నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ లావు నరేంద్రనాథ్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి; హైదరాబాద్: నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ లావు నరేంద్రనాథ్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్లుగా నిమ్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్న నరేంద్రనాథ్ గత ఐదేళ్లుగా ఆ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిమ్స్ డెరైక్టర్ పోస్టు కోసం నియమించిన సెర్చ్‌కమిటీ డాక్టర్ ముకుంద్‌రెడ్డి, డాక్టర్ జీఎస్‌ఎన్ రాజులతో పాటు డాక్టర్ నరేంద్రనాథ్ పేరునూ సూచించింది.
ప్రభుత్వం చివరకు నరేంధ్రనాథ్‌నే ఖరారు చేసింది. వాస్తవానికి ఆయన పదవీకాలం ఆగస్టు 30వ తేదీతోనే ముగిసింది. సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. నరేంద్రనాథ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇంతకుముందు డెరైక్టర్‌గా పనిచేసిన డాక్టర్ ధర్మరక్షక్ అవినీతి ఆరోపణల కారణంగా తప్పుకున్నారు. అప్పటినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని నిమ్స్‌కు ఇన్‌చార్జిగా ఉన్నారు.