న్యూ కాలిఫోర్నియా మూమెంట్ వెబ్‌సైట్లో పోస్ట్ చేసిన కొత్త రాష్ట్రం (నీలం రంగులో) మ్యాప్
కాలిఫోర్నియా : అమెరికాలో ఎక్కువ మంది నివసిస్తోన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాను రెండు ముక్కలుగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంది. ‘న్యూ కాలిఫోర్నియా మూమెంట్’ పేరుతో విభజన కోసం పోరాడుతున్న ఉద్యమకారులు సోమవారం తమకు తామే కొత్త రాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. ‘ఇవాళ్టి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు 51’ అంటూ నినాదాలు చేశారు.
కొత్త రాష్ట్రం అవసరమేంటి? : ప్రస్తుతం కాలిఫోర్నియాలో నియంతృత్వ పాలన నడుస్తున్నదని ‘న్యూ కాలిఫోర్నియా’ మూమెంట్ ఆరోపిస్తోంది. ‘‘పన్ను వసూళ్ల తీరు, ప్రభుత్వ నియంత్రణలేమి, ఏక పార్టీ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గంలో సమస్యలను పరిష్కరిచలేం’ అని ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న టామ్ రీడ్ చెప్పుకొచ్చారు.
తీర ప్రాంతాన్ని వదిలెయ్యండి : కాలిఫోర్నియా రాష్ట్రంలో మొత్తం 58 కౌంటీలు ఉన్నాయి. వాటిలో ఫసిపిక్ తీరాన్ని ఆనుకుని ఉండే కౌంటీలను.. మిగతా కౌంటీల నుంచి వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ‘న్యూ కాలిఫోర్నియా’ స్వీయ రాష్ట్ర ప్రకటనపై ఫెడరల్ అధికారులు, రాజకీయ పార్టీలు స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment