ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడం పార్టీ వ్యతిరేక చర్య అని అన్నారు.