నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యా లంపాడు పంప్‌హౌస్ నుంచి నీటి విడుద ల కార్యక్రమానికి ఈనెల 17న సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుద్దామా?..వద్దా? అ నే మీమాంస అందరిలోనూ నెలకొంది. ఈ ఖరీఫ్‌లో ర్యాలంపాడు జలాశయం ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ని ర్ణయించారు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యా లంపాడు పంప్‌హౌస్ నుంచి నీటి విడుద ల కార్యక్రమానికి ఈనెల 17న సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుద్దామా?..వద్దా? అ నే మీమాంస అందరిలోనూ నెలకొంది. ఈ ఖరీఫ్‌లో ర్యాలంపాడు జలాశయం ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ని ర్ణయించారు. అయితే ర్యాలంపాడు ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను ప్రారంభించేం దుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించి పెద్దఎ త్తున కార్యక్రమం చేపట్టాలని జిల్లా కాంగ్రె స్ నేతలు ముందుగా నిర్ణయించుకున్నారు. తెలంగాణపై సీఎం తన అభిప్రాయం వెల్లడించి.. సొంతపార్టీ నేతల ఆగ్రహానికి గురైన నేపథ్యంలో ఆయనను జిల్లాకు ఆహ్వానిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కాంగ్రెస్‌పార్టీ నేతలు ఆలోచనలోపడ్డారు.
ముందుగానే సీఎం పర్యటన ఖరారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి *1428 కోట్ల అంచనా వ్యయంతో జల యజ్ఞం పథకంలో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ర్యాలంపాడు రెండోదశ లిఫ్ట్ కింద ఐదు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అంద నుండగా ఈ ఖరీఫ్‌లో 50వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే జూరాల రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మొదటి దశ కింద గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను గతేడాది సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ర్యాలంపాడు వద్ద నిర్మించిన రెండోదశ పంప్‌హౌస్ పనులను ఈనెల 17న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించి ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై గతంలో మంత్రి డీకే అరుణ ముఖ్యమంత్రితో మాట్లాడి తేదీని కూడా నిర్ణయించారు.
ఏం చేద్దామబ్బా?!
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ సాగునీరు, విద్యుత్, విద్య, ఉద్యోగాలు, హైదరాబాద్‌పై స్పష్టత ఇచ్చాకే ముందుకు వెళ్లాలని తన మనోభావాలను వెల్లడించడంతో ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ‘నాయకుడు కుట్రదారు కావొద్దు’ అంటూ సీఎంను ఉద్దేశించి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, ‘సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం’ అంటూ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, ‘హై కమాండ్‌నే ఎదిరిస్తావా.. సోనియా దయతో ఆ సీట్లో కూర్చొన్నావ్’ అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటంతో తెలంగాణ జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించాలా? వద్దా? అని కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారు. అందుకే ర్యాలంపాడు రెండోదశ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ ప్రారంభించేందుకు సీఎంను ఆహ్వానించకపోవడమే మంచిదని జిల్లా కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వర్గంగా ముద్రపడిన డీకే అరుణ కూడా సీఎంను పిలువాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తే ఇబ్బందులు తప్పవని సంకేతాలు అందడంతో నాయకులు ఇరకాటంలో పడ్డారు. అయితే ర్యాలంపాడు రెండోదశ పంప్‌హౌస్‌ను ప్రారంభించకుండా వాయిదావేస్తే ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదలకు ఆటంకం కలుగుతుందని, సీఎం కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ముగిస్తే ఒక పనైపోతుందని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నటు సమాచారం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నారా? లేదా? అని మంత్రి డీకే అరుణ వద్ద ప్రస్తావించగా.. ఈ విషయమై గతంలో ఒకసారి సీఎంతో చర్చించామని తిరిగి వాటి గురించి మాట్లాడలేదన్నారు.