ఢిల్లీ డ్రామా షురూ! | kiran kumar reddy to launch new party under Congress high command direction | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డ్రామా షురూ!

Published Fri, Jan 17 2014 2:23 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

ఢిల్లీ డ్రామా షురూ! - Sakshi

ఢిల్లీ డ్రామా షురూ!

* కిరణ్ నేతృత్వంలో ‘కొత్త పార్టీ’
* అంతా అధిష్టానం ఆదేశానుసారమే
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో డ్రామాకు శ్రీకారం చుట్టింది. అంతర్గతంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తూ, పైకి మాత్రం సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈ కొత్త నాటకానికి తెర లేపుతోంది. తన ఆదేశాలను తు.చ. తప్పకపాటిస్తూ, రాష్ట్ర విభజనను చివరి అంకంవరకు తీసుకొచ్చిన కిరణ్‌ను ఇప్పుడు సమైక్య నినాదం ముసుగులో జనంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సమైక్యం పేరుతో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. సీమాంధ్ర జిల్లాల్లో కొద్ది రోజులుగా దర్శనమిస్తున్న ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులన్నీ అధిష్టానం మొదలుపెట్టిన కొత్త డ్రామాలో అంకమేనన్న విషయం మరో నాలుగు రోజుల్లో ప్రజల ముందు బహిర్గతం కానుంది. త్వరలో ముసుగును తొలగించి కొత్త నాటకంలో తన పాత్రలోకి ప్రవేశించేందుకు కిరణ్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆయన సిద్ధం చేశారు.

రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను సాఫీగా ముగించి, బిల్లు రాష్ట్రపతికి చేరేలా మార్గాన్ని సుగమం చేశాక కిరణ్ ద్వారా కొత్త పార్టీకి అంకురార్పణ చేయించడమే కొత్త నాటకంలో ప్రధానాంశంగా తేలుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలే అందుకు వేదికగా మారనున్నాయి. శుక్రవారం నుంచి, అసెంబ్లీ సమావేశాలు ముగిసే 23వ తేదీ దాకా సమైక్య ప్రచారాన్ని కిరణ్ ముమ్మరం చేస్తారు. ఆ వెంటనే పార్టీ ప్రకటన వంటి పరిణామాలూ ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఉన్నాయని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎనిమిది రోజులూ సభ లోపల, బయట కిరణ్ సమైక్యవాదాన్ని వినిపించడంతో పాటు అందుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించేలా రంగం చేశారు.
 
ఆది నుంచీ...
విభజన కీలక దశలకు ముందు కిరణ్‌కు వాటినే ప్రస్తావిస్తూ, అవి సాధ్యం కానే కావని చెప్పడం, ఆ తరవాత సరిగ్గా అదే దిశగా కేంద్రం చర్యలను పూర్తి చేయడం జరిగిపోతూ వచ్చాయుని గుర్తు చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహించి వచ్చినందునే కిరణ్  కోర్‌కమిటీలో తానేం మాట్లాడానో మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా, సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించినట్లుగా బయుటకు మాత్రం లీకులు ఇప్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతోపాటు యూపీఏ భాగస్వామ్యపక్షాల సమావేశాన్నీ నిర్వహించి వారి ఆమోదాన్నీ తీసుకుంది.

ఈరెండు సమావేశాలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే సమైక్యవాదంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి ఉండేవారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత పది రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా సీఎం వనం దాల్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఆ తరువాత మీడియా సమావేశం పెట్టి నింపాదిగా సమస్యలు ఏకరవు పెడుతూ విభజన ఎలా చేస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లుగా మాట్లాడారు.

తాను చెప్పే సమస్యలను తీర్చాకనే విభజన చేయాలన్నారు. అది పార్టీ నిర్ణయమే తప్ప కేంద్రం నిర్ణయం కాదని, కేంద్రం రాష్ట్ర విభజనపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనకు కారణాలు చూపే పీఠికను రూపొందించడమే కష్టమని చెబుతూ వచ్చారు. తీరా కేంద్ర హోం శాఖ తెలంగాణ నోట్‌ను రూపొందించడంతోపాటు దాన్ని టేబుల్ ఐటెమ్‌గా కేబినెట్ ముందుకు తీసుకురావడం, ఎలాంటి చర్చకు తావులేకుండానే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయినా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా వారం గడిచాక నోరు విప్పారు.
 
మరో వారంలో: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆరోజుతో అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయ సేకరణ పూర్తిచేసి తిరిగి రాష్ట్రపతికి పంపాలి. ఈతరుణంలో సమైక్యం పేరిట కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లోకి పంపే సన్నాహాల వెనుక రాజకీయంగా బలమైన కారణాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి దూసుకుపోతుండడంతో అటు కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడబలుక్కొని ఈ కొత్త నాటకానికి తెర తీసినట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఇప్పటివరకు దేశంలోని అన్ని కాంగ్రెసేతర జాతీయ పార్టీల నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలసి విన్నవించారు.

ఈ దశలోనే సీఎం కిరణ్‌తో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టించేందుకు అసెంబ్లీ వేదికగా సమైక్య ప్రచారం వినిపించేలా కార్యాచరణ రూపొందినట్టు తెలుస్తోంది. ఈ కొత్త పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిన సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ చూస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్ల మేర అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నప్పటికీ ఆ ఎంపీపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక రాష్ట్ర విభజనకు ఆయన అందిస్తున్న సహకారమే కారణమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన ఆదేశాలను తూ.చ తప్పక పాటిస్తున్నందునే చివరి నిముషం వరకు సీఎం సీట్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కొనసాగనిస్తోందని, అలా కాకపోతే ఈపాటికే ఆయన్ను మార్చేసేవారేనని పేర్కొంటున్నారు.

తనకు వ్యతిరేకంగా ఉంటే ఢిల్లీలో విమానం ఎక్కి హైదరాబాద్‌లో దిగేలోపే సీఎంలను మార్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ కిరణ్ పట్ల ఇంత ఉదారతతో ఉందంటే అందుకు కారణం ఆయన విభజనకు పూర్తి సహకారం అందించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సమైక్యం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను ఎలా కట్టడి చేయాలో అంతుబట్టక కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా కొత్త ముసుగులో త్వరలోనే తెరమీదకు రావడానికి సర్వం సిద్ధమైంది.
 
సీమాంధ్రులను మభ్యపెట్టి
విభజనపై అధిష్టానానికి ఆది నుంచి కిరణ్ పూర్తి సహకారాన్ని అందించడమే కాకుండా, సమైక్య ముసుగులో సీవూంధ్ర పార్టీ ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం ద్వారా ఎక్కడా అడ్డంకులు లేకుండా చేయడం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటానంటూ చెబుతూనే, దానిపై చర్చను చివరి దశ దాకా తీసుకెళ్లడమే గాక, సహచర ఎమ్మెల్యేల నుంచి కూడా అందుకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన నైజం అర్థమయ్యాక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా కంగుతిన్నారు.

కిరణ్ సమైక్య నినాదం వెనుక రాష్ట్ర విభజనకు సహకారం, కొత్త పార్టీ వ్యూహం దాగున్నాయని అర్థమై, తాము పూర్తిగా మోసపోయామంటూ ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర సమైక్యతకు కిరణ్ అడుగడుగునా తూట్లు పొడిచిన వైనాన్ని వారు వరుసగా గుర్తుచేసుకుంటున్నారు. విభజనపై ప్రతి అడుగూ కిరణ్‌కు ముందే తెలుసునని, అయినా అధిష్టానంతో కుమ్మక్కై వ్యవహారాన్ని ముందుకు నడిపించారని నిర్ధారణకొస్తున్నారు. గత ఏడాది జనవరిలో జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలోనే అధిష్టానం తెలంగాణపై నిర్ణయుం తీసుకొని కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు తెలిపింది. ఈ విషయాన్ని బొత్సే పలుమార్లు స్పష్టంగా ప్రకటించారు. ఆ సమావేశంలో అధిష్టానం ఆదేశాలకు కిర ణ్ తలూపి, పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన రంగాన్ని సిద్ధంచేశారు.

తెలంగాణపై నిర్ణయం అధికారికంగా ప్రకటించే ముందు అధిష్టానం పార్టీ కోర్‌కమిటీ సవూవేశానికి సీఎంను పిలిచి చర్చించింది. ఈ సమావేశంలో తాను రూపొందించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానానికి కిరణ్ అందించారు. అప్పుడే అధిష్టానం కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి తన ముందున్న రోడ్‌వ్యూప్‌ను కిరణ్‌కు ఇచ్చి, దాని అవులు బాధ్యతను ఆయునపైనే పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.. అందుకే విభజనకు సంబంధించి కేంద్రం వేసే ప్రతి అడుగు కిరణ్‌కు ముందే తెలుసునని పేర్కొంటున్నాయి.
 
అడుగడుగునా బాబు సహకారం
మరోపక్క రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. సభా నాయుకుడిగా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఇద్దరూ పరస్పర సహకారంతో రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయుం వెలువడిన వెంటనే చంద్రబాబు దాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేయడంతోపాటు సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కూడా కోరారు. ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకొనే ప్రతి కీలక దశకు ముందు ఆయన ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పెద్దలకు సహకారం అందించేలా వ్యవహరించారు.

కేబినెట్ ఆమోదం ముందురోజు ఆయన ఢిల్లీలోనే పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఢిల్లీలో సమన్యాయం పేరిట చంద్రబాబు దీక్షకు దిగిన రోజునే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ తరువాత మరో సందర్భంలో బాబు ఢిల్లీయూత్ర సమయంలోనే మంతత్రుల బృందం తొలి భేటీ జరిగింది. అటు కిరణ్, ఇటు చంద్రబాబులు ఇద్దరూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను అనుసరించి విభజన ను ముందుకు నడిపించుకుంటూ తీసుకువచ్చారు. తనపై ఎమ్మార్, ఐఎంజీ భారత్ భూముల కుంభకోణంతోపాటు మద్యం కేసులు ఇతరత్రా అనేక అవినీతిపై విచారణ జరిపించకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రతి అడుగులోనూ కాంగ్రెస్‌కు సహకరించారన్న విషయంలో అనేక విమర్శలొచ్చాయి.
 
చిత్తశుద్ధే ఉండి ఉంటే...
విభజనను వ్యతిరేకించే వ్యక్తే అయ్యుంటే కేబినెట్ నిర్ణయుం తరువాతైనా కిరణ్ వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. తద్వారా సంక్షోభం ఏర్పడి కేంద్రం విభజన నిర్ణయం నుంచి వెనకడుగు వేసేదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. కానీ ఆయన అలా చేయకపోగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాల్సి ఉంటుంది కనుక రాజీనామాలు వద్దంటూ నిలువరించారు.

మరోపక్క సీమాంధ్రలో రెండు నెలలకుపైగా ఉధృతంగా సాగిన ఉద్యోగుల సమ్మెను సైతం భయుపెట్టి, బెదిరించి అర్ధంతరంగా ఉపసంహరించేలా చేసి విభజన ప్రక్రియకు ఆటంకం లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా చేశారు. ఇక రాష్ట్ర విభజనపై కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావలసిన సమాచారాన్ని మొత్తం ఆగమేఘాలపై అందేలా కిరణ్ సహకరించారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించే అధికారం తమకు లేదని, కేవలం విభజన సమస్యల పరిష్కారం మాత్రమే తమ బాధ్యత అని మంత్రుల బృందం ప్రకటించగా అదే బృందం ముందుకు వెళ్లి సీఎం తన అభిప్రాయాలు వినిపించారు. సమైక్యమన్న వాదనపైనే సీఎంకు చిత్తశుద్ధి ఉండి ఉంటే జీఓఎం ముందుకు వెళ్లే వారే కాదు.

రాష్ట్రపతి నుంచి విభజన బిల్లు వచ్చే సమయానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేలా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తేదీలను ఖరారు చేయించారు. రాష్ట్ర విభజన బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పదేపదే విజ్ఞప్తి చేసినా కిరణ్ వినిపించుకోలేదు. సమైక్య తీర్మానం చేస్తే రేపటి రోజున పార్లమెంట్‌లో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తూ అడ్డుకునే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సమైక్య తీర్మానం ప్రతిపాదనపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూవచ్చారు.

ఇలావుండగా, బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చి అది సభకు వెళ్లేలా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బిల్లు తన చేతికి వచ్చిన 17 గంటల్లోనే సీఎం ఆగమేఘాలపై అసెంబ్లీకి పంపారు. మరోవైపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం, చర్చను చేపట్టించడం అంతా నాటకీయు రీతిలో ముందుకు నడిపించారు. చర్చ ప్రారంభమైందా లేదా అన్న దానిపై మూడు రోజుల పాటు రసవత్తర డ్రామాను నడిపించి చివరకు ప్రారంభమైందని తేల్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement