వైఎస్పై నిందలు వేయటం సరికాదు: గుత్తా | Don't Blame YS Rajasekhara Reddy: Gutta Sukhender Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్పై నిందలు వేయటం సరికాదు: గుత్తా

Published Fri, Aug 9 2013 9:46 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

వైఎస్పై నిందలు వేయటం సరికాదు: గుత్తా - Sakshi

వైఎస్పై నిందలు వేయటం సరికాదు: గుత్తా

నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. కిరణ్కుమార్ రెడ్డికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో సర్పంచ్లను గెలిపించుకోలేని ముఖ్యమంత్రి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.... ముఖ్యమంత్రి కార్యక్రమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విభజనకు ఆధ్యుడు ... చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ అపనిందలు వేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు సూచించారు.

కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలనుంచి వచ్చే అనేక అంశాలపై చర్చించాలని, ఆ తరువాతే విభజన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement