విభజనపై ప్రధాని, రాష్ట్రపతిలకు సీఎం లేఖ
రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానంపై అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మూడు పేజిల లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజనపై కేంద్ర కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కపెట్టాలని లేఖలో సీఎం పేర్కోన్నారు.
అసెంబ్లీలో తీర్మానం తర్వాత, వివిధ స్టేక్ హోల్డర్లలో విశ్వాసం నింపిన తర్వాతనే బిల్లును రాష్ట్రపతికి పంపాలని లేఖలో సూచించారు. స్టేక్ హోల్డర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే విభజనపై దృష్టి సారించాలని లేఖలో తెలిపారు. రాష్ట్ర విభజనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు.