
జిల్లా దశ మారుద్దా..!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కొత్త రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించాలని ప్రజలు కోరుకుంటు న్న తరుణంలో ఇప్పటికే యంత్రాం గం శాఖలన్నింటినీ విభజించింది. జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరమైన లెక్కలు కొత్తగా ప్రారంభించడానికి ఎవరి ఖాతాలు వారికి అప్పగిస్తున్న రోజున కొత్త ఖాతాల్లో పన్నులు, చార్జీలు, ఇతర సేవా పన్నులు సేకరించి ఖజానాను నింపేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మూడు రోజులపాటు సర్వర్లను నిలిపివేశారు. సోమవారం నుంచి కొత్త సర్వర్లు ప్రారంభం కానున్నాయి. ఇకనైనా కొత్తరాష్ట్రంలో జిల్లాలోని ఎన్నో అంశాలు అభివృద్ధి దిశగా పయనించాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ఆన్‌లైన్ మార్పు
కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందే జిల్లాలోని రవాణా, ఖజానా, రిజిస్ట్రేషన్, కలెక్టరేట్‌లోని కొన్ని విభాగాల ఆన్‌లైన్ విధానాలను మార్చారు. కొత్త రాష్ట్రానికి సాధారణ పరిపాలన సరికొత్తగా జరిగేలా రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసుకుంది. జిల్లావిస్తీర్ణం 6538 చదరపు కిలోమీటర్లు కాగా జిల్లా ప్రజలు 23,42,628 మంది. జిల్లాలోని 34 మండలాలు,4 మున్సిపాలిటీల్లో ఎన్నో రంగాలు అభివృద్ధి చెందినట్లు కనిపిస్తున్నా అదంతా మేడి పండు చందంగానే ఉంది. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో జిల్లా సాధించాల్సిన అభివృద్ధి ఎప్పుడూ రాజకీయ కారణాలతో వెనుకపడుతూనే ఉంది. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే జిల్లాలో సాగునీటి రంగం అభివృద్ధి చెందింది. సుమారు రెండు దశాబ్దాలుగా పడకేసిన తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, జంఝావతి రబ్బర్ డ్యాం వంటి ప్రాజెక్టులు ముందుకు కదిలా యి.
కానీ మహానేత ఆకస్మిక మరణంతో అదనపు ఆయకట్టు ప్రతిపాదనలకు కూడా నిధులు లేకపోవడం తో రైతాంగం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. అదేవిధం గా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి మహానేత వైఎస్ హయాంలో రూ. కోట్లాది నిధులు విడుదలయినప్పటికీ ఇప్పటివరకూ వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం వెనుకడుగు వేయడం విచార క రం. తారకరామ తీర్థసాగర్, వెంగళరా య సాగర్, తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ వంటి ప్రాజె క్టులకు నిధులు మంజూరైనా ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. వీటిని ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో అయినా పూర్తి చేస్తారా అన్న ఆశలు జిల్లా రైతుల్లో ఉన్నాయి. అదేవిధం గా పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, ఎస్.కోట వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల స్థాయి పెంపు వంటి ప్రతి పాదనలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటితో పా టు విద్యా రంగంలో కూడా జిల్లాలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సి ఉంది.
రైతులకు ఆర్థిక పరిపుష్టి
అలాగే జిల్లాలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరికి ఏటా రుణాలు ఉంటే గానీ వ్యవసా యం చేసుకోలేని పరిస్థితి ఉంది. వీరికి స్వయంప్రతిపత్తి తో సాగు చేసుకునే విధంగా వారిని ఆర్థికంగా బలోపే తం చేయాల్సి ఉంది. సాగునీటి వనరులను పెంపొందించడంతో పాటు ఉన్న ప్రాజెక్టులను ఆధునికీకరించే దిశగా పాలకులు,అధికారులు కసరత్తు చేయాలి. ఇప్పటికే జిల్లాలో తాగునీటి సమస్యలు అధికమయ్యా యి. ఈ నేపథ్యంలో కొత్తగా తాగునీటి పథకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు వింటున్న ప్రజలు అప్పుడే ఆందోళనకు గురవుతున్నారు. వారు అనుభవంతో చెబుతున్నవో? ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడానికి చేస్తున్నవో? కానీ కొత్తరాష్ట్రంలో నిధుల సమస్య ఉందని, ఉద్యోగుల వేతనాలకే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతూ కొత్త రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా ఆందోళన కలిగించే సంకేతాలు పంపిస్తున్నారు. మనం అభివృద్ధి చెందగలమనే భావనను నాయకులు, అధికార యంత్రాంగం జిల్లా ప్రజల కు కలిగించాలి. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాల్సి న బాధ్యత నాయకులు,అధికారులపై ఎంతో ఉంది. పాలకులు తమవంతు అసమర్థతను కప్పి పుచ్చుకునేం దుకు దారులు వెతుక్కునే మార్గంలో ప్రజలకు ఆందోళన కలిగించే వ్యాఖ్యానాలు మా నుకోవడం ఉత్తమమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.