
'ఆ రెండు నగరాల' తరహాలో భూసేకరణ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు చండీగడ్, రాయ్పూర్ తరహాలో భూమి సేకరణ చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి, ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ పి.నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్లో నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు మేలు చేసే విధంగా పాలసీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు.
ఏపీ రాజధాని కమిటీ సమావేశమై ఇప్పటికే ల్యాండ్ పూలింగ్పై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ల్యాండ్ పూలింగ్ విధానాలపై చర్చించామన్ని తెలిపారు. ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో రాజధాని కమిటీ సమావేశాలు ఉంటాయని నారాయణ వెల్లడించారు.