సాక్షిప్రతినిధి, నల్లగొండ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనకడుగు వేశారా..? పులిచింతల ప్రాజెక్టును ఈ నెల 27వ తేదీ.. లేదంటే 30వ తేదీన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించిన మంత్రి ఆదివారం మాట మార్చారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన మంత్రి ఈ అంశంపైనే చర్చించారని అంటున్నారు. అయితే, పులిచింతల ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన వెంటనే జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై తీవ్రంగానే స్పందించారు. ‘పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించే సాకుతో జిల్లాలో అడుగుపెడితే సీఎంను అడ్డుకుంటాం. తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లిస్తారు.
సీఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారు..’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన హెచ్చరికలు పనిచేసినట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ మట్టిమనుషుల సంఘం నాయకుడు వేనేపల్లి పాండురంగారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితర నేతలు కూడా సీఎంను అడ్డుకుంటామని ప్రకటించారు. పై-లీన్ తుపానుతో నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు, వారికి మానసిక ైధె ర్యం కల్పించేందుకు పర్యటన పెట్టుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకోవడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేయాల్సిన పనులన్నీ చేశారు.
ఆయన పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. విజయమ్మను అడ్డుకోవడానికి మంత్రి తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకున్నారు. నిత్యం సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తూ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని జిల్లా పర్యటనకు ఎలా తీసుకువస్తారన్న విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో పునరాలోచనలో పడిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంను కలిసి పర్యటనను మార్పించారని అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈ నెల 30వ తేదీన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఖరారైంది. దీనికి సీఎం రానున్నారు, ఈ మేరకు మాకు సమాచారం అందింది. గుంటూరు జిల్లా సరిహద్దులో ఏర్పాట్లు చేస్తున్నాం.
కానీ, ఎటువైపు ప్రారంభిస్తారో మాకు తెలియదు. నల్లగొండ కలెక్టర్, ఎస్పీలు ఆదివారం పులిచింతలను సందర్శించి ఏర్పాట్లు చూశారు..’ అని పులిచింతల సీఈ సాం బయ్య ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఆదివారం హుజూర్‌నగర్ నియోజకవర్గలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం సీఎం కార్యక్రమం గుంటూరు జిల్లా వైపే జరగనుందని ప్రకటించారు.
మంత్రి ఉత్తమ్.. వెనకడుగు!
Published Mon, Nov 25 2013 3:18 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement