్మాణంలో తగిన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. వెనుకబడిన దేవరకొండ వంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేందుకు కొత్త రాష్ర్ట్రంలో వీలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయడం ద్వారా అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావచ్చని మా ఆశాభావం. మెడికల్ కాలేజీ కల సాకారమవుతుంది.. విద్యాపరంగా జిల్లాకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉన్నా ఇప్పటి వరకు సరైన నిధుల్లేవు, సరిపోను ఫ్యాకల్టీ లేదు, పేరుకు మాత్రమే యూనివర్సిటీగా ఉంది. సొంత రాష్ట్రంలో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరవుతుందని ఎందో ఆశపడ్డారు కానీ, చివరి నిమిషంలో రాకుండా చేశారు. ఇపుడు కొత్త రాష్ర్ట్రంలో ఇలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లా మెడికల్ కాలేజీ కలను నిజం చేసుకోవచ్చు. బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. ఫ్లోరైడ్ సమస్యపై ప్రత్యేక దృష్టి.. ఏడు దశాబ్దాలుగా జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఇప్పటి దాకా జరిగిన కృషి అంతంత మాత్రమే. అంతర్జాతీయస్థాయిలో చర్చకూడా జరిగింది. అయినా, ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడలా కాదు. కృష్ణా జలాలను ఆ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో అందించడం ద్వారా ఈ సమస్య మూలాలపై యుద్ధం చేయొచ్చు. పునర్నిర్మాణంలో ప్లాన్ చేసిన సాగునీటి ప్రాజెక్టులతో ఈసమస్యకు పరిష్కారం లభిస్తుంది. జిల్లాలో డిగ్రీ చదువు పూర్తిగా ప్రైవేటు, లేదా ఎయిడెడ్ కాలేజీలకే పరిమితం అయ్యింది. కానీ, కొత్త రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రానికి ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసేలా కృషి చేయాల్సి ఉంది. దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. చిన్న రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది. అలా, కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ర్ట్రంలో జిల్లా అదే తరహాలో సమగ్రమైన అభివృద్ధిని సాధించి తీరుతుంది. ఈ మేరకు పునర్నిర్మాణ ప్రకియలో లబ్ధి పొందేందుకు అంతా శ్రమిస్తాం. -
కొత్త రాష్ట్రాల్లోనే మునిసిపల్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెలలో మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా.. రాష్ర్ట విభజన నిర్ణయంతో ఆ ప్రక్రియ వెనక్కి పోయింది. ఉన్నతస్థాయి నుంచి అందిన సంకేతాల నడుమ రిజర్వేషన్ల అంశాన్ని పురపాలక శాఖ పక్కనపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం లేదని, ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికలపట్ల సముఖంగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని అవసరమైతే రాష్ట్ర హైకోర్టుకు నివేదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సెప్టెంబర్ రెండో తేదీలోగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2011 జనాభా లెక్కలు వచ్చాక నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పు మేరకు ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అయితే అనుకోకుండా కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ), యూపీఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీ నుంచి నిర్ణయం వెలువడిన తరువాత సీమాంధ్ర లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆందోళనలలో ఉద్యోగులు అధికంగా పాల్గొనడమేకాక, ఈ నెల 12వ తేదీ తరువాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యంకాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తిదశకు వచ్చిన తరుణంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితుల వల్ల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు పూర్తయినా, చైర్పర్సన్, మేయర్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఈ రిజర్వేషన్లపై దృష్టిపెట్టడం లేదని ఓ అధికారి వివరించారు. ఆగస్టులో రచ్చబండ నిర్వహించాక ఎన్నికలకు వెళ్లాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంది. అలాగే మునిసిపల్ ఎన్నికల తరువాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావించినా... అప్పటిలోగా రాష్ట్ర విభజన ప్రక్రియ చాలా ముందుకు వె ళ్లిపోయే అవకాశాలు ఉండడంతో అవి కూడా వాయిదాపడక తప్పదని పంచాయతీరాజ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విభజన నేపథ్యంలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాకే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర నిధుల కోసం లేఖ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినందున 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,950 కోట్ల నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తికాకుండా కేంద్రం నిధులు విడుదల చేయడానికి అంగీకరిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. నిధులులేక ఇప్పటికే అభివృద్ధి కుంటుపడిన పంచాయతీలకు కేంద్ర నిధులు వస్తేనే కార్యక్రమాలు ముందుకు సాగే అవకాశం ఉంది. -
కొత్త రాష్ట్రాలకు సీఎంలు ఎవరన్నదానిపై ఆసక్తి