
రాష్ట్రాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక డిమాండ్లు : ప్రణబ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన గురువారమిక్కడ సూచించారు. ప్రజలందరినీ ఒకేచోట కలిపి ఉంచడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక డిమాండ్లు వస్తున్నాయని ప్రణబ్ వెల్లడించారు.