హన్మకొండ అర్బన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, నవ తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ 80వ జయంతిని బుధవారం అధికారికంగా నిర్వహించనున్నారు. కొత్త రాష్ట్రంలో తొలి జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో బుధవారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఓరుగల్లు సేవా సమితి ఏర్పాట్లు చేసింది. తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ అవిశ్రాంత కృషి చేశారు. విద్యార్థి దశనుంచి ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్.. మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని చెప్పినా చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆనాగర్యోంతో 2011జూన్ 21న కన్నుమూశారు.
పార్థీవదేహం ఉంచిన చోటే...
జయశంకర్ కన్నుమూసిన తరువాత ప్రజల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌లో ఉంచారు. అనంతరం దశదిన ఖర్మ వరకు పార్కులో జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌ను జయశంకర్ ృ్మతివనం అని పేరుపెట్టారు. రాష్ట్రం ఏర్పాటు అయితన తరువాత స్వయంగా రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ నగరంలో జయశంకర్ ృ్మతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం స్థలపరిశీలన,విగ్రహం ఏర్పాటు వంటి పనుల బాధ్యతలు జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఓరుగల్లు సేవాసమితికి అప్పగించారు. దీంతో నగరంలోని జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు నగరంలోని పలు ప్రదేశాలు పరిశీలించిన సమితి సభ్యులు.. చివరికి బాలసముద్రంలోని ఏకశిలాపార్కు సరైన స్థలమని చెప్పారు.
రూ.1.37కోట్లతో ప్రతిపాదనలు
బాలసముద్రంలోని పార్కులో రూ.1.37కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందకు ప్రతి పాదనలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరాయి. త్వరలో ఈ నిధులు విడుదలవుతాయని కలెక్టర్ మంగళవారం ప్రకటించారు. నిధులు రాగానే అభివృద్ధి పనులు ప్రారంబిస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మాణం, మొక్కల పెంపకం, తాగునీరు, సానిటరీ సౌకర్యాలు, కమ్యూనిటీ హాలు నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం మాత్రం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ల ఆర్థిక సహకారంతో ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు పనులు చేపట్టారు.
10 అడుగుల విగ్రహం ఏర్పాటు
సమితి ఆధ్వర్యంలో సృతి వనంలో బుధవారం నిర్వహించనున్న జయశంకర్‌సార్ 80వ జయంతిని పురస్కరించుకుని*’10లక్షల ఖర్చుతో పది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహంచే జయంతి వేడుకలకు రాష్ట్ర ఉపముఖ్యంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసుదనాచారితో పాటు కలెక్టర్ జి.కిషన్, ఓరుగల్లు సేవాసమితి ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అదేవిధంగా వరంగల్‌లోని విశ్వకర్మ వీధిలో, కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో కూడా జయశంకర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు జయశంకర్ జయంతి
Published Wed, Aug 6 2014 3:26 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM
Advertisement
Advertisement