వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు | new committe for ysrcp telangana | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు

Published Sun, May 8 2016 2:03 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM

వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు - Sakshi

వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు

రాష్ట్రాధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియామకం
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు చెంది న గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియమితుల య్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపిం ది. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ నాయకులు కె.శివకుమార్, డా. ప్రఫుల్లారెడ్డి అభినందించారు.

 రేపు బాధ్యతల స్వీకరణ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఇందులో పాల్గొం     టారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement