సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత, తెలంగాణ ద్రోహి అని ఎంపీ వివేక్ ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత, తెలంగాణ ద్రోహి అని ఎంపీ వివేక్ ఆరోపించారు. మాజీ మంత్రి, దళిత నేత టీఎన్ సదాలక్ష్మి 84వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం వేడుకల కమిటీ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వివేక్, డిప్యూటీ సీఎం దామోదర రాజన రసింహ, మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఇందిరాపార్కు చౌరస్తాలో సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలంలో ఆమె చిత్రపటానికి రాజనరసింహ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో వివేక్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్ర హ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించడానికి మూడేళ్లు పట్టిందని, సదాలక్ష్మి విగ్రహ ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.