play key role
-
'ఉమ్మడి రాజధానిలో పోలీసులదే కీలకపాత్ర'
ఉమ్మడి రాజధాని నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపాయింటెడ్ డేట్‌కు ముందే పోలీస్ శాఖలో స్పష్టత రావాలని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కేంద్రం ఆధీనంలోనే పని చేస్తాయని వెల్లడించారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా కేంద్రమే చూసుకుంటుందని అనిల్ గోస్వామి పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను ఆ బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే అనిల్ గోస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ తదితరులను కలసి సంగతి తెలిసిందే. -
రాష్ట్రాల ఏర్పాటులో సీఎం పెద్దన్న పాత్ర పోషించాలి
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో గండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గండ్ర వెంటకరమణారెడ్డి ఆరోపించారు. అయితే రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు ఉదయం వరంగల్‌లో సీమాంధ్ర ఉద్యమంపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యమం కోసం ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానం చేసుకున్నారని సారయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 రోజుల ఉద్యమాన్ని చూసీ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు.